
ముంబై : విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణం పట్ల ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తీవ్ర విచారం వెలిబుచ్చారు. థ్యాంక్యూ మూవీలో కలిసి పనిచేసే సందర్భంలో తన కుమార్తె సోనం కపూర్‌ను ఆయన జాగ్రత్తగా చూసుకున్నారని కొనియాడారు. ఇర్ఫాన్ మరణ వార్త తనను కలించివేసిందని, ఆయన విలక్షణ నటుడని, గొప్పమానవతావాది అని ప్రస్తుతించారు. తన కుమార్తె సోనంను ఆయన చూసకున్న తీరు, మార్గదర్శకంగా వ్యవహరించిన వైనం మరిచిపోలేనిదని అన్నారు.
ఇర్ఫాన్ ప్రతిఒక్కరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని అనిల్ కపూర్ వ్యాఖ్యానించారు. 2011లో సోనం కపూర్, ఇర్ఫాన్‌లు థ్యాంక్యూ మూవీ కోసం కలిసిపనిచేశారు. ఇక అనిల్ కపూర్ ఇర్ఫాన్ ఖాన్‌లు స్లమ్‌డాగ్ మిలియనీర్, డీ-డే, చాకొలెట్ : డీప్ డార్క్ సీక్రెట్స్ వంటి పలు సినిమాల్లో కలిసి నటించారు. కాగా, ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ముంబై కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment