
న్యూఢిల్లీ: బీజేపీ సస్పెండెడ్ నేత, న్యాయవాది నూపుర్ శర్మకు మళ్లీ ఊరట లభించింది. ఆమె అరెస్ట్ కోసం అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించకుండా తిరస్కరించింది.
ప్రవక్తపై వ్యాఖ్యలతో ముస్లిం కమ్యూనిటీ మనోభావాలను ఆమె దెబ్బ తీశారని, కాబట్టి ఆమెపై కఠిన చర్యల తీసుకోవాల్సిందేనని, అందుకుగానూ సంబంధిత అధికారులను ఆదేశించాలని పిటిషనర్.. అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించే క్రమంలో.. ‘‘ఆదేశాలు జారీ చేసేప్పుడు కోర్టులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి, ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడమే మంచిది’’ అని పిటిషనర్‌కు సూచించారు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్. దీంతో పిటిషనర్ వెనక్కి తీసుకున్నారు.
ముహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యల తర్వాత.. నూపుర్ శర్మ కామెంట్లపై అరబ్ దేశాల నుంచి, భారత్‌లోని ఇస్లాం కమ్యూనిటీ నుంచి తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఒకానొక తరుణంలో సుప్రీం కోర్టు ధర్మాసనం సైతం ఆమెపై నిప్పులు చెరిగింది. అయితే తదుపరి పిటిషన్‌పై విచారణ సందర్భంగా సానుకూలంగా స్పందిస్తూ.. అరెస్ట్ నుంచి ఊరట ఇవ్వడంతో పాటు ఆమెపై దేశవ్యాప్తంగా దాఖలైన.. అవుతున్న ఎఫ్‌ఐఆర్‌లను ఢిల్లీకి బదలాయించాలని సుప్రీం కోర్టు బెంచ్ ఆదేశించింది.
ఇదీ చదవండి: పక్కా ప్లాన్.. అయినా దుస్థితికి కారణాలేంటి?
Comments
Please login to add a commentAdd a comment