- ∙అధికారులు ఇచ్చిన పçహాణీలు చెల్లవంటున్న మేనేజర్లు
- ∙రుణాల కోసం ఇబ్బంది
- పడుతున్న రైతులు
‘1–బీ’లను తిరస్కరిస్తున్న బ్యాంకర్లు
Published Fri, Aug 26 2016 12:17 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
మహబూబాబాద్ : రుణాలు, రుణమాఫీకి సం బంధించి రెవెన్యూ అధికారులు రైతులకు జారీ చేసిన 1–బీ నమూనా (ఆర్‌ఓఆర్) పహాణీలను కొందరు బ్యాంకు మేనేజర్లు తిరస్కరిస్తున్నారు. దీంతో రుణాల కోసం తాము అనేక ఇబ్బందు లు పడాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. బ్యాంకులలో రుణాలు, రుణమాఫీ, ఇతరత్ర అవసరాల కోసం వీఆర్‌ఓలు రూ. 20 తీసుకుని 1బీ, పçహా ణీలను అందజేశారు. అయితే వాటిని కొన్ని బ్యాంకుల మేనేజర్లు అంగీకరించడం లేదని, మీ సేవ కేంద్రాల నుంచి తేవాల్సిందేనని కొర్రీలు పెడుతున్నారనిరైతులు చెపుతున్నారు. రెవెన్యూ అధికారులే బ్యాంకు మేనేజర్లతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. కలెక్టర్ ఆదేశాల మేరకే రైతులకు ఆన్‌లైన్ ద్వారా 1బి, పçహాణీలను అందజేశామన్నారు. ఇందుకోసం ఒక్కో రైతు నుంచి రూ.10 మాత్రమే తీసుకున్నామని తెలిపారు. అయితే వీటిపై రుణాలు ఇచ్చేందుకు కొందరు బ్యాంకు మేనేజర్లు ఇబ్బంది పెడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, వారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.
బ్యాంకులలో తీసుకోవడం లేదు..
రెవెన్యూ అధికారులు ఇచ్చిన 1బి, పహాణీలను మానుకోటలోని ఇండియన్ బ్యాంకు మేనేజర్ అంగీకరించడం లేదు. మీసేవ కేంద్రం నుంచి పహణీ, 1బీ తీసుకురావాలంటున్నారు. రెవెన్యూ అధికారులు రూ.20 తీసుకుని ఇచ్చినా అవి పనికి రావడం లేదు. అధికారులే ఈ సమస్య పరిష్కరించాలి. – రమణ, రైతు
Advertisement
Advertisement