గతంలో సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు కొనుగోలు చేసిన లగ్జరీ కార్లను గురించి చాలా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇలాంటి సంఘటనే మళ్ళీ వెలుగులోకి వచ్చింది. రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ ఇటీవల ఖరీదైన జర్మన్ లగ్జరీ కారుని కొనుగోలు చేసింది.
నీతూ కపూర్ కొనుగోలు చేసిన కారు మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన Maybach GLS600. దీని ధర సుమారు రూ. 3 కోట్లు. ఈ కొత్త లగ్జరీ కారు కొనుగోలుతో ఈమె మేబ్యాచ్ కారుని కలిగి ఉన్న ఓనర్ల జాబితాలో చేరిపోయింది. ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్‌గా భారతదేశానికి దిగుమతవుతుంది. కావున ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.
మెర్సిడెస్ మేబ్యాచ్ సెలెనైట్ సిల్వర్, బ్రిలియంట్ బ్లూ, ఎమరాల్డ్ గ్రీన్, కావాన్‌సైట్ బ్లూ, ఇరిడియం సిల్వర్, పోలార్ వైట్ వంటి మల్టిపుల్ కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ధర కొంత ఎక్కువైనప్పటికీ ఈ కారు ఆధునిక డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది.
మెర్సిడెస్ మేబ్యాచ్ జిఎల్‌ఎస్600 ఎస్‌యూవీలోని 4.0 లీటర్ వి8 ఇంజన్ గరిష్టంగా 550 బిహెచ్‌పి పవర్, 730 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఈ ఇంజన్ 21 బిహెచ్‌పి పవర్, 249 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ ఈక్యూ బూస్ట్ స్టార్టర్-జనరేటర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇంజన్ 9 జి-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది.
(ఇదీ చదవండి: మెరిసిన మారుతి.. పడిపోయిన ఎమ్‌జి మోటార్: సేల్స్‌లో టాటా స్థానం ఎంతంటే?)
మేబ్యాచ్ జిఎల్‌ఎస్ 600 కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. కావున ప్రయాణికుల భద్రతకు ఏ డోకా ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment