
‘రైల్వే బడ్జెట్‌ను కేసీఆర్, బాబు తిరస్కరించాలి’
సాక్షి,హైదరాబాద్: రైల్వే బడ్జెట్‌లో అతి తక్కువ కేటాయింపులు చేసి తెలుగు రాష్ట్రాలను కేంద్రం అవమానించిందని, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ బడ్జెట్‌ను తిరస్కరించాలని తెలంగాణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహ్మద్ అలీ షబ్బీర్ డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు మొండి చేయి చూపినందుకు నిరసనగా రాష్ట్ర ఎంపీలతో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీఎం కేసీఆర్ నిరసన తెలపాలని అన్నారు. కేంద్ర మంత్రి పదవి కోసమే ఎంపీ కవిత ప్రధాని మోదీని ప్రశంసిస్తున్నారని ఆరోపించారు.