ఢిల్లీ, సాక్షి : మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. వచ్చే వారం వరకు జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైలులో (రిమాండ్ ఖైదీగా) కొనసాగనున్నారు.
కేజ్రీవాల్ తన అరెస్ట్ అక్రమమని, ఈడీ అరెస్ట్‌ను రద్దు చేయాలని నిన్న ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
‘చూస్తాం, పరిశీలిస్తాం’
ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ తిరస్కరించారు. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ బుధవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ముందు తన క్లయింట్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. అందుకు ఈరోజు విచారణకు అనుమతిస్తారో లేదో చెప్పేందుకు ప్రధాన న్యాయమూర్తి నిరాకరించారు. అందుకు ‘చూస్తాం, పరిశీలిస్తాం’ అని చెప్పారు.
అప్పటి వరకు తీహార్ జైల్లోనే
కాగా, కేజ్రీవాల్ అప్పీల్‌పై అత్యవసర విచారణ కోసం సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయదని తెలుస్తోంది. సుప్రీంకోర్టు క్యాలెండర్ ప్రకారం..గురువారం ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా కోర్టు కార్యకలాపాలు జరగవు. శుక్రవారం స్థానిక సెలవుదినం, ఆపై వారం ముగుస్తుంది. సోమవారం తిరిగి సుప్రీం కోర్టు కార్యకలాపాలు పున: ప్రారంభం అవుతాయి. అప్పటి వరకు తీహార్ జైల్లో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది.
మీరు ముఖ్యమంత్రి అయితే ..
నిన్న ఢిల్లీ హైకోర్టు ‘కేజ్రీవాల్ అరెస్ట్‌కు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్ట్, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు మరొక న్యాయం ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హుక్కులేమీ ఉండవు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదంటూ’ కీలక వ్యాఖ్యలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment