
వారణాసి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, ఆమె కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నాడు వారణాసిలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అస్సీఘాట్ నుంచి దశాశ్వేమేధ ఘాట్ వరకు పడవ ప్రయాణం చేశారు. అనంతరం తల్లీకూతుళ్లు దశాశ్వేమేధ ఘాట్‌లో గంగా నదికి హారతిచ్చారు. తరువాత ప్రాచీన సంకట్ మోచన్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కవిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. (చదవండి: ‘ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి’)
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 28, 2021