Kangana Ranaut Rejected Dhanush New Movie Titled D50, Deets Inside - Sakshi
Sakshi News home page

D50: ధనుష్‌కు షాక్‌ ఇచ్చిన కంగనా రనౌత్‌?

Published Tue, Jun 13 2023 6:24 AM | Last Updated on Tue, Jun 13 2023 8:50 AM

Kangana Ranaut Rejected Dhanush New Movie - Sakshi

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు సంచలనాలకు చిరునామా, వివాదాలకు పేటెంట్‌ నటి కంగనా రనౌత్‌. ఆమె సమాజంలో జరిగే సంఘటనలపై తనదైనశైలిలో స్పందిస్తుంది. ప్రతిభకు తక్కువ కాదు అనే గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తన సత్తా చాటుకుంటున్న కంగనా తాజాగా దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పరిపాలన, నాటి సంఘటనలతో 'ఎమర్జెన్సీ' చిత్రంలో ఇందిరాగాంధీ పాత్రను పోషించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడం విశేషం. తమిళంలో ఇప్పటికీ ధామ్‌ ధూమ్‌, తలైవి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో అక్కడా అవకాశాలు వస్తున్నాయి. కానీ తమిళ చిత్రాల అవకాశాలను తిరస్కరిస్తుందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది.

(ఇదీ చదవండి: కాబోయే మెగా కోడలు.. ఆమె క్యాస్ట్‌పై తెగ వెతికేస్తున్నారు!)

ఇంతకు ముందు నటుడు శింబు సరసన నటించే అవకాశాన్ని నిరాకరించిన కంగనా రనౌత్‌ తాజాగా నటుడు ధనుష్‌తో జత కట్టే అవకాశానికి నో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ధనుష్‌ పాన్‌ వరల్డ్‌ నటుడు అన్నది తెలిసిందే. కాగా ఈయనలోనూ టాలెంట్‌కు కొదవ లేదు. ఇప్పటికే నటుడిగా, గాయకుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా సక్సెస్‌ అయ్యారు. తాజాగా తన 50వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి ఈయనే దర్శకత్వం వహించనున్నారు. భారీ తారాగణంతో సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని  నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది.

ఇందులో ధనుష్‌కు జంటగా కంగనా రనౌత్‌ను నటింపజేసే ప్రయత్నం చేసినట్లు, ఆమె కాల్‌ షీట్స్‌ సమస్య అంటూ నిరాకరించినట్లు టాక్‌. దీంతో ధనుష్‌ తన అర్ధ సెంచరీ చిత్రంలో నాయకిగా నటి త్రిషను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. దీంతో మరో సౌత్ హీరోకు కంగనా నో చెప్పిందంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

(ఇదీ చదవండి: ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో జజర్దస్త్‌ కమెడియన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement