కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గురువారం నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగింది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు దాఖలు చేసిన అభ్యర్థుల నామినేషన్లు వివిధ కారణాలతో భారీ సంఖ్య లో తిరస్కరణకు గురయ్యాయి. అభ్యర్థి సంతకాలు లేకపోవడం, పూర్తి వివరాలు పొందుపర్చక పోవడం వంటి కారణాలతో అధికారులు తిరస్కరించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి 13 నామినేషన్లు దాఖలు కాగా, నాలుగు నామినేషన్లు తిరస్కరించారు. తొమ్మిది మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించారు. పెద్దపల్లి పార్లమెంట్‌కు 21 నామి
తిరస్కరణకు గురైన వారు..
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి రితేష్ రాథోడ్ వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. దీంతోపాటు ముస లి చిన్నయ్య, సిడాం గణపతి, రాథోడ్ శ్యామ్‌రావుల నా మినేషన్లు కూడా తిరస్కరణకు గురయ్యాయి. అసెంబ్లీ స్తానాల్లో 65 నామినేషన్లు తిరస్కరించారు. మంచిర్యాల లో అరుణ, జి.వెంకటానంద్‌కృష్ణారావు, కొండేటి సత్యనారాయణ, బెల్లంకొండ మురళీధ ర్, రఘువీరన్, ఇఫ్తేఖార్ అహ్మద్, దీక్షిత్, నర్సయ్య, ఆర్.సునీల్, జె.సతీష్, పి.మధుసూదన్‌రావు నామినేషన్లను తిరస్కరిం చారు. అలాగే ఆసిఫాబాద్‌లో రితేష్ రాథోడ్, చారులత, భగవంత్‌రావు, పి.గోపి, మెస్రం శంకర్.. నిర్మల్‌లో అల్లేటి కవిత, కె.భూషణ్‌రెడ్డి, కూచాడి శ్రీదేవి, వి.రాజేం దర్‌రెడ్డి, ముథోల్‌లో ఓంప్రకాశ్ లడ్డ, ఎల్.నారాయణరెడ్డి, కాంబ్లే దిగంబర్.. సిర్పూర్‌లో కె.విజయ్‌కుమార్, కె.సాయిలీల, గొల్లపల్లి బుచ్చలింగం (రెండు నామినేష న్లు), పాల్వాయి రాజ్యలక్ష్మి, పి.హరీష్‌బాబు, ఎం.మెంగాజీపటేల్ (రెండు నామినేషన్లు), దుర్గం శ్యామ్‌రావు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఖానాపూర్‌లో రాథోడ్ రమేష్, చౌహాన్ ప్రేమలత, ఆత్రం భీంరావు, రవీందర్, శ్రావణ్‌కుమార్, చంద్రశేఖర్, జాదవ్ కృష్ణ, రోహిదాస్, టి.నగేష్, తొడసం నాగోరావు, జగన్, సిడాం శంభు, కుడ్మెత మాధవ్‌రావు, బి. అశోక్, బోథ్‌లో రాములు నాయక్, మెస్రం భీంరావు, మడావి సుమలత, పవార్ చందర్‌సింగ్, అర్క జ్యోతిరాం.. చెన్నూర్‌లో బోడ జనార్ధన్, శ్రీనివాస్, నల్లాల రాజలింగు, సరోజ, సైదాల లక్ష్మయ్య,మల్లయ్య, వి.రాజం, బెల్లంపల్లిలో మూడు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
తిరస్కరణం
Published Fri, Apr 11 2014 3:05 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement