పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో రామాయణం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' సినిమా మొదటి షో నుంచే పలు వివాదాలను క్రియేట్ చేసింది. మరోవైపు సినిమాకు కలెక్షన్స్ భారీగానే వస్తున్నాయనే ప్రచారం జరుగుతుంది. కానీ చివరకు ఈ సినిమా లాభాలను తెస్తోందో, లేదో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
(ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా గ్లామర్ క్లిక్ అవుతుందా?)
అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ ధరకు కొనుగోలు చేసి విడుదల చేశారు. నిజానికి మొదట UV క్రియేషన్స్ నిర్మాతలు 'ఆదిపురుష్' మూవీని తెలుగులో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఏమైందో తెలియదు వారి స్థానంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రూ.185 కోట్లకు కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేసింది.
ఈ క్రమంలోనే ఈ మూవీ తెలుగు రైట్స్‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అమ్మేందుకు పీపుల్స్ మీడియా తీవ్రంగా ప్రయత్నించింది. కానీ దిల్ రాజు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలిసింది. చివరకు నైజాం రైట్స్ అయినా తీసుకోవాలని వారు కోరితే దానిని కూడా దిల్ రాజు సున్నితంగా తిరస్కరించాడట.
శాకుంతలం సినిమా వల్ల అప్పటికే దాదాపు రూ.30 కోట్లకు పైగా నష్టాలను చూసిన ఆయన మళ్లీ రిస్క్ చేయడం ఎందుకని తిరష్కరించాడని తెలుస్తుంది. ఆదిపురుష్ టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో సినిమాపై నమ్మకం లేకపోవడం వల్లే దిల్ రాజు కొనుగోలు చేయలేదని, ఇప్పుడు ఆయన భయం నిజమయిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దిల్ రాజు అంచనా ఎలాంటిదో తేలాలంటే మరో వారం ఆగాల్సిందే.
(ఇదీ చదవండి: అలా అంటున్నవారంతా తెలివి తక్కువ వాళ్లే!: ఆదిపురుష్ డైరెక్టర్)
Comments
Please login to add a commentAdd a comment