బాలీవుడ్ ప్రముఖ నటుడు అనిల్ కపూర్ మరోసారి సౌత్ ఇండియా సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యానిమల్,ఫైటర్ చిత్రాలలో కీలక పాత్రలలో నటించిన ఆయన విజయాన్ని అందుకున్నారు. దక్షిణాది సినిమాల వల్లనే స్టార్‌గా ఎదిగానని అనిల్ కపూర్ అన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతుంది. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అనే అంశంపై మాట్లాడారు.
'మంచి పాత్రలకు నన్ను ఎంపిక చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని భాషల్లో నన్ను ఆధరిస్తారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుడిగా భావిస్తాను. ప్రస్తుతం వస్తున్న యూత్ ఆలోచనలు చాలా ఆసక్తిగా ఉంటాయి. అందుకే నేను సమయం దొరికితే ఎక్కువగా వారితో సంభాషిస్తాను. నేను హీరోగా ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం దక్షిణాది చిత్రాలే.. బాలీవుడ్‌లో నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఎక్కువగా సౌత్ చిత్రాలే..
దేశంలో ఉండే గొప్ప నటుల్లో ఎక్కువమంది కూడా దక్షిణాది చిత్రాలనే రీమేక్ చేసిన వారే.. అక్కడ గొప్ప యాక్టర్స్ ఉన్నారు. మంచి కథలతో సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలో వచ్చినవే బాహుబలి,ఆర్ఆర్‌ఆర్,పుష్ప,కేజీఎఫ్ వంటి చిత్రాలు ఉన్నాయి. సినిమాలను టాలీవుడ్, బాలీవుడ్ అంటూ విడదీయకండి. అన్నిటినీ భారతీయ చిత్రాలుగానే చూడండి.' అని ఆయన అన్నారు. 1980లో వంశవృక్షం చిత్రం ద్వారా హీరోగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు అనిల్ కపూర్. డైరెక్టర్ బాపు ఆయన్ను పరిచయం చేశారు. బాపు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ ఇప్పటికే పలుమార్లు అనిల్ కపూర్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment