గేట్ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పరీక్ష నిలుపుదలకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ.. యధాతధంగా పరీక్ష నిర్వహణ ఉంటుందని గురువారం తీర్పు వెలువరించింది.
పరీక్షకు 48 గంటల ముందు గేట్ ఎగ్జామ్‌ను పోస్ట్‌పోన్ చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆందోళన, అనిశ్చితి నెలకొంటుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. దేశంలో ఇప్పుడు ప్రతీది తెరుచుకుంటోంది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణం అవుతున్నాయి. ఇలాంటి టైంలో విద్యార్థుల కెరీర్‌తో ఆడుకోలేం. ఇది అకడమిక్ పాలసీకి సంబంధించింది. పర్యవేక్షించాల్సింది వాళ్లు.. మేం కాదు. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించింది బెంచ్.
కొవిడ్-19 థర్డ్‌వేవ్ తరుణంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా గేట్‌ను వాయిదా వేయాలంటూ అభ్యర్థనల మేర పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రెండు పిటిషన్లు దాఖలు కాగా..అందులో ఒకటి అభ్యర్థుల తరపున దాఖలైంది. పిటిషనర్ల తరపున పల్లవ్ మోంగియా, సత్పల్ సింగ్ వాదనలు వినిపించారు. కాగా, సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో యధాతధంగా గేట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment