
జనతా గారేజ్‌కు నో చెప్పిన ప్రభుదేవా?
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో కొరియాగ్రఫీ చేసే అవకాశాన్ని వదులుకున్నాడట ఇండియన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమాలో ఒక పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసే ప్రతిపాదనను ప్రభుదేవా తిరసర్కించాడట. ఎన్టీఆర్ డ్యాన్సింగ్ స్కిల్స్‌ను ఇష్టపడే ప్రభు.. ఎన్టీఆర్ ప్రతిపాదన తోసిపుచ్చడం టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. కేవలం తను దర్శకత్వం వహించే సినిమాలకే నృత్యదర్శకత్వం చేయాలని ప్రభుదేవా నిర్ణయించుకోవడమే ఇందుకు కారణమట.
దీంతో ప్రభుదేవా తిరస్కరించిన ఆఫర్‌ను ఆయన అన్నయ్య, మరో ప్రముఖ కొరియో గ్రాఫర్ రాజు సుందరం అందిపుచ్చుకున్నాడట. " జనతా గారేజ్" లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సాంగ్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ముంబైలో చిత్రీకరించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఓ పాటకు ప్రభుదేవా డాన్స్ కంపోజింగ్ చేస్తున్నాడని, త్వరలోనే ఈ పాట చిత్రీకరణ జరగనుందని వార్తలొచ్చాయి. దీంతో ప్రభు సరికొత్త డ్యాన్స్ జనతా గ్యారేజ్ చిత్రానికి పెద్ద ఎస్సెట్ అవుతుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడ్డారు. కానీ ప్రభుదేవా నిర్ణయంతో వారంతా డీలాపడ్డారు.
కాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో సమంతా, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా తమిళ హీరో మోహన్ లాల్ పెదనాన్న పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.