అండర్ గ్రాడ్యుయేషన్! | Sonam Kapoor to complete her graduation this year | Sakshi
Sakshi News home page

అండర్ గ్రాడ్యుయేషన్!

Published Sat, Feb 28 2015 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

అండర్ గ్రాడ్యుయేషన్!

అండర్ గ్రాడ్యుయేషన్!

అనిల్ కపూర్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన వలపుల రాణి సోనమ్‌కపూర్‌కు తీరని కోరికేదో మిగిలిపోయిందట! అది తనను తెగ బాధ పెట్టేస్తుంట! కోరికంటే ఇంకేదోలా ఊహించుకోవద్దు! ‘నా స్టడీస్‌ను పూర్తి చేయలేకపోయా. నాకన్నింటికంటే ఇదే పెద్ద బాధాకరమైన విషయం. అయితే ఈ ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తా.

ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లోనే ఉన్నా. చిన్న వయసులోనే నటిని అవ్వడం వల్ల ట్వల్త్ క్లాస్‌తోనే ఆపేయాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చిందీ చిన్నది. అంతా బానే ఉంది గానీ... ఉన్నట్టుండి సోనమ్‌కు చదువుపై మనసెందుకు వెళ్లిందన్నది అర్థం కాక బీ-టౌన్ ప్రజలు జుట్టు పట్టుకొంటున్నారు. అయితే సోనమ్‌లా బాలీవుడ్‌లో డిగ్రీ పూర్తి చేయలేకపోయినవారు చాలా మందే ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement