న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీలకు అనుమతి ఇస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సవాల్ చేయగా.. సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సమర్థించింది.
తమిళనాడు వ్యాప్తంగా రూట్ మార్చ్‌లు నిర్వహించాలనుకున్న ఆర్‌ఎస్‌ఎస్‌కు స్టాలిన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ ర్యాలీలపై నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్‌ఐ) దాడులకు పాల్పడే అవకాశం ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని కారణంగా పేర్కొంది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్ఎస్‌ఎస్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిబ్రవరి 10న ర్యాలీలకు అనుమతి ఇస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
అయితే ఈ తీర్పును స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. అక్కడ కూడా నిరాశే ఎదురైంది. సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఇచ్చిన తీర్పుతో తమిళనాడు వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధమవుతోంది.
చదవండి: జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే.. ఓ రాజకీయ పార్టీకి ఎలాంటి అర్హతలుండాలి?
Comments
Please login to add a commentAdd a comment