గుజరాత్ : తన భార్య గొంతు మగవారిలా రావడమే కాక గడ్డం కూడా ఉంది...కాబట్టి తనకు విడాకులు మంజూరు చేయాలని కోరిన ఓ వ్యక్తి పిటిషన్‌ను గుజరాత్ అహ్మాదాబాద్ ఫ్యామిలి కోర్టు కొట్టి వేసింది. కోర్టు పిటిషన్‌లో ఉన్న వివరాల ప్రకారం అహ్మాదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి పెళ్లికి ముందు తాను తన భార్య మొహాన్ని చూడలేదని కనీసం ఆమె గొంతు కూడా వినలేదన్నాడు. పెళ్లి చూపుల్లో తన భార్యను చూసినప్పుడు ఆమె మొహం మీద పరదా ధరించిందన్నాడు. పరదా తీయమని తన భార్యను కోరితే అది వారి సాంప్రదాయం అని కాబట్టి పరదాను తొలగించకూడదని తన భార్య బంధువులు చెప్పారన్నారు.
కానీ వివాహం అయిన అనంతరం తాను ఆమె మొహం చూసి ఆశ్చర్యపోయానని ఎందుకంటే ఆమెకు మగవారిలాగా గడ్డం ఉందన్నాడు. అంతేకాక ఆమె గొంతు కూడా మగవారి గొంతులాగానే ఉన్నదని తెలిపాడు. ఈ విషయాల గురించి తన భార్య కుటుంబ సభ్యులు పెళ్లికి ముందు తనకు చెప్పకుండా మోసం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఇందుకు సమాధానం చెప్పాలని కోర్టు పిటిషన్‌దారు భార్యను కోరింది. అందుకు ఆమె హార్మోన్ల అసమతుల్యం వల్ల తనకు మొహం మీద వెంట్రుకలు ఉన్న మాట వాస్తవమే అని, కానీ వాటిని తొలగించవచ్చని తెలిపారు.
తన భర్త తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ విడాకులు కావాలని ఇబ్బంది పెడుతున్నాడని తెలిపింది. పిటిషన్‌దారు భార్య తరుపు లాయర్ ఈ విషయాలను కోర్టుకు తెలియజేసాడు. వీరిద్దరి వాదనలు విన్న కోర్టు విడాకులు మంజూరు చేయలేమని భర్త పిటిషన్‌ను కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment