కొరియర్ బోయ్లా వచ్చి... | Man steals a gold chian from women, who comes as Courier boy | Sakshi
Sakshi News home page

కొరియర్ బోయ్లా వచ్చి...

Published Wed, Sep 21 2016 6:26 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM

కొరియర్ బోయ్లా వచ్చి...

కొరియర్ బోయ్లా వచ్చి...

హైదరాబాద్: కొరియర్ బోయ్ అంటూ ఇంట్లోకి వచ్చి మహిళ మెడలో చైన్ లాక్కుపోయాడో ఆగంతకుడు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్గదర్శి కాలనీ రోడ్డు నంబర్-6లోని శోభ(23) అనే మహిళ బుధవారం ఉదయం తన ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా కనిపెట్టిన ఓ దుండగుడు ఆ ఇంటి డోర్ బెల్ కొట్టి కొరియర్ అని చెప్పాడు.

నిజమేననుకున్న శోభ బయటకు రావడంతో దుండగుడు ఆమె కళ్లలో కారంకొట్టి.. మెడలోని రెండు తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కుపోయాడు. కొద్దిసేపటికి తేరుకున్న బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement