న్యూఢిల్లీ: ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకాల కోసం తెచ్చిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్(ఎన్‌జేఏసీ) చెల్లుబాటు అంశాన్ని 9 మంది లేదా 11 మంది జడ్జీలున్న విస్తత ధర్మాసనానికి అప్పగించాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీని యోగ్యతపై తొలుత తామే వాదనలు వింటామని, అనంతరం అవసరమైతే విస్తత ధర్మాసనానికి నివేదిస్తామని జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం పేర్కొంది. దీంతోపాటు త్వరలో హైకోర్టుల్లో పదవీకాలం పూర్తికానున్న అదనపు న్యాయమూర్తులు మరో మూడునెలలు కొనసాగేలా ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.