
విజయ్ చిత్రం నుంచి వైదొలగిన శ్రుతి
భారీ చిత్రం నుంచి వైదొలగినట్లు నటి శ్రుతిహాసన్ తెలిపారు. తమిళంలో విశాల్‌కు జంటగా పూజైరూ. చిత్రంలో నటిస్తున్నారు శ్రుతిహాసన్. దీంతోపాటు తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలావుండగా విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం ఒకదానికి దర్శకుడు శింబుదేవన్ డెరైక్ట్ చేస్తున్నారు. ఇందులో నటి శ్రుతిహాసన్ నటించేందుకు ఒప్పుకున్నారు. దీని గురించి గత వారం తన ఇంటర్నెట్ పేజీలో విజయ్, శింబుదేవన్ చిత్రంలో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నానురూ. అంటూ శ్రుతి తెలిపారు.
శ్రుతిహాసన్ మళ్లీ తాను విడుదల చేసిన ప్రకటనలో కొన్ని మార్పులు జరిగాయని, భారీ చిత్రం ప్రస్తుతం లేదని అన్నారు. హిందీలో వెల్‌కం బ్యాక్‌రూ. చిత్రంలో జాన్ అబ్రహాం, అనిల్ కపూర్‌తోను, రమణ రీమేక్ అయిన కబార్‌రూ. చిత్రంలోను నటిస్తున్నారు శ్రుతి. ఈ రెండు చిత్రాలు 80 శాతం పూర్తయ్యాయి. ఇలావుండగా ఆమె వైదొలగినట్లు చెప్పిన భారీ చిత్రం, విజయ్ చిత్రమేనని చిత్ర వర్గాలు తెలుపుతున్నాయి.