సాక్షి,ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ (63) సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఈ వయస్సులో కూడా ఆయన కండల్ని, ఫిజికల్ ఫిట్ నెస్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతుండగా, యంగ్ హీరోలు వావ్....అంటున్నారు. అనిల్ కపూర్ తన ఫిట్ నెస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి "ముఖం కంటే కండరాలు బాగా కనిపించినప్పుడు" అనే క్యాప్షన్ అనిల్ కపూర్ జోడించారు. దీనిపై స్పందించిన మరో హీరో సునీల్ శెట్టి నో ప్రాబ్లమ్ ..యంగ్ ఫేస్ మెచ్యూర్డ్ మజిల్స్.. కిల్లర్ కాంబో..అని కమెంట్ చేశారు. ఇక అనిల్ కపూర్ కుమారుడు, నటుడు హర్షవర్ధన్ కపూర్ "వావ్" అని వ్యాఖ్యానించగా, "ఫైటర్" అంటూ వరుణ్ ధావన్ పేర్కొన్నారు.
గతంలో కూడా ఇలాంటి ఫోటోలతో అనిల్ కపూర్ ఆకట్టుకున్నారు. లాక్ డౌన్ సమయంలో అందరూ కనీసం అర్థగంట సేపు వ్యాయామం చేయాలంటూ సూచించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment