Kapoors
-
నీతూ కపూర్ కారు ధర అన్ని కోట్లా!
గతంలో సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు కొనుగోలు చేసిన లగ్జరీ కార్లను గురించి చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇలాంటి సంఘటనే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది. నీతూ కపూర్ కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన Maybach GLS600. దీని ధర సుమారు రూ. 3 కోట్లు. ఈ కొత్త లగ్జరీ కారు కొనుగోలుతో ఈమె మేబ్యాచ్ కారుని కలిగి ఉన్న ఓనర్ల జాబితాలో చేరిపోయింది. ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్‌గా భారతదేశానికి దిగుమతవుతుంది. కావున ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. మెర్సిడెస్ మేబ్యాచ్ సెలెనైట్ సిల్వర్, బ్రిలియంట్ బ్లూ, ఎమరాల్డ్ గ్రీన్, కావాన్‌సైట్ బ్లూ, ఇరిడియం సిల్వర్, పోలార్ వైట్ వంటి మల్టిపుల్ కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ధర కొంత ఎక్కువైనప్పటికీ ఈ కారు ఆధునిక డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. మెర్సిడెస్ మేబ్యాచ్ జిఎల్ఎస్600 ఎస్‌యూవీలోని 4.0 లీటర్ వి8 ఇంజన్ గరిష్టంగా 550 బిహెచ్పి పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఈ ఇంజన్ 21 బిహెచ్పి పవర్, 249 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ ఈక్యూ బూస్ట్ స్టార్టర్-జనరేటర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇంజన్ 9 జి-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు జతచేయబడి ఉంటుంది. (ఇదీ చదవండి: మెరిసిన మారుతి.. పడిపోయిన ఎమ్‌జి మోటార్: సేల్స్‌లో టాటా స్థానం ఎంతంటే?) మేబ్యాచ్ జిఎల్ఎస్ 600 కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. కావున ప్రయాణికుల భద్రతకు ఏ డోకా ఉండదు. -
కర్వా చౌత్ : మిస్ యూ శ్రీదేవి
ముంబై: సాంప్రదాయబద్దంగా జరుపుకునే కర్వా చౌత్ రోజున (ఇక్కడ అట్ల తద్ది) కపూర్ కుటుంబం దివంగత అందాల నటి శ్రీదేవిని గుర్తు చేసుకుంది. ఈ పర్వ దినం సందర్బంగా ఎప్పటిలాగానే ఆతిధ్య మిచ్చిన సునీతా కపూర్ (అనిల్ కపూర్‌భార్య) సోషల్‌మీడియాలో షేర్ చేశారు. శనివారం కర్వా చౌత్ పూజలకు హాజరైన ఇతర స్నేహితుల ఫోటోను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఐ మిస్ యూ శ్రీ అంటూ శ్రీదేవిని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకకు బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్‌తోపాటు నీలం కోఠారి, కైకిషాన్ పటేల్, నటుడు వరుణ్ ధావన్ తల్లి లాలి ధావన్, నిర్మాత రేణు రవి చోప్రా ఇతరుల హాజరైన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అలాగే గతంలో శ్రీదేవితో కలిసి కర్వా చౌత్ సంబరాన్ని నెమరు వేసుకుంటూ అప్పటి ఫోటోను కూడా పోస్ట్ చశారు. దీంతో ఈ పోస్ట్‌కు చాలామంది స్పందించారు. శ్రీదేవికి కర్వా చౌత్ అంటే చాలా ఇష్టమనీ, ఈ ఉత్సవాలకు ఎదురు చూసేవారంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు శిల్పాశెట్టి ఒకప్పటి వీడియోను పోస్ట్ చేశారు. బాలీవుడ్ నటుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన అతిలోక సుందరి శ్రీదేవి అనుమానాస్పద పరిస్థితులో బాత్ టబ్‌లో పడి (ఈ ఏడాది ఫిబ్రవరి 24న) చనిపోవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. -
ఖాన్లూ.. కపూర్లూ.. విందుకు రండి!
ఈ ఆదివారం దీపాల పండగ. బట్టలు, మిఠాయిలు, టపాసులు కొనుక్కుంటూ చాలామంది బిజీ బిజీగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ పనులతో పాటు మరో పనితో బిజీగా ఉన్నారు. పండగ సందర్భంగా ఈ కుటుంబం బంధువులు, సన్నిహితులు, స్నేహితులను పిలిచి గ్రాండ్‌గా పార్టీ ఇస్తుంటుంది. ఐదేళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ ఏడాది ఎవర్నెవర్ని ఆహ్వానించాలో లిస్టు తయారు చేసుకున్నారు. ‘బీ రెడీ’ అంటూ పిలుపులు కూడా అయిపోయాయ్. దీపావళి పండగ రాత్రి ఈ పార్టీ జరగనుంది. పార్టీలో పాల్గొనబోతున్న వారిలో కపూర్లూ, ఖాన్లూ కంపల్సరీ. ప్రతి ఏడాదీ వీళ్లు చేసే సందడికి కొదవ ఉండదట. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. విందులో వడ్డించ బోయేవన్నీ సంప్రదాయబద్ధమైన వంటకాలట. భారతీయ మిఠాయిలనే తయారు చేయిస్తున్నారు. నో.. మంచూరియాస్.. నో ఫ్రెంచ్ ఫ్రైస్. ఓన్లీ ఇండియన్ ఫుడ్. వంటకాలన్నీ రుచిగా ఉండేట్లు బచ్చన్ ఇంటి మహరాణులు జయాబచ్చన్, ఐశ్వర్యా రాయ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.