బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్‌లో 94 రోజులు గడిచిపోయాయి. దాదాపు శుభం కార్డు పడే సమయం వచ్చేసింది. ఉల్టా పుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్ పేరుకు తగినట్లే జరిగింది. ఒక ఎపిసోడ్‌లో ఫైర్ ఉంటే.. మరో ఎపిసోడ్‌లో ఫన్ ఉంటుంది. కానీ ఒక్కోసారి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. గురువారం ఎపిసోడ్ అయితే అమర్, ప్రశాంత్ మధ్య మాటల యుద్ధమే నడిచింది. Day 95 హైలైట్స్ ఇప్పుడు చూద్దాం.
అమర్ Vs అర్జున్
టాస్క్‌లో భాగంగా ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు. అందుకు రీచ్ కావాలంటే కొన్ని ఫన్ టాస్క్‌లలో గెలవాలని రూల్ పెట్టాడు. వాటిలో అమర్, అర్జున్ ఇద్దరూ గెలిచి ఓట్ అప్పీల్ రేసులోకి వచ్చారు. వారిద్దిరిలో ఒకరిని ఎంపిక చేసి ఓట్ అప్పీల్ అవకాశం ఎవరికి కల్పిస్తారో అనే అంశాన్ని మాత్రం ఓట్ల ప్రాతిపదికన కంటెస్టెంట్ల చేతిలో పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఎక్కువ ఓట్లు అర్జున్‌కు రావడంతో ఆయన ఓట్ అప్పిల్ చేసుకున్నాడు. యావర్,పల్లవి ప్రశాంత్, శివాజీ ముగ్గురూ అర్జున్‌కు సపోర్ట్ చేస్తే... శోభ,ప్రియాంక ఇద్దరూ అమర్‌కు సపోర్ట్ చేశారు. దీంతో అర్జున్‌కు మెజారిటీ వచ్చింది.
ఈ ఓటింగ్ విషయంలో కూడా SPY బ్యాచ్‌లోని ముగ్గురితో అమర్ చిన్నపాటి గొడవకు దిగాడు. దీనికి ప్రధాన కారణం అతను ఈ వారం ఎలిమినేషన్‌లో ఉండటం... అర్జున్ లేకపోవడం. దీంతో ఓట్ అప్పీల్ అవకాశం తనకు కల్పించాలని అమర్ బలంగా కోరాడు కానీ SPY బ్యాచ్ ఈ విషయంలో అమర్‌కు ఎలాంటి సాయం చేయలేదు.
శోభ ట్రాప్‌లో యావర్.. ఛీ.. ఛీ.. అంటూ ఫైర్
ఓట్ అప్పీల్ కోసం మరో టాస్క్‌ను బిగ్ బాస్ ఇచ్చాడు. హౌస్‌లోని కంటెస్టెంట్లు అయిన అందరికీ టీ షర్ట్స్ ఇస్తాడు బిగ్ బాస్. ఒక బార్డర్ లైన్‌లో వారందరూ ఉంటూ వారి వద్ద ఉన్న బాల్స్‌ను తను ప్రత్యర్థులు అనుకున్న వారిపై విసరాలి.. అవి ఎవరి టీ షర్ట్‌కు ఎక్కువగా అంటుకుంటాయో వారు ఆ రౌండ్ నుంచి ఎలిమినేషన్ అయినట్లు అని రూల్స్ పెడుతాడు బిగ్ బాస్. ఈ క్రమంలో మొదట శోభపై యావర్ అటాక్ స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో ఆమె కూడా అతనిపై ఫైట్ చేస్తుంది. ఈ సమయంలో యావర్ కోపంతో రెచ్చిపోయి శోభపై ఫైర్ అవుతాడు.
కానీ శోభ చాలా తెలివిగా యావర్‌ను బార్డర్ లైన్ దాటేలా చేస్తుంది. కావాలనే ఆట నుంచి ఆమె బయటకు వస్తుంది. కోపంలో ఉన్న యావర్ అదేమి గమనించకుండా లైన్ క్రాస్ అవుతాడు. దీంతో బిగ్ బాస్ ఇద్దరినీ ఎలిమినేట్ చేస్తాడు. అప్పుడు యావర్ కంట్రోల్ తప్పిపోయి శోభపై ఛీ.. ఛీ.. ఛీ.. అంటూ రెచ్చిపోతాడు. పదే పదే అదే మాటను యావర్ ఉపయోగించడం చాలా తప్పుగా ఉంటుంది. చివరకు శివాజీ కూడా యావర్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు.
కంట్రోల్ తప్పిన అమర్.. పల్లవి ప్రశాంత్ సూపర్
ఇదే బాల్ టాస్క్‌లో అమర్ Vs పల్లవి ప్రశాంత్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. గేమ్‌లో భాగంగా మొదట ప్రశాంత్ వద్దకు అమర్ వెళ్తాడు. ఇద్దరూ టాస్క్‌లో ఫిజికల్ అవుతారు. ఈ క్రమంలో అమర్ గొంతును ప్రశాంత్ పట్టుకుంటే.. అతని చెయిని అమర్ కొరుకుతాడు. కానీ అది ఆటలో అనుకోకుండా జరిగినట్లు భావించవచ్చు. కానీ ఇదే విషయంలో ఇద్దరూ మాటకు మాట పెరుగుతుంది. ఎవరు ఎవర్నీ కొట్టారో తెలుసుకోవాలంటే మెడికల్ రూమ్‌కు పోదాం పదండి అన్నా అంటూ ప్రశాంత్ అంటాడు. ఆ సమయంలో అమర్ కంట్రోల్ తప్పుతాడు. ఎదుట ఉండేది ఒక కంటెస్టెంట్ అనే విషయాన్ని అమర్ మరిచిపోయినట్లు ఉన్నాడు.
ప్రశాంత్ వీపుపై చెయ్యి పెట్టిన అమర్ పదే పదే తోస్తూ మెడికల్ రూమ్‌కు పదా అంటూ నెట్టేస్తాడు. ఆ సమయంలో ప్రశాంత్ పట్ల అమర్ చాలా రూడ్‌గా ప్రవర్తించాడు. తన గొంతును గట్టిగా పట్టుకున్నాడని చెప్పుకొస్తున్న అమర్ కంట్రోల్ తప్పి భారీగానే రెచ్చిపోయాడు. ప్రశాంత్, ఆమర్ మధ్య చాలా సేపు మాటలు యుద్ధం జరిగింది. కానీ ఎక్కడా కూడా ప్రశాంత్ కంట్రోల్ తప్పి మాట్లడలేదు.. పదే పదే అమర్‌ను అన్నా అంటూ తన వాదనను చెప్పుకొస్తున్నాడు.
కానీ అమర్ మాత్రం రెచ్చ గొట్టకు రా అంటూ ప్రశాంత్‌పై ఫైర్ అవుతున్నాడు. తనను తాను ఏ మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయిన ఆమర్ పూర్తిగా ట్రాక్ తప్పాడు. ఆ సమయంలో అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా గ్రహించలేకపోయాడు.. అలా కోపంలో ఉన్న అమర్‌ను చూస్తే ఎవరికైనా భయం వేయడం ఖాయం. అంతలా కంట్రోల్ తప్పాడు.. ఆ కోపంలో ఒకానొక సమయంలో ఏమైనా చేసుకుంటా అంటూ రెచ్చిపోయాడు. ఈ విషయంలో అతనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment