ఖాన్లూ.. కపూర్లూ.. విందుకు రండి! | Amitabh Bachchan and Family are busy in shoping for diwali | Sakshi
Sakshi News home page

ఖాన్లూ.. కపూర్లూ.. విందుకు రండి!

Published Thu, Oct 27 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

ఖాన్లూ.. కపూర్లూ.. విందుకు రండి!

ఖాన్లూ.. కపూర్లూ.. విందుకు రండి!

ఈ ఆదివారం దీపాల పండగ. బట్టలు, మిఠాయిలు, టపాసులు కొనుక్కుంటూ చాలామంది బిజీ బిజీగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ పనులతో పాటు మరో పనితో బిజీగా ఉన్నారు. పండగ సందర్భంగా ఈ కుటుంబం  బంధువులు, సన్నిహితులు, స్నేహితులను పిలిచి గ్రాండ్‌గా పార్టీ ఇస్తుంటుంది. ఐదేళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ ఏడాది ఎవర్నెవర్ని ఆహ్వానించాలో లిస్టు తయారు చేసుకున్నారు. ‘బీ రెడీ’ అంటూ పిలుపులు కూడా అయిపోయాయ్.

దీపావళి పండగ రాత్రి ఈ పార్టీ జరగనుంది. పార్టీలో పాల్గొనబోతున్న వారిలో కపూర్లూ, ఖాన్లూ కంపల్సరీ. ప్రతి ఏడాదీ వీళ్లు చేసే సందడికి కొదవ ఉండదట. పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. విందులో వడ్డించ బోయేవన్నీ సంప్రదాయబద్ధమైన వంటకాలట. భారతీయ మిఠాయిలనే తయారు చేయిస్తున్నారు. నో.. మంచూరియాస్.. నో ఫ్రెంచ్ ఫ్రైస్. ఓన్లీ ఇండియన్ ఫుడ్. వంటకాలన్నీ రుచిగా ఉండేట్లు బచ్చన్ ఇంటి మహరాణులు జయాబచ్చన్, ఐశ్వర్యా రాయ్ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement