chaitanyapuri police station
-
HYD: ఏసీబీ వలలో చైతన్యపురి కానిస్టేబుళ్లు
సాక్షి, హైదరాబాద్: చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఇద్దరు కోర్టు కానిస్టేబుళ్లుతో పాటు కోర్టు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఒక కేసు విషయంలో నిందితుడి దగ్గర నుంచి కానిస్టేబుల్ డబ్బులు డిమాండ్ చేసినట్లు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. -
హైదరాబాద్: బంగారం చోరీ కేసులో మరో ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: నాగోలు కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, ఈ కేసులో దుండగులు ఉపయోగించిన బైక్‌లు దొంగతనం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. వారు చోరీ చేసిన వాహనాలతోనే దోపిడీకి నిందితులు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఫింగర్ ప్రింట్స్, సీసీ ఫుటేజీ విజువల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. నిందితులు ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్‌గా పోలీసులు గుర్తించారు. మరోవైపు.. దుండగులందరూ 25 ఏళ్ల యువకులు కాగా, ముఖం కనిపించకుండా ఫేస్ మాస్క్‌లు ధరించినట్టు బాధితులు చెబుతున్నారు. అయితే, కల్యాణ్ చౌదరి (34) స్నేహపురి కాలనీ రోడ్‌నంబర్– 6లో మహదేవ్ జ్యువెలరీ దుకాణం నడిపిస్తూ.. ఎన్జీవోస్ కాలనీలో కుటుంబంతో ఉంటున్నారు. గురువారం రాత్రి 9.15 గంటల సమయంలో సికింద్రాబాద్ నుంచి హోల్‌సేల్‌లో బంగారం సప్లై చేసే సుఖ్‌దేవ్ జ్యువెలరీ దుకాణానికి వచ్చాడు. అదే సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్, యాక్టివా బైక్‌లపై వచ్చారు. అనంతరం దుకాణంలోకి చొరబడి షాపు షటర్‌ను మూసివేశారు. లోనికి వచ్చిన ఆగంతుకులు కాల్పులు జరిపారు. దీంతో కల్యాణ్ చౌదరితో పాటు సుఖ్‌దేవ్ గాయపడ్డారు. బ్యాగ్‌లో 3 కిలోల బంగారం.. రూ.5లక్షలు? సికింద్రాబాద్ మోండా మార్కెట్లోని గణపతి జ్యువెల్లర్స్ నుంచి సుఖ్‌దేవ్ బంగారం సప్లై చేసేందుకు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అన్ని ప్రాంతాల్లో తిరిగి చివరికి స్నేహపురి కాలనీలోని మహదేవ్ బంగారం దుకాణానికి వచ్చాడు. ఆయనతో రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా కాల్పులు జరిపిన సమయంలో అక్కడే ఉన్నాడు. కాల్పులు జరిపిన దుండగులు సుమారు 3 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదుతో పరారైనట్లు సమాచారం. సీసీ పుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు.. కాల్పుల ఘటన జరిగిన దుకాణంలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పదిహేను బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టినట్లు ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. కాల్పులు జరిపినవారు షాపు యజమానికి తెలిసిన వారా? లేక గుర్తు తెలియని వ్యక్తులా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాచకొండ జాయింట్ సీపీ సుధీర్‌బాబు, క్రైం డీసీపీ శ్రీబాల ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
తల్లీ, బిడ్డ ఉసురు తీసిన డాక్టర్..!
సాక్షి, హైదరాబాద్: చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మంజు సుధా ఆస్పత్రిలో ఓ డాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఎనిమిది నెలల నిండు గర్భిణి మృతి చెందింది. వివరాలు.. హయత్ నగర్‌కు చెందిన గర్భిణి వసంత కడుపు నొప్పితో బాధపడుతూ వారం రోజుల క్రితం మంజు సుధా ఆస్పత్రిలో చేరింది. డాక్టర్ రాంగోపాల్ ఏం ఫరవాలేదు.. అంతా బాగానే ఉందని చెప్పాడు. అప్పటికే కడుపులో ఉన్న శిశువు మృతి చెంది మూడు రోజులైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ గుర్తించకపోవడంతో వసంత ప్రాణాలు విడిచింది. ఇది గమనించిన రాంగోపాల్.. పేషంట్ కండిషన్ క్రిటికల్‌గా ఉందనీ, వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పాడని బంధువులు తెలిపారు. కాగా, ఆస్పత్రి నుంచి జారుకున్న డాక్టర్ స్థానిక పోలీసులకు లొంగిపోయాడు. రాంగోపాల్‌పై గతంలో కూడా ఇలాంటి ఆరోపణలే ఉన్నాయనీ, ఓ రోగికి హెచ్ఐవీ ఇంజక్షన్ చేసిన నేరంలో ఆయన నిందితుడిగా ఉన్నాడని తెలిసింది. ఇదిలాఉండగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించి తల్లీ, బిడ్డ ఉసురు తీసిన డాక్టర్‌ను కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని వసంత బంధువులు హాస్పిటల్ ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది. -
కొరియర్ బోయ్‌లా వచ్చి...
హైదరాబాద్: కొరియర్ బోయ్ అంటూ ఇంట్లోకి వచ్చి మహిళ మెడలో చైన్ లాక్కుపోయాడో ఆగంతకుడు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మార్గదర్శి కాలనీ రోడ్డు నంబర్-6లోని శోభ(23) అనే మహిళ బుధవారం ఉదయం తన ఇంట్లో ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా కనిపెట్టిన ఓ దుండగుడు ఆ ఇంటి డోర్ బెల్ కొట్టి కొరియర్ అని చెప్పాడు. నిజమేననుకున్న శోభ బయటకు రావడంతో దుండగుడు ఆమె కళ్లలో కారంకొట్టి.. మెడలోని రెండు తులాల బంగారు గొలుసును దుండగుడు లాక్కుపోయాడు. కొద్దిసేపటికి తేరుకున్న బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
హైదరాబాద్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు
హైదరాబాద్: నగరంలో పలుచోట్ల పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎల్బి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, చైతన్యపురి పోలీసు స్టేషన్ల పరిధిలో గురువారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదేవిధంగా షాపింగ్ మాల్స్, స్కూళ్లపై ప్రధాన దృష్టిని కేంద్రీకరించారు. అలాగే స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యం
హైదరాబాద్: డ్యూటీకని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం... న్యూమారుతీ నగర్లో నివసించే ఆటోడ్రైవర్ కత్తుల పరశురాములు కూతురు మౌనిక(20) చైతన్యపురిలోని అనిల్ ట్రేడింగ్ షోరూంలో సేల్స్ గర్ల్‌గా పని చేస్తోంది. మంగళవారం డ్యూటీకని వెళ్లిన మౌనిక తిరిగి రాలేదు. షోరూంలో వాకబు చేయగా తనతో పనిచేసే హాసినితో కలిసి వెళ్లినట్లు తెలిపారు. ఆమెకు ఫోన్ చేయగా సెల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఎక్కడ వెతికినా జాడ తెలియక పోవటంతో గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.