
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన హాస్యనటుడు వేణుమాధవ్ శుక్రవారం ఇక్కడ కాసేపు హల్‌చల్ చేశారు. కోదాడ అసెంబ్లీ స్థానానికి ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేయడానికి ఆయన కోదాడ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. అయితే అవసరమైన అన్ని రకాల పత్రాలు లేకపోవడంతో అధికారులు నామినేషన్ తీసుకోలేమని చెప్పారు.
దాంతో అన్ని రకాల పత్రాలను తీసుకొని మారోసారి వస్తానని ఆయన వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ విలేకరులతో మాట్లాడుతూ కోదాడ ప్రాంత వాసులకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. సోమవారం 19వ తేదీన మళ్లీ వస్తానని, అప్పుడు అన్ని వివరాలు చెబుతానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment