సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ దర్శించుకున్నారు. ఆమె.. మంగళవారం వేకువజామున అర్చన సేవలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం, ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. టీటీడీ అధికారులు స్వామివారి చిత్ర పటాన్ని బహుకరించారు. అయితే, నిన్న తిరుమలకి చేరుకున్న కల్వకుంట్ల శోభ, రాత్రి తిరుమలలో బస చేశారు.
మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఐదు కాంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,828. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.53 కోట్లు. సోమవారం తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 28,768గా ఉంది.
Kalvakuntla Shobha, wife of Telangana CM #KCR, went to #Tirumala Monday evening@xpressandhra pic.twitter.com/8Xcd2Ppu4c
— TNIE Telangana (@XpressHyderabad) October 9, 2023
Comments
Please login to add a commentAdd a comment