సాక్షి బెంగళూరు: మాజీ మంత్రి అంబరీశ్ పరమపదించి రెండు రోజులు కావొస్తున్నా మాజీ ఎంపీ రమ్య మాత్రం అంతిమ దర్శనానికి రాకపోవడంపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. అంబరీశ్ పేరును ఉపయోగించుకుని, ఆయన అండదండలతో చిత్రరంగం, రాజకీయ రంగాల్లో మండ్య జిల్లాలో వెలుగొందిన రమ్య అంబరీశ్ అంతిమ చూపునకు రాకపోవడం దురదృష్టకరమని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబరీశ్ దయతో ఎంపీ అయిన రమ్య ఢిల్లీ విడిచి ఇటువైపునకు కనీసం చూడకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమ దర్శనానికి రానీ రమ్య మండ్య ప్రజల్లో ఎప్పుడో మాజీ అయ్యారని కొందరు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. రమ్య మొదటిసారి మండ్య లోక్‌సభ స్థానానికి పోటీ చేసినప్పుడు ఆమె గెలుపునకు అంబరీశ్ ఎంతగానో కృషి చేశారు. అయితే అంబరీశ్ పార్థీవ దేహం మండ్యకు వచ్చిన సందర్భంగా ఆమె కూడా వచ్చి ఆయననకు చివరి చూపు చూస్తారని అంతా భావించారు. కానీ రమ్య రాకపోవడంతో మండ్య ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
రమ్య ట్వీట్..
ఈ క్రమంలో అంబరీశ్ మృతిపై మాజీ ఎంపీ రమ్య ట్వీట్ ద్వారా సంతాపాన్ని తెలిపారు. ‘అంబరీశ్ అంకుల్ మీ మరణ వార్త విని నేను తీవ్ర దుఃఖంలో మునిగిపోయాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అంబరీశ్ మృతికి నా సంతాపం. ఆయన ప్రేమను నేను ఎల్ల ప్పుడూ గుర్తుంచుకుంటాను’ అంటూ రమ్య ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment