
కర్ణాటక, యశవంతపుర : నటి, కాంగ్రెస్ నాయకురాలు రమ్య ఓటు హక్కును వినియోగించుకోకుండా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గురువారం ఆమె ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఓటు వేయనందుకు కన్నడిగులు ఆమెకు చీవాట్లు పెట్టారు. ఒకసారి మండ్య నుండి పోటీ చేసి గెలిచిన రమ్య అప్పటి నుంచి కర్ణాటక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గత విధాన సభ ఎన్నికలలో అభ్యర్థుల తరఫున కూడా ప్రచారం చేయలేదు. ఓటు హక్కును వినుయోగించుకోలేదు. మండ్యలో ఓటు వేయటానికి కూడ రాకపోవటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రజలు కూడ రమ్యపై నిప్పులు కక్కుతున్నారు. నటిగా, రాజకీయ నాయకురాలిగా పార్టీలో గుర్తింపు తెచ్చుకున్న రమ్య ఓటు వేయకు పోవటంవల్ల ఇతరులకు ఓటు వేయమని అడిగే హక్కు కూడా రమ్యకు లేదని నిలదీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment