అంబరీష్ రాజీనామా చెల్లదు | ambareesh’s one line resignation letter rejected by deputy speaker | Sakshi
Sakshi News home page

అంబరీష్ రాజీనామా చెల్లదు

Published Mon, Jun 20 2016 4:30 PM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

అంబరీష్ రాజీనామా చెల్లదు

అంబరీష్ రాజీనామా చెల్లదు

బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, సినీ నటుడు అంబరీష్ ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డి తిరస్కరించారు. మండ్యా అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానంటూ అంబరీష్ ఒకే లైన్తో పంపిన రాజీనామా లేఖ చెల్లదని స్పష్టం చేశారు. సరైన ఫార్మాట్తో రాజీనామా లేఖ పంపాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ ఆయనకు సూచించారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డి స్పీకర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.  

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనను కేబినెట్ నుంచి తొలగించినందుకు నిరసనగా అంబరీష్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సిద్ధరామయ్య.. అంబరీష్ సహా 14 మంది మంత్రులను తొలగించి, కొత్తగా 13 మందిని కేబినెట్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక కాంగ్రెస్లో అసంతృప్తి భగ్గుమంది. అంబరీష్ బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముందని భావిస్తున్నారు.

మంత్రివర్గం నుంచి అంబరీష్ను తొలగించినందుకు ఆయన మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు సినీ ప్రముఖులు కూడా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ముక్కుసూటి మనస్తత్వంగలవారు, నిజాయితీవ్యక్తులు ఈ రోజుల్లో రాణించలేరంటూ అంబరీష్ భార్య, నటి సుమలత ట్వీట్ చేశారు. కాగా మంత్రి పదవి నుంచి అంబరీష్ను తొలగించడం సబబేనంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement