Muscles
-
‘ఫాస్ట్’గా స్లిమ్ కాకండి!
చాలామంది టీనేజర్లు స్లిమ్‌గా ఉండాలని అనుకుంటారు. అయితే అందుకోసం తమలోని కొవ్వులను దహింపజేసుకోకుండా... కడుపు మాడ్చుకుని తమ కండరాలను (మజిల్ మాస్‌ను) కోల్పోతారు. ఇలా ఫ్యాట్‌ను కోల్పోకుండా మజిల్ మాస్‌ను కోల్పోవడం వల్ల చూడ్డానికి సన్నగా, స్లిమ్‌గా అనిపించినప్పటికీ, ఆరోగ్యపరంగా చేస్తే అది మంచి పరిణామం కాదు. అలా జరగకుండా ఉండాలంటే ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. స్లిమ్‌గా మారి ఆరోగ్యకరమైన సన్నటి దేహాకృతిని పొందాలనుకునేవారు తాము రోజూ తీసుకునే క్యాలరీలను బాగా తగ్గించుకుంటారు. ఇందుకోసం వాటర్థెరపీ, ఫ్రూట్థెరపీ, క్యారట్ థెరపీ, జీఎమ్ డైట్ వంటి అనేక ప్రక్రియలను ఫాలో అవుతుంటారు. ఈ డైట్ రెజీమ్‌లతో తమ ఆహారంలో తీసుకోవాల్సిన పిండిపదార్థాలను బాగా తగ్గించుకుంటారు. దీనివల్ల తాము బాగా బరువు తగ్గుతున్నామని అనుకుంటుంటారుగానీ... తాము తమ కండరాల పరిమాణాన్నీ (మజిల్ మాస్)ను / కండరాల శక్తినీ కూడా కోల్పోతున్నామని గుర్తించరు. కండరాలను కోల్పోతుంటే, దాంతోపాటు ఎముక సాంద్రత (బోన్ డెన్సిటీ) ని కూడా కోల్పోతున్నారని కూడా అర్థం. ఇదెంతో ప్రమాదం. ఆరోగ్యంగా సన్నబడాలంటే... మంచి సౌష్ఠవంతో కూడిన శరీరాకృతిని పొందాలంటే దహించాల్సినది కొవ్వులను మాత్రమే. మన దేహపు అవసరాలకు పనికి వచ్చాక మన పొట్ట చుట్టూ పేరుకుపోయి ‘సెంట్రల్ ఒబేసిటీ’ని కలిగించే కొవ్వులను మాత్రమే. తక్కువ పోషకాలతోనే మెటబాలిజమ్ జరిగేలా దేహానికి అలవాటు చేయడమూ సరికాదు... కొన్నిసార్లు సన్నబడాలనే తీవ్రమైన కోరికతో చాలా తక్కువ క్యాలరీలతోనే జీవక్రియలు కొనసాగేలా దేహానికి అలవాటు చేస్తే... అప్పుడు ఆ కొద్దిపాటి ఆహారంతోనే మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ నిర్వహించుకునే సామర్థ్యాన్ని దేహం పొందుతుంది. ఏళ్ల తరబడి అలా చేశాక కొద్దిపాటి అదనపు ఆహారం తీసుకున్నా అది శరీర బరువును విపరీతంగా పెంచేస్తుంటుంది. దీన్నే ‘రెసిస్టెంట్ ఒబేసిటీ’ అని అంటారు. ఈ రెసిస్టెంట్ ఒబేసిటీ వల్ల దీర్ఘకాలం పాటు చాలా చాలా అందంగా కనిపించిన హీరో, హీరోయిన్లు... కెరియర్‌కు దూరంగా ఉన్నప్పుడు కొద్ది వ్యవధిలోనే ఒకేసారి లావెక్కిపోయినట్లుగా కనిపించడం చాలామంది సెలబ్రిటీల్లో కనిపిస్తుంటుంది. కండరాలను కోల్పోకుండానే కొవ్వులను దహించడం ఎలా? సన్నబడి మంచి శరీరాకృతి (స్లిమ్ బాడీ) పొందాలంటే ప్రణాళికాబద్ధంగా కండరాలను (మజిల్ మాస్‌ను) కోల్పోకుండా, అదనపు కొవ్వులను మాత్రమే దహించే విధంగా, ఆరోగ్యకరంగా సన్నబడాలి. స్లిమ్‌గా ఉండాలంటూ భోజనాన్ని మానేస్తే ఒక్కోసారి అనొరెక్సియా నర్వోజా, బులీమియా లాంటి మానసిక సమస్యలూ రావచ్చు. అందుకే బాగా తింటూనే మంచి ఆరోగ్యం కోసం దేహానికి కాస్త కష్టం కలిగించే వ్యాయామాలు చేస్తుండాలి. అయితే అంతగా మంచి ఫిట్నెస్ లేనివారు మాత్రం దేహానికి విపరీతమైన శ్రమ కలిగించని విధంగా తేలికపాటి వ్యాయామం చేస్తూ... క్రమంగా ఫిట్నెస్ను సాధించాలి. ఆ తర్వాత స్టామినాను క్రమంగా పెంచుకుంటూపోవాలి. (చదవండి: పిల్లోలు.. పరుపు ఎలా ఉండాలంటే...) -
అతడిదో ‘చెత్త’ కల(ళ) : గట్టిగా కొట్టాడు సక్సెస్!
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఇండోర్‌కు చెందిన యువకుడికి చిన్నప్పటినుంచీ ఒక అలవాటు ఉండేది. తన పరిసరాల్లో కనిపించిన పనికి రాని వస్తువుల ద్వారా ఏదో ఒక ఉపయోగపడే వస్తువును తయారు చేసేవాడు. ఆ అలవాటే అతడిని అద్భుత కళకారుడిగా తీర్చిదిద్దింది. స్క్రాప్ మెటల్‌తో తన కలలకు ప్రాణం పోసి, అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తున్నాడు. దేశ విదేశాల్లో అతని కళాఖండాలకు ఆదరణ లభిస్తోంది. ఇంతకీ ఎవరా యువకుడు? అతని కథేంటి తెలుసుకుందాం ఈ కథనంలో.దేశంలో చాలా మంది కళాకారులు మట్టి , రాయి, చెక్క, ఇలా అనేక రకాల వస్తువులతో విగ్రహాలు తయారు చేయడం మనకు తెలుసు. ఇండోర్‌లో నివసిస్తున్న ఈ కళాకారుడి విగ్రహాలు మాత్రం చాలా స్పెషల్. ఇండోర్‌కు చెందిన దేవల్ వర్మకు చిన్నప్పటినుంచీ ఫిక్షన్ సినిమాలు, బైక్‌లు అంటే ఇష్టం. చిన్నతనంలో, దేవల్ వారాంతాల్లో తన ఇల్లు ,పాఠశాల చుట్టూ దొరికిన స్క్రాప్‌లను ఉపయోగించి తనకు నచ్చిన విధంగా చిన్న చిన్న వస్తువులను తయారు చేసేవాడు. అదే అతణ్ని గొప్పవాడిగా మలుస్తుందని అస్సలు ఊహింఛలేదు.యువకుడిగా మారిన కొద్దీ, కాస్త విజ్ఞానం అలవడుతున్న కొద్దీ తను చేస్తున్న పనిపై మరింత ఆసక్తి పెరిగింది. కళాశాలకు చేరుకునే సమయానికి, ట్రాన్స్ఫార్మర్స్ వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాల పట్ల ప్రేమతో ప్రేరణ పొంది స్క్రాప్ మెటల్‌తో క్లిష్టమైన నమూనాలను తయారు చేసేశాడు. దీనికి తోడు ప్రముఖ టీవీ షో M.A.D (సంగీతం, కళ , నృత్యం), దాని హోస్ట్ హరున్ రాబర్ట్ నుంచి మరింత ప్రేరణ లభించింది. అలా వ్యర్థ పదార్థాలతో కార్లు, మోటార్ సైకిళ్ల సూక్ష్మ నమూనాలను తయారు చేస్తూ ప్రయోగాలు చేయడం ప్రారంభించాడు దేవల్ వర్మ. View this post on Instagram A post shared by Deval Verma (@devalmetalart) ఈ ఆసక్తి తగ్గట్టుగానే దేవల్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు,స్థానిక గ్యారేజీలు . ఆటోమోటివ్ ఫ్యాక్టరీల దృష్టిని ఆకర్షించాయి. వారినుంచి మెటల్ స్క్రాప్ సేకరించి హార్లే డేవిడ్సన్ అధికారిక లోగో రూపకల్పన గొప్ప మైలురాయిగా నిలిచింది. వారి షోరూమ్ కోసం ఈ స్క్రాప్ ఇన్‌స్టాలేషన్‌ను ప్రత్యేకంగా రూపొందించాడు.ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత దేవల్ క్రియేటివ్ జర్నీ మరింత వేగం పుంజుకోవడమే కాదు, కీలక మలుపు తిరిగింది. తన కళను కరియర్‌గా మలుచుకోవాని నిర్ణయించుకున్నాడు. ప్రారంభంలో తల్లిదండ్రుల నుండి ప్రారంభ అభ్యంతరాలు ఉన్నప్పటికీ, చివరికి కుమారుడికి అండగా నిలిచారు. పూణేలోని MIT ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో ప్రోడక్ట్ డిజైన్‌లో కోర్సును అభ్యసించాడు. అలా దుబాయ్‌లో తొలి ప్రదర్శన సక్సెస్ అయింది. మెటల్ స్క్రాప్‌తో రూపొందించిన రెండు గిటార్లు అందర్నీ విపరీతంగా ఆకట్టుకోవడంతో మెటల్ ఆర్టిస్ట్‌గా వృత్తిపరమైన ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది.ఈరంగంలో నిపుణుల సలహాలను తీసుకుంటూ మరింత పట్టుదల ఎదిగాడు. కళా ప్రపంచంలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపు పొందాడు. మినీ-రోబోట్ ప్లాంటర్ మొదలు అందమైన శిల్పాల వరకు కొలువు దీరాయి. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ అద్భుత కళాఖండాలుగా నిలిచాయి. సింగపూర్, ఇటలీ, అమెరికాలోని కొనుగోలుదారులను కట్టిపడేస్తున్నాయి.దేవల్ వర్మ స్టార్టప్2017 నుండి ఒక సొంత స్టార్టప్‌ను నడుపుతున్నాడు. అతను ఇప్పటివరకు అనేక రకాల శిల్పాలు , కళాఖండాలను తయారు చేశాడు. ఏనుగు, నెమలి, చిలుక, గిటార్, డేగ, ఇండియా మ్యాప్, పువ్వులు ఇలా ఒకటేంటి అనేక రకాల జంతువులు, పక్షుల బొమ్మలను రూపొందించాడు. ముఖ్యంగా హనుమాన్ విగ్రహం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది.అద్భుతమై హనుమాన్ విగ్రహంగుజరాత్లోని గోద్రాకు చెందిన ఓ వ్యాపారవేత్త సోషల్ మీడియా ద్వారా దేవల్ గురించి తెలుసుకుని హనుమంతుని విగ్రహాన్ని తయారు చేయమని ఆర్డర్ ఇచ్చాడు. దీన్ని సవాల్‌గా తీసుకున్న దేవల్ 350 కిలోల స్క్రాప్ ఉపయోగించి, ఏడాది పాటు శ్రమించి హనుమాన్జీ విగ్రహాన్ని రూపొందించాడు. ఇత్తడి స్టీల్ వస్తువులు, గేర్-బేరింగ్‌లతో కండలు తిరిగిన దేహంతో అందమైన హనుమాన్ విగ్రహం చూస్తే ఎవరైనా చేయొత్తి మొక్కాల్సిందే. -
పనుల్లో, ఆటల్లో భుజం గాయపడకుండా జాగ్రత్త పడండి!
భుజం దగ్గర ఉండేది కీలకమైన కీలు. పైగా నిద్రసమయంలో తప్ప... దాదాపుగా కదులుతూ ఉండే భాగం కావడంతో దానికి గాయమయ్యే అవకాశాలు ఎక్కువ. ఇక ఆటల సమయంలోనైతే భుజం, అక్కడి కీలు నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. అందుకే భుజానికి గాయాలవడానికీ, దాంతో అనేక రకాల సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఉదాహరణకు భుజం గూడ తప్పడం (షోల్డర్ డిస్లొకేషన్), రొటేటర్ కఫ్ టేర్, స్లాప్ టేర్స్, టెండనైటిస్, టెండన్ రప్చర్స్ వంటివి. సాధారణంగా ఆటల్లో భుజం తాలూకు గూడ తప్పడం అనే సమస్య ఎక్కువగా వస్తుంటుంది. ఇలా జరిగినప్పుడు దాన్ని సరైన స్థానంలో అమర్చాల్సి ఉంటుంది. దాంతో పరిస్థితి చక్కబడుతుంది. ఇక గూడ తొలగడం అనే ఆ సమస్య నిత్యం జరుగుతూ ఉంటే ‘ఆర్థోస్కోపీ స్టెబిలైజేషన్’ అనే శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఆ శస్త్ర చికిత్స ద్వారా ఈ సమస్యను నిపుణులు చక్కదిద్దుతారు. భుజానికి వచ్చే సాధారణ సమస్యల నివారణ కోసం... ►క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల భుజం కండరాలు బలంగా మారి భుజానికి వచ్చే అనేక సమస్యలు నివారితమవుతాయి ►వ్యాయామంలో తన వీపు భాగంలో ఉండేవీ, వెనకవైపు కండరాలపై కూడా దృష్టిపెట్టడం కూడా అవసరం. చాలా మంది శరీరానికి ముందువైపు ఉన్న కండరాలు బలంగా రూపొందడానికీ, అవి అందంగా మంచి షేప్‌తో కనిపించడానికి తగిన ప్రాధాన్యమిస్తుంటారు. ఆ మేరకే వ్యాయామాలు చేస్తుంటారు. ►అయితే భుజం విషయంలో మాత్రం చేతులకు వెనకవైపున ఉండే కండరాలు కూడా బలంగా రూపొందే వ్యాయామాలు చేయాలి. అప్పుడే భుజం చాలాకాలంపాటు ఆరోగ్యంగా ఉంటుంది ►మధుమేహ వ్యాధిగ్రస్తులకు ‘ఫ్రోజెన్షోల్డర్’ అనే బాధాకరమైన కండిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే డయాబెటిస్‌ను అదుపులో పెట్టుకునేందుకు, ఫ్రోజెన్షోల్డర్ను నివారించుకునేందకు అవసరమైన వ్యాయామాలు చేయడం మంచిది ►కంప్యూటర్‌పై పనిచేసేవారు, వీడియోగేమ్స్ ఆడేవారు, టీవీ చూసేవారు, డ్రైవింగ్ చేసేవారు సరైన భంగిమలో కూర్చోవాలి. వారు నిటారుగా కూర్చొని పనిచేయడం వల్ల కండరాలపైనా, ఇరువైపుల ఉన్న భుజాలపైన సమంగా భారం పడుతుంది. అంతే తప్ప ఒకవైపు ఒంటి పనిచేయడం సరికాదు> ►భుజాలు బెణకడం వంటివి జరిగినప్పుడు అది తగ్గే వరుకు వ్యాయామాలు ఆపేసి, వేడినీటి కాపడం, ఐస్ కాపడం పెట్టాలి. ఇలా చేశాక రెండు రోజుల తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను కలవాలి. -
ఎక్కువ బరువులు ఎత్తడంకంటే ఇలా చేస్తే కండలు ఆరోగ్యంగా పెరుగుతాయి..
జిమ్‌లలో వ్యాయామం నిదానంగా చేయాలి. బరువులతో ఎక్సర్సైజ్ చేసేవారు త్వరగా కండరాలు పెరగాలనే ఉద్దేశంతో బరువులు త్వరత్వరగా పెంచుకుంటూ పోకూడదు. తక్కువ బరువుతో మొదలుపెట్టి... రిపిటీషన్స్ ఎక్కువగా చేయాలి. బరువులతో వ్యాయామం చేసేవారు బరువును పెంచడం చాలా నెమ్మదిగా, నిదానంగా చేయాలి. మరీ ఎక్కువ బరువులు ఎత్తడం వల్ల కండలు ఆరోగ్యకరంగా పెరగవు. హెవీ వెయిట్స్తో కండరం మీద ఎక్కువ భారం పడేలా ఎక్సర్సైజ్ చేయడం కంటే తక్కువ బరువులతో కండరం అలసిపోయేవరకు ఎక్సర్సైజ్ చేయడం మంచిది. కండరాలు పెరగాలంటే మరింత ప్రోటీన్ అందేలా దాన్ని స్టిమ్యులేట్ చేయడం మంచిది. ఇలా స్టిమ్యులేషన్ కలగాలంటే... మరీ ఎక్కువ బరువులు ఎత్తడం సరికాదు. దానికి బదులుగా తమకు సౌకర్యంగా ఉండేంత బరువును మాత్రమే ఎత్తుతూ, కండరం అలసిపోయేవరకు ఎక్సర్సైజ్ చేయాలి. కండరాలు త్వరగా పెరగాలనే ఉద్దేశంతో చాలామంది తాము ఎక్సర్సైజ్ చేసేప్పుడు బరువులను తొందర తొందరగా పెంచుకుంటూ పోతారు. బరువు పెరుగుతున్న కొద్దీ ఎక్సర్సైజ్ రిపిటీషన్స్ తగ్గుతాయి. దాంతో ఆశించినట్లుగా కండరం పెరగదు. చేస్తున్న ఎక్సర్సైజ్ను కనీసం 20 సార్లు (ఇరవై కౌంట్) చేసేందుకు వీలైనంత బరువును మాత్రమే వేసుకోవాలి. ఇలా తక్కువ బరువుతో ఎక్కువ కౌంట్ చేయడం వల్లనే కండరం ఆరోగ్యంగా పెరుగుతుంది. -
కండలు పెరగాలంటే మాంసాహారమే అక్కర్లేదు!
కండరాలు పెరిగి, మంచి శరీర సౌష్ఠవం కలగాలంటే తప్పనిసరిగా మాంసాహారం తినాల్సిన అవసరం లేదంటున్నారు పరిశోధకులు. శాకాహారంలో ఉండే ప్రొటీన్లు సైతం సౌష్ఠవం తో కూడిన కండర నిర్మాణానికి బాగా పనికి వస్తాయని పేర్కొంటున్నారు. కండరాల నిర్మాణానికి, వాటి పెరుగుదలకూ, నిర్వహణకూ ప్రోటీన్ అవసరం. అయితే... బలమైన కండరానికి ప్రొటీన్ కావాలి తప్ప... అది మాంసం నుంచి లభ్యమైందా లేక శాకాహారంలో దొరికిందా అన్నది అంత ప్రధానాంశం కాదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్‌కు చెందిన పరిశోధకులు. వీరు వ్యాయామ నిపుణులైన దాదాపు మూడు వేల మంది స్త్రీ, పురుషుల మీద తమ అధ్యయనాన్ని నిర్వహించారు. వారిని ఆరు గ్రూపులుగా విభజించి, ఆరు రకాలైన వనరుల నుంచి, అంటే... బాగా కొవ్వులు ఎక్కువగా ఉండే పాలు–వాటి ఉద్పాదనలు, చేపలు, వేటమాంసం, చికెన్, కొవ్వు తక్కువగా ఉండే పాలు, బఠాణీ గింజల వంటి పూర్తి పప్పుధాన్యాలను వారికి ఆహారంగా అందించారు. మిగతా పోషకాలను మామూలుగానే ఇచ్చారు. నిర్ణీత సమయం తర్వాత వారి కండరాలలోని మజిల్‌మాస్, కండరాలు బలం, కండరాల సౌష్ఠవం వంటి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని లెక్కించారు. ప్రోటీన్ ఏదైనప్పటికీ మజిల్‌మాస్, బలం, సౌష్ఠవం వంటి అంశాల్లో పెద్ద తేడాలేమీ కనిపించలేదు. పైగా డాక్టర్ కెల్సే మ్యాంగనో బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అధ్యయన పరిశోధనలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. అదేమిటంటే... శాకాహార ప్రొటీన్‌పై ఉంచిన వారిలో ప్రోస్టేట్‌కు సంబంధించిన కొన్ని అనర్థాలు కనిపించలేదు. పైగా సోయాబీన్స్ వంటి శాకాహార ప్రోటీన్ల సహాయంతో బాడీబిల్డింగ్ చేసిన వారు మిగతావారి తో పోలిస్తే దీర్ఘకాలం బతికినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ పరిశోధనల వివరాలను అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురించారు. చదవండి: రాహుల్ కండలపై నెటిజన్ల ట్రోలింగ్ -
రాహుల్ కండలపై నెటిజన్ల ట్రోలింగ్
ఇటీవల కేరళ పర్యటనలో ఒక్కసారిగా సముద్రంలో దూకి ఈత కొట్టడం.. దాంతోపాటు కొద్దిసేపు వల పట్టుకుని చేపలు పట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఈత కొట్టిన అనంతరం తడి బట్టలతో బయటకు వచ్చిన రాహుల్‌ను అందరూ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ కండలపైనే చర్చ చేస్తున్నారు. ఫిబ్రవరి 25వ తేదీన రాహుల్ కేరళలోని కొల్లం జిల్లా పర్యటనకు రాహుల్ వచ్చాడు. తంగసరి బీచ్‌లో రాహుల్ ఒక్కసారిగా ఆరేబియా సముద్రంలో దూకి కొద్దిసేపు ఈతకొట్టారు. చల్లటి నీటిలో ఈతకొట్టిన అనంతరం పైకి రాగా నలుపు రంగు చొక్కాలో రాహుల్ కండలు కనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోలు రావడంతో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఔరా రాహుల్ కండలు.. అంటూ నోరెళ్లబెడుతున్నారు. బాక్సర్ మాదిరి కండలు పెంచారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫిట్నెస్ టిప్స్ చెప్పాలని ట్విటర్, ఇన్‌స్టా, ఫేసుబుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో అడుగుతున్నారు. ఈ ఫొటోను చూసి భారత బాక్సర్ విజేందర్ సింగ్ కూడా స్పందించాడు. బాక్సర్ కండలు.. చాలా ధైర్యం గల ప్రజల వ్యక్తి ముందుకు సాగిపో అని విజయేందర్ సింగ్ ట్వీట్ చేశాడు. రాహుల్ ఒక బాక్సర్.. బౌన్సర్‌గా కనిపిస్తున్నాడని ట్రోల్ చేస్తున్నారు. వంటలు.. ఈత కొట్టడం.. చేపలు పట్టడం రాహుల్ కొత్త హాబీస్ అని చెబుతున్నారు. దీనిపై ఫన్నీ మీమ్స్ కూడా తయారవుతున్నాయి. -
అనిల్ కపూర్ "కిల్లర్ కాంబో'' వైరల్
సాక్షి,ముంబై: బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ (63) సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. ఈ వయస్సులో కూడా ఆయన కండల్ని, ఫిజికల్ ఫిట్ నెస్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతుండగా, యంగ్ హీరోలు వావ్....అంటున్నారు. అనిల్ కపూర్ తన ఫిట్ నెస్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనికి "ముఖం కంటే కండరాలు బాగా కనిపించినప్పుడు" అనే క్యాప్షన్ అనిల్ కపూర్ జోడించారు. దీనిపై స్పందించిన మరో హీరో సునీల్ శెట్టి నో ప్రాబ్లమ్ ..యంగ్ ఫేస్ మెచ్యూర్డ్ మజిల్స్.. కిల్లర్ కాంబో..అని కమెంట్ చేశారు. ఇక అనిల్ కపూర్ కుమారుడు, నటుడు హర్షవర్ధన్ కపూర్ "వావ్" అని వ్యాఖ్యానించగా, "ఫైటర్" అంటూ వరుణ్ ధావన్ పేర్కొన్నారు. గతంలో కూడా ఇలాంటి ఫోటోలతో అనిల్ కపూర్ ఆకట్టుకున్నారు. లాక్ డౌన్ సమయంలో అందరూ కనీసం అర్థగంట సేపు వ్యాయామం చేయాలంటూ సూచించిన సంగతి తెలిసిందే. View this post on Instagram When muscles look better than your face... A post shared by anilskapoor (@anilskapoor) on Aug 18, 2020 at 1:51am PDT -
పిల్లల్లో రెక్టల్ ప్రొలాప్స్
కొంతమంది పిల్లల్లో మల విసర్జన చేయిస్తున్నప్పుడు పేగు కిందికి జారినట్లుగా అనిపిస్తుంది. ఇలా జరగడం వల్ల పిల్లలకు బాధగా కూడా అనిపించదు గానీ దాన్నిచూసి చాలామంది తల్లిదండ్రులు ఆందోళన పడటం చాలా సాధారణం. ఇలా మల ద్వారం నుంచి పేగు కిందికి జారినట్లుగా కనిపించే సమస్యను రెక్టల్ ప్రొలాప్స్ అంటారు. మలద్వారానికి సంబంధించిన మ్యూకస్ పొరల్లో కొన్ని లేదా అన్ని పొరలూ బయటకు చొచ్చుకు రావడంతో ఇలా జరుగుతుంది. (కొన్ని సందర్భాల్లో రెక్టల్ పాలిప్ ఇదే విధంగా మనకు కనపడవచ్చు). పిల్లల్లో అయితే అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఈ సమస్య కనిపించినా, పెద్దవారి విషయానికి వస్తే మహిళల్లో ఈ సమస్య ఎక్కువ. పిల్లల్లో ఈ సమస్యకు కారణాలు ►ఇది పిల్లలు నిలబడటం మొదలుపెట్టాక (స్టాం డింగ్ పొజిషన్లోకి వచ్చాక) బయటపడవచ్చు. ఒకసారి కండరాల బలం పెరగగానే తగ్గిపోవడం కూడా చూస్తుంటాం. ►ఈ సమస్యకు నిర్దిష్టంగా కారణం లేకపోయినప్పటికీ డయేరియా, మలబద్దకం వంటివి ముఖ్యకారణాలు. ►ముక్కుతూ ఎక్కువసేపు మలవిసర్జన చేయాల్సి వచ్చిన పిల్లల్లో కనిపిస్తుందిది. ►నిమోనియా, కోరింత దగ్గు, పోషకాహార లోపం, కడుపులో నులిపురుగులు ఉండటం వల్ల, నరాలకు సంబంధించి ముఖ్యంగా వెన్నుపూస వంటి ఇతర సమస్యలు కూడా కారణాలు. ►సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి సమస్య వల్ల కూడా రెక్టల్ ప్రొలాప్స్ వచ్చే అవకాశం ఉంది. చికిత్స ►చాలామంది పిల్లల్లో సహజంగా ఈ సమస్య దానంతట అదే తగ్గిపోతుంటుంది. ఐతే మలబద్దకం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ►పీచుపదార్థాలు, నీటిశాతం ఎక్కువ ఉన్న ఆహారం ఇవ్వడం. ►అవసరమైతే స్టూల్ సాఫ్ట్‌నర్స్ అంటే... లాక్టిలోస్, మినరల్ ఆయిల్ వంటివి వాడితే మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. ►నులిపురుగులు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ పోవడానికి చికిత్స చేయాలి. ►కొన్ని సందర్భాల్లో మాన్యువల్ రిడక్షన్ అనే ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా చాలావరకు ఫలితం ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో మలద్వారంలో ఇంజెక్షన్స్ చేయాల్సి రావచ్చు. ►కొద్దిమందిలో అల్సర్, దానిపై గాయం అవ్వడం వల్ల సమస్య మరింత తీవ్రతరమైతే ప్రత్యేకమైన చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. ఈ సమస్య విషయంలో ఆందోళన అవసరం లేదు. సాధారణంగా ఈ సమస్య దానంతట అదే తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువ. అయితే మరింత సమస్యాత్మకంగా మారకుండా ఉండటానికి పిల్లల డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
టెండనైటిస్ తగ్గుతుందా?
నా వయసు 39. నేనొక క్రీడాకారుణ్ణి. కొంతకాలంగా చేయి కదిలించినప్పుడు భుజంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే టెండన్స్‌కి సంబంధించిన సమస్య అని చెప్పారు. హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? మీరు తెలిపిన లక్షణాలను బట్టి మీరు టెండినైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్ అని అంటాము. వీటికి సాగగల గుణం ఉండటం వల్ల అవి కండరాలు ముడుచుకునే సమయంలో, ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతనైనా వీటికి హానికలిగితే, కదలికలు ఇబ్బందికరంగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ టెండన్స్ ఇన్ఫెక్షన్కు గురికావడాన్ని టెండినైటిస్ అంటారు. శరీరంలో ఎక్కడైనా ఏర్పడే ఈ సమస్య... భుజాలలో, మోచేతుల్లో, మణికట్టు, బొటనవేలు మొదటి భాగంలో, తుంటి, మోకాలు, మడమలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. 40 ఏళ్లు పైబడిన వారిలో సాధారణంగా టెండాన్స్ సాగేతత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గడం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ►కారణాలు: వృత్తిరీత్యా లేదా హాబీల కారణంగా టెండన్స్‌పై అధిక ఒత్తిడి కలిగించే ఒక రకమైన కదలికలను ఎక్కువగా కొనసాగించడం. ఉదా: కంప్యూటర్ కీ–బోర్డులు, మౌస్‌లు ఎక్కువగా వాడటం, కార్పెంటింగ్, పెయింటింగ్ మొదలైనవి. ►క్రీడల వల్ల: ►పరుగెత్తడం, టెన్నిస్, బాస్కెట్‌బాల్, గోల్ఫ్, బౌలింగ్ మొదలైనవాటివల్ల. ►డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి ఇబ్బందులతో బాధపడేవారు ►కొన్ని ఇన్ఫెక్షన్లు లక్షణాలు: టెండినైటిస్‌కి గురైన ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం, ఆ భాగాన్ని కదిలించినప్పుడు నొప్పి అధికమవ్వడం, వాపు, చేతితో తాకితే ఆ ప్రదేశం వేడిగా అనిపించడం, ఎర్రగా మారడంవంటి లక్షణాలు. జాగ్రత్తలు: ►కంప్యూటర్లను, కీబోర్డులను, మౌస్‌లను సరైన పొజిషన్లో సర్దుబాటు చేసుకోవడం. ►పనిలో కొంత విశ్రాంతి తీసుకోవడం ►వ్యాయామాలు ఒకేసారి అధిక ఒత్తిడికి గురిచేసేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించడం ►క్రీడలలో కోచ్ సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం. చికిత్స: కాన్స్టిట్యూషనల్ విధానంలో చికిత్స అందించడం ద్వారా రోగ నిరోధకశక్తిని సరిచేసి టెండన్స్‌ను దృఢపరచి సమస్యను సమూలంగా నయం చేయవచ్చు. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ నడుమునొప్పి తగ్గుతుందా? నా వయసు 42 ఏళ్లు. నాకు కొద్దికాలంగా తీవ్రంగా నడు ము నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే అది డిస్క్ సమస్య అని, ఆపరేషన్ అవసరమవుతుందన్నారు. హోమియో చికిత్స ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండా నా సమస్య తగ్గుతుందా? నడుమునొప్పి తగ్గితే చాలని సర్జరీకి సిద్ధపడితే... ఒకవేళ ఆ ఆపరేషన్ విఫలమైతే కొత్త సమస్యలు మొదలవుతాయి. ఆ బాధలు చెప్పనలవి కాదు. చాలా మంది విషయంలో ఇదే జరుగుతుంది. డిస్క్‌లో సమస్య అని సర్జరీ చేస్తే అది కొత్త అనర్థాలకు కారణమవుతుంది. తప్పుడు భంగిమల్లో కూర్చుని, గంటల తరబడి అదేపనిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. నిజానికి డిస్క్, స్పాండిలోసిస్ వంటి సమస్యలను ఆపరేషన్ అవసరం లేకుండానే హోమియో మందులతోనే సమూలంగా తగ్గించే వీలుంది. నడుము భాగంలో విపరీతమైన నొప్పి వస్తున్నట్లయితే దాన్ని లంబార్ స్పాండిలోసిస్ అంటారు. నడుమునొప్పి కారణంగా ఏ పనీ చేసుకోలేకపోవడం వంటి అసహాయత ఏర్పడుతుంది. ఉదయం వేళల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఆ నొప్పి క్రమంగా నడుము నుంచి కాళ్లలోకి పాకుతుంది. మహిళలకు మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవడం వంటి సమస్యలు సైతం వచ్చే అవకాశాలున్నాయి. లంబార్ స్పాండిలోసిస్‌తో దీర్ఘకాలం బాధపడే వారిలో శృంగార సమస్యలూ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాధి నిర్ధారణ: ఎక్స్–రే, ఎమ్మారై స్కాన్ ద్వారా డిస్క్‌లలో తేడాను, నడుమునొప్పి గల కారణాలను గుర్తించవచ్చు. చికిత్స: దీర్ఘకాలంగా వేధిస్తున్న నడుము నొప్పి సమస్యలకు హోమియో వైద్య విధానంలో చికిత్స అందుబాటులో ఉంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న మందుల ద్వారా నడుమునొప్పిని పూర్తిగా దూరం చేయవచ్చు. వెన్నుపూసలో జరిగే మార్పులను నివారిస్తూ, కండరాలకు బలం చేకూర్చే విధంగా చికిత్స ఇవ్వడం వల్ల సత్ఫలితాలుంటాయి. అయితే పరిస్థితి పూర్తిగా విషమించకముందే డాక్టర్‌ను సంప్రదిస్తే ఫలితాలు చాలా మెరుగ్గా ఉంటాయి. అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్‌ను సంప్రదించండి. డా‘‘ కె. రవికిరణ్, మాస్టర్స్ హోమియోపతి, హైదరాబాద్ -
నడుమంత్రపు నొప్పి!
తమ జీవితకాలంలో నడుమునొప్పి రానివారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఇది మధ్యవయస్కుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణంగా 35 ఏళ్లు పైబడితే ఏదో ఒక సమయంలో నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే సాధారణంగా నడుమునొప్పి అరుదుగా తప్ప అది పెద్దగా ప్రమాదకరం కాదు. దాదాపు అందరూ ఎదుర్కొనే ఈ సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం. నడుమునొప్పికి కారణాలు నడుమునొప్పికి చాలా కారణాలు ఉంటాయి. ఉదాహరణకు... కండరాలు, లిగమెంట్లు, టెండన్లు, డిస్క్‌లు, ఎముకలు... ఇలా ఎక్కడ సమస్య ఉన్నా నడుము నొప్పి రూపంలో బయటపడుతుంది. సాధారణంగా నడుమునొప్పికి ఎక్కువగా కారణమయ్యే అంశాలివి... ►నడుము కండరాలు తీవ్రమైన ఒత్తిడికి గురై, స్ప్రెయిన్ కావడం ►లిగమెంట్లు దెబ్బతినడం ►నడుము పరిసరాల్లో ఉండే కండరాలు పట్టేయడం. ►పై కండిషన్లకు కారణమయ్యే అంశాలు... ►ఏదైనా బరువును సక్రమంగా ఎత్తకపోవడం ►ఎక్కువ బరువును అకస్మాత్తుగా ఎత్తడం ►సరైన పోష్చర్‌లో కాకుండా అడ్డదిడ్డంగా కదలడం లేదా నడవడం ►అకస్మాత్తుగా జరిగే ఒంటి కదలికలు... ఇలాంటి సంఘటనలతో ఈ కింద పేర్కొన్న పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవి నడుమునొప్పి కారణమవుతాయి. ►ప్రతి రెండు వెన్నుపూసల మధ్య కుషన్‌లాంటి ఒక డిస్క్ ఉంటుంది. ఏవైనా కారణాల వల్ల డిస్క్ దెబ్బతినడంతో అక్కడి నరం మీద ఒత్తిడి పెరిగి నడుము నొప్పి రావచ్చు ►వెన్నుపూసకు ఇరుపక్కలా ఉండే డిస్క్‌లో వాపు రావడం వల్ల నడుము నొప్పి వస్తుంది. ►సయాటికా: మనదేహంలో అన్నిటి కంటే పెద్ద నరం నడుము దగ్గర మొదలై అది కాలివరకు వెళ్తుంది. ఆ నరాన్ని ‘సయాటిక్’ నరం అంటారు. ఏవైనా కారణాల వల్ల ఆ నరం నొక్కుకుపోతే... నడుము దగ్గర నొప్పి మొదలై అది కాళ్ల వరకు పాకుతుంది. దీన్నే ‘సయాటికా నొప్పి’ అంటారు. ►కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ స్పాండిలోసిస్‌లో రెండు వెన్నుపూసల మధ్య ఉండాల్సిన గ్యాప్ తగ్గి, ఆ రెంటిమధ్యన నరం ఇరుక్కుపోవడంతో నడుమునొప్పి వస్తుంది. ►కొందరిలో వెన్ను అసహజంగా ఉంటుంది. ఈ కండిషన్‌ను ‘ఫ్లాట్ బ్యాక్ సిండ్రోమ్’ అంటారు. ఈ అసహజ భంగిమ వల్ల కొందరిలో నొప్పి రావచ్చు. ఇది ఎక్కువగా తప్పుడు భంగిమల్లో కూర్చున్నవారిలో వస్తుంటుంది. ►మరి పొట్ట ఎక్కువగా ఉన్నా నడుమునొప్పి రావచ్చు. ►కొందరిలో ఎముకలు పెళుసుబారిపోయి తేలిగ్గా విరిగిపోయే ‘ఆస్టియోపోరోసిస్’ కండిషన్ ఏర్పడి వెన్ను కూడా విరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా నడుము లేదా వెన్ను నొప్పికి ఒక కారణం. నడుం నొప్పి ముప్పును పెంచే అంశాలు (రిస్క్ ఫ్యాక్టర్స్) : ►వృత్తులో తీవ్రమైన ఒత్తిడి ఉండటం ►మహిళల్లో గర్భధారణ ∙అదేపనిగా కూర్చొని పనిచేయడం ► పెరిగే వయసు ►ఊబకాయం ►పొగతాగడం ►చాలా ఎక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం లేదా సరిగా చేయకపోవడం ►చాలా ఎక్కువగా చేసే శారీరక శ్రమ ►నిర్ధారణ: నడుమునొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఏ కారణం వల్ల ఆ నడుమునొప్పి వస్తుందో తెలుసుకోవడం కోసం కొన్ని పరీక్షలు అవసరం. ఇందుకోసం ఎక్స్‌రే, అవసరాన్ని బట్టి సీటీస్కాన్ లేదా ఎమ్మారై, బోన్‌స్కాన్, ఎలక్ట్రోమయోగ్రఫీ వంటి పరీక్షలు చేయించడం అవసరమవుతుంది. ►చికిత్స: ముందుగా కారణం తెలుసుకోవాలి. దాన్నిబట్టి నొప్పిని దూరం చేయడానికి ఫిజియోథెరపిస్ట్ సహాయంతో అవసరమైన వ్యాయామాలు లేదా (ఇంటర్ ఫెరెన్షియల్ థెరపీ) ఐఎఫ్‌టీ వంటి ప్రక్రియలతో చేసే చికిత్సలు కూడా నడుమునొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనే మాటలకు సంక్షిప్త రూపమైన ‘టెన్స్’ చికిత్స కూడా నడుమునొప్పికి పనిచేస్తుంది. ఇందులో ఎలక్ట్రోడ్ల సహాయంతో చిన్న చిన్న విద్యుత్ ప్రకంపనలను చర్మం కిందికి పంపుతారు. ఫలితంగా ఉపశమనం కలుగుతుంది. అయితే గర్భవతులు, మూర్ఛ రోగులు, గుండెజబ్బులు ఉన్నవారు లేదా గుండెలో పేస్‌మేకర్ అమర్చిన వాళ్లకు టెన్స్ చికిత్స సరికాదు. ఇలాంటి చికిత్సలు వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే సాగాలి. ►ఇక పై మార్గాలన్నీ విఫలం అయినప్పుడు ఎముకల వైద్య నిపుణులు లేదా న్యూరోసర్జన్లు లేదా స్పైన్ సర్జన్లు అవసరమైన శస్త్రచికిత్సను నిర్వహించి పరిస్థితిని పూర్తిగా చక్కబరుస్తారు. ►తక్షణ నొప్పి నివారణ కోసం: నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కోసం పెయిన్ కిల్లర్స్ అందుబాటులో ఉన్నా... ఇవి కేవలం తక్షణ నొప్పి నివారణ కోసమే పనికి వస్తాయి. వీటిని రెండు వారాలకు మించి తీసుకోవడం సరికాదు. దీనికి బదులు ఉపశమనం కోసం పైపూత మందులు (టాపికల్ మెడిసిన్స్) వాడటం మరింత మంచిది. ►ఒకవేళ నడుమునొప్పి దీర్ఘకాలం పాటు కొనసాగితే మాత్రం వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. మరికొన్ని అసాధారణ కారణాలు కాడా ఈక్వినా సిండ్రోమ్: ప్రతి రెండు వెన్నుపూసల మధ్య నుంచి కొన్ని నరాలు బయటకు వచ్చినట్లుగానే... నడుము కింది వెన్నుపూస నుంచి నరాలన్నీ బయటికి వచ్చి నడుము కింది ప్రాంతమంతా విస్తరిస్తాయి. కొన్నిసార్లు వెన్నుపూస చివరి భాగం నుంచి వచ్చిన నరాలనుంచి ఒక సన్నటి నొప్పి (డల్ పెయిన్) బయల్దేరి... పిరుదులు, జననాంగాలు, తొడల భాగమంతా ఆ నొప్పి విస్తరిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో పిరుదుల కింది భాగమంతా అసలు లేనేలేదేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. దాంతో కొందరిలో అది మల, మూత్ర విసర్జన కలగబోయేముందు వచ్చే ఫీలింగ్ కూడా లేనట్లుగా ఉంటుంది. ఈ కండిషన్‌ను కాడా ‘ఈక్వినా సిండ్రోమ్’ అంటారు. ►వెన్నెముక క్యాన్సర్ : ఇది అరుదైన కండిషన్. ఇలాంటి సమయాల్లో వెన్ను కింది భాగంలో ఎక్కడైనా క్యాన్సర్ గడ్డ ఏర్పడి అది అక్కడి నరాలను నొక్కేయడం వల్ల నడుము నొప్పి రావచ్చు. ►వెన్నెముక ఇన్ఫెక్షన్ : ఏదైనా వెన్నుపూసలో వాపు రావడం వల్ల అక్కడి మృదువైన భాగాల మీద ప్రభావం పడి నడుమునొప్పి రావచ్చు. ఇలాంటి సమయాల్లో జ్వరం కూడా ఉంటుంది. ►ఇన్ఫెక్షన్లు: మహిళల్లో వచ్చే ‘పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్’ వంటి ఇన్ఫెక్షన్లు లేదా యూరినరీ బ్లాడర్ సమస్యలు, కిడ్నీ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. ►నరాలకు వచ్చే ‘షింగిల్స్’ అనే సమస్య ఉన్నప్పుడు కూడా అది ఒకవేళ నడుము భాగంలోని నరాలు దెబ్బతింటే నడుమునొప్పి రావచ్చు. ►పక్క సరిగా లేకపోయినా : కొన్ని సందర్భాల్లో పక్క సరిగా కుదరక... అది ఉండాల్సిన తీరులో లేనందువల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. ►కూర్చోవడంలో తప్పుడు భంగిమలు: కూర్చొని పనిచేసేవారిలో దాదాపు 80 శాతానికి పైగా సరైన భంగిమలో ఎలా కూర్చోవాలో తెలియదు. దాంతో నడుమునొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. దాంతోపాటు నడుమునొప్పికి కారణమయ్యే కొన్ని అంశాలివి... ►అసహజ భంగిమల్లో అకస్మాత్తుగా వంగడం లేదా పక్కకు తిరగడం ►నొక్కడం ►లాగడం ►ఎత్తడం ►చాలాసేపు నిలబడటం ►ముందుకు ఒంగడం ►ఒక్కపెట్టున తుమ్మడం ►దగ్గడం ►అతిగా ఒంగడం ►కంప్యూటర్ను చూస్తూ మెడను అసహజ భంగిమలో చాలాసేపు వంచి ఉంచడం ►చాలా సేపు డ్రైవ్ చేయడం డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఆ సమస్య ఎక్కువ
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ప్రతి పదిమంది ఉద్యోగుల్లో ఆరుగురు కండరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నట్లు ది ప్రొటీన్ వీక్–2019 సర్వేలో వెల్లడైంది. డనోన్ ఇండియా, ఆరోగ్య వరల్డ్ ఇండియా ట్రస్ట్ సంయుక్తంగా ఇటీవల దేశంలోని నోయిడా, హైదరాబాద్, బెంగళూర్లలోని వివిధ కార్పొరేట్ సంస్థల్లో పని చేస్తున్న సుమారు 40 వేల మంది ఉద్యోగుల కండరాల ఆరోగ్యంపై సర్వే నిర్వహించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన సర్వేలో ప్రొటిన్స్ లోపం వల్ల ప్రతి పదిమంది ఉద్యోగుల్లో ఆరుగురు కండరాల బలహీనతతో బాధపడుతున్నట్లు గుర్తించింది. పురుషులతో పోలిస్తే, మహిళల్లో బాధితులు 10:8 నిష్పత్తిగా నమోదు ఆందోళన కలిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం తాజ్దెక్కన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ శశికిరణ్, డనోస్ ఇండియా న్యూట్రిషన్స్ సైన్స్ మెడికల్ విభాగాధిపతి డాక్టర్ నందన్ జోషి, ఇన్‌బాడీ సంస్థ ప్రతినిధి డాసన్కిమ్, ఆరోగ్య వరల్డ్ కంట్రి మేనేజర్ సుమతిరావులు మాట్లాడారు. జీవనశైలిలో చోటు చేసుకున్న మార్పులకు తోడు ఆహారపు అలవాట్లు, శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడంతో కండరాల ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రకటించారు. ప్రొటీన్ వీక్ కార్యక్రమంలో భాగంగా జూలై 24 నుంచి 30వరకు దేశంలోని వివిధ కార్పొరేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు కండరాల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి అన్ని దశల్లోనూ ప్రొటీన్స్ అవసరమని ప్రకటించారు. శారీరక ఎదుగుదల తర్వాత శరీరానికి కావాల్సినంత ప్రొటీన్ అందటం లేదు. ప్రతి రోజు తీసుకునే ఆహారంలో మనకు అందే కేలరీలతో పోలిస్తే ప్రొటీన్ పది నుంచి 15 శాతం అందాలి. శరీర బరువుకు సంబంధించి ప్రతి కేజీకి 08 నుంచి 1.0 గ్రాముల ప్రొటీన్ అవసరం. ఈమేరకు అందకపోవడంతో కండరాలు బలహీనపడి, ఆరోగ్యం దెబ్బతింటోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. శరీరానికి అవసరమైన ప్రొటిన్స్ తీసుకోవడం వల్ల కార్పొరేట్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పని చేసే అవకాశం ఉందని సూచించారు. -
‘ఎమ్‌డీఆర్ టీబీ’ అంటే ఏమిటి?
మా నాన్నగారు ఎక్కువగా పొగతాగుతుంటారు. ఆయనకు ఊపిరితిత్తుల క్షయ వచ్చింది. అయితే చికిత్స విషయంలో కాస్తంత నిర్లక్ష్యం వహించారు. కొంతకాలం మందులు తీసుకోవడం, ఆ తర్వాత ఆపేయడం.... ఇలా చేశారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ టీబీ వచ్చింది. డాక్టర్లు చూసి దాన్ని ‘ఎమ్‌డీఆర్ టీబీ’ అంటున్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు మేమేం చేయాలి. మాకు తగిన సలహా ఇవ్వగలరు. మన శరీరంలో టీబీ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా (ట్యూబర్క్యులోసిస్ బాసిల్లస్) ప్రవేశించినప్పుడు కొన్ని అత్యంత సూక్ష్మజీవులను నిర్మూలించే శక్తిమంతమైన మందులైన ఐసోనియాజైడ్, రిఫాంపిసిన్ వంటి వాటితో చికిత్స చేస్తుంటాం. ఇలా ఆర్నెల్ల పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ఈ మందుల పూర్తి కోర్సును తీసుకుంటేనే టీబీ పూర్తిగా తగ్గుతుంది. అంతేగాని ఒకవేళ ఈ మందులను నిర్లక్ష్యంగా వాడినా లేదా తగిన మోతాదులో వాడకపోయినా, లేదా కొంతకాలం వాడాక లక్షణాలు తగ్గగానే మళ్లీ ఆపేసినా, లేదా మందులను సరిగా నిల్వ చేయకపోయినా... వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిములు ఆ మందులకు లొంగని విధంగా తయారవుతాయి. అత్యంత శక్తిమంతమైన ఆ టీబీ మందుల పట్ల తమ నిరోధకత స్థాయిని పెంచుకుంటాయి. దాంతో అవి తమ శక్తిని పెంచుకోవడమే కాదు... ఇతర ఆరోగ్యవంతులైన వ్యక్తులకూ వ్యాపించే విధంగా తయారవుతాయి.ఒక వ్యక్తిలోని టీబీ వ్యాధి మందులకు లొంగని విధంగా తయారయ్యిందా అని నిర్ధారణ చేయడానికి కొన్ని ల్యాబరేటరీ పరీక్షలు అవసరమవుతాయి. ఆ పరీక్షల ద్వారా మందులకు లొంగని విధంగా వ్యాధి తయారయ్యింది. ఈ పరీక్షల్లో మాలెక్యులార్ బేస్డ్ అనీ, కల్చర్ బేస్డ్ అనీ రకాలున్నాయి. మాలెక్యులార్ బెస్డ్ పరీక్షల ద్వారా కేవలం కొద్ది గంటల్లోనే ఫలితాలు వెల్లడవుతాయి. ఇలా ఒక టీబీ వ్యాధి సాధారణ స్థాయి నుంచి మందులకు లొంగని విధంగా నిరోధకత పెంచుకుందని తెలియగానే, రెండోశ్రేణి మందులను (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) వాడటం మందుపెట్టాలి. ఇందులో నాలుగు లేదా అంతకుమంచి మందులుంటాయి. వాటిని కనీసం ఆర్నెల్ల పాటు క్రమం తప్పకుండా వాడాలి. ఒక్కోసారి రిఫాంపిన్ మందుకు సూక్ష్మక్రిమి నిరోధకత పెంచుకుందని తెలిసినప్పుడు ఈ చికిత్సా కాలాన్ని 18 – 24 నెలలకూ పొడిగించాల్సి రావచ్చుకూడా. ఈ రెండో శ్రేణి మందులు కాస్త ఖరీదైనవి, విషపూరితమైనవి కాబట్టి... మొదటిసారే పూర్తిగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవడం అన్నివిధాలా మంచిది. ఇక రెండో శ్రేణి మందులు వాడే చికిత్సలో వ్యాధి పూర్తిగా తగ్గే పాళ్లు 70 శాతం వరకు ఉంటాయి. సిలికోసిస్‌కు చికిత్స ఏమిటి? నా వయసు 57 ఏళ్లు. నేను గత 30 ఏళ్లకు పైబడి నిర్మాణరంగం (కన్స్ట్రక్షన్ ఫీల్డ్)లో పనిచేశాను. గత మూడేళ్లుగా విపరీతమైన పొడి దగ్గు వస్తోంది. ఊపిరితీసుకోవడం కూడా కష్టంగా ఉంది. డాక్టర్లను సంప్రదిస్తే నేను ‘సిలికోసిస్’ సమస్యతో బాధపడుతున్నానని అన్నారు. ‘సిలికోసిస్’ అంటే ఏమిటి? దీనికి చికిత్స ఏమిటో వివరించగలరు. మీ శ్వాసక్రియ సాగుతున్న క్రమంలో సుదీర్ఘకాలం పాటు సన్నటి ఇసుక మీ ఊపిరితిత్తుల్లో ప్రవేశించడం వల్ల కలిగే దుష్పరిణామాలకు సంబంధించిన వ్యాధి పేరే ‘సిలికోసిస్’. సాధారణంగా నిర్మాణరంగంలో పనిచేసేవారు లేదా ఇసుక, రాతిని పొడి చేయడం వంటి క్వారీ రంగం, క్వార్ట్జ్ వంటి ఖనిజాలను వెలికితీసే రంగంలో పనిచేసేవారిలో సన్నటి ఇసుకపొడి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఇసుక లేదా సన్నటి రాతిపొడి చాలాకాలం పాటు ఊపిరితిత్తులోకి పోవడం వల్ల అవి దెబ్బతిని శ్వాస తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది. సిలికోసిస్లో మూడు రకాలు ఉన్నాయి. అవి... క్రానిక్ సిలికోసిస్: ఇది సాధారణంగా నిర్మాణరంగం లేదా రాతిపొడికి ఎక్స్పోజ్ అయ్యేచోట పదేళ్లకు పైగా పనిచేయడం వల్ల కాస్త తక్కువ మోతాదులో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల వచ్చే వ్యాధి ఇది. యాక్సిలరేటెడ్ సిలికోసిస్: సాధారణంగా 5 నుంచి 10 ఏళ్ల వ్యవధిలోనే ఎక్కువ మొత్తంలో ఇసుక స్ఫటికాలు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడం వల్ల వచ్చే వ్యాధి ఇది. అక్యూట్ సిలికోసిస్: కేవలం కొన్ని వారాలు లేదా నెలల వ్యవధిలోనే పెద్దమొత్తంలో ఊపిరితిత్తుల్లోకి ఇసుక, దాని స్ఫటికాలు ప్రవేశించడం వల్ల లక్షణాలు బయటపడి, ఒక్కోసారి నెలల వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారిపోయే కండిషన్ ఇది. నిర్మాణరంగాల్లోగానీ లేదా డ్రిల్లింగ్, మైనింగ్ వంటి రంగాల్లో పనిచేసేవారిలో ఊపిరి తీసుకోవడం కష్టం కావడం, తీవ్రమైన దగ్గు, నీరసం, జ్వరం, బరువుతగ్గడం, ఛాతీలో నొప్పి వంటి లక్షణాలతో సిలికోసిస్ బయటపడుతుంది. క్రమేపీ లక్షణాల తీవ్రత పెరుగుతుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స లేనప్పటికీ మీరు మీకు సమీపంలోని పల్మునాలజిస్ట్‌ను సంప్రదించి వారు సూచించిన బ్రాంకోడయలేటర్స్ లేదా ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా లక్షణాలనుంచి సాంత్వన పొందవచ్చు. ఇక దీని కారణంగా వచ్చే శ్వాససంబంధమైన ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు చికిత్స అందిస్తారు. మీకు పొగతాగే అలవాటు ఉంటే తక్షణం ఆపివేసి, శుభ్రమైన గాలి వచ్చే ప్రాంతంలోకి మారిపోయి, డాక్టర్ సూచనలు పాటిస్తూ వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం పొందండి. రుతు సమయంలో శ్వాస సరిగా ఆడటం లేదు... ఎందుకు? నా వయసు 36 ఏళ్లు. గృహిణిని. నాకు రుతుసమయంలో శ్వాస అందదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? రుతుసమయం కూడా ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మీ భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. రుతుక్రమం మహిళల ఆరోగ్యం విషయంలో కీలక భూమిక పోషిస్తుంటుంది. తద్వారా అటు శరీరక, ఇటు మానసిక సమస్యలకు అది దారితీయవచ్చు.కెటామెనియల్ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా కూడా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి.పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు.ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాజ్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం.ఇక మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
కండరాలు ఎందుకు ఇలా పట్టేస్తున్నాయి?
నా వయసు 38 ఏళ్లు. గత కొంతకాలంగా నాకు కాళ్లూ, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టుకుపోతున్నాయి. తీవ్రమైన నొప్పి వస్తోంది. కొన్నిసార్లు కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు, మరికొన్నిసార్లు నిద్రలో ఇలా జరుగుతోంది. నిద్రలో ఇలా జరిగినప్పుడు అకస్మాత్తుగా నిద్ర లేచి కుంటుతూ నడుస్తుంటాను. ఈ వేసవిలో మరిన్నిసార్లు ఈ సమస్య కనిపిస్తోంది. నాకు ఈ సమస్య ఎందుకు వస్తోంది. దీని నుంచి బయట పడటానికి మార్గం చెప్పండి. తరచూ కాళ్లు, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టేయడానికి (క్రాంప్స్‌కు), నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. కొందరిలో తమ శరీరంలోని నీటి పాళ్లు తగ్గినా (సింపుల్ డీహైడ్రేషన్ వల్ల ) కూడా మీరు చెప్పిన లక్షణాలు వ్యక్తమవుతాయి. మీరు తీవ్రమైన అలసటకు గురైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు వ్యాయామం చేయని కారణంగా కండరాలు బలహీనమైపోయి, తీవ్రమైన అలసట కలగడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరిగే పరిణామం. దీనివల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో సాధారణంగా పిక్కలు పట్టేస్తాయి. ఇలాంటివారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మీ కండరాలను బలపరచుకోవాల్సి ఉంటుంది. ఇక కొందరిలో సోడియమ్, పొటాషియమ్, చక్కెరపాళ్లు, క్యాల్షియమ్, మెగ్నీషియమ్ వంటి ఖనిజ లవణాలు తగ్గడం గానీ లేదా పెరగడం గానీ జరిగినా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొందరిలో కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొందరిలో విటమిన్ బి12, విటమిన్ డి తగ్గడం వల్ల, థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఇవే లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. కొందరిలో కొన్నిసార్లు సాధారణ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపించవచ్చు. అలాగే కొందరిలో పెరిఫెరల్ నర్వ్స్ అనే నరాలు, వెన్నెముక లోపాలతోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజిస్ట్‌ను కలిసి, విపులంగా రక్త పరీక్షలు చేయించుకొని, లక్షణాలకు అసలు కారణాన్ని కనుక్కోవాలి. సమస్య ఏమిటన్నది కనుగొంటే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. పక్షవాతానికి సెమ్సెల్ థెరపీ అందుబాటులో ఉందా? నేను గత తొమ్మిదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాను. ఇటీవల వార్తాపత్రికలు చదువుతూ పెరాలసిస్‌కు మూలకణ చికిత్స (స్టెమ్‌సెల్ థెరపీ) అందుబాటులోకి వచ్చినట్లు తెలుసుకున్నాను. నేను ఈ చికిత్స తీసుకోదలిచాను. ప్రస్తుతం ఇది ఎక్కడ లభ్యమవుతోంది, దీనికి ఎంత ఖర్చవుతుంది, దాని ఫలితాలెలా ఉన్నాయనే వివరాలు విపులంగా తెలియజేయండి. ఒకసారి మెదడులోని కణాలు చనిపోతే అవి శాశ్వతంగా చనిపోయినట్టే. అది పక్షవాతం వల్ల చనిపోయినా లేదా మెదడుకు గాయం కావడం వల్ల చనిపోయినా మెదడులోని కణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరుజ్జీవించలేవు. కానీ ఒక ఆశారేఖ ఉంది. మెదడు కణాలు చనిపోయిన సమయంలోనే ఆ కణాలలో నిక్షిప్తం అయి ఉన్నదాన్ని మనం తిరిగి పొందాలంటే దెబ్బతిన్న కణాలకు పక్కనే ఉండే కణాలు తోడ్పడతాయి. మన మెదడుకు ఉన్న ఈ అద్భుతమైన శక్తిని ‘న్యూరోనల్ ప్లాస్టిసిటీ’ అని వ్యవహరిస్తారు. ఇలా మనం 80 శాతం మేరకు కోలుకోడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధి పడుతుంది.ఇక మూలకణాల విషయానికి వద్దాం. మూలకణాలతో చికిత్స అంటే... ఇవి మన శరీరంలోని ఎలాంటి కణాలుగానైనా మారేశక్తి ఉన్న కణాలన్నమాట. పక్షవాతానికి మూలకణాలతో చికిత్స చేసే ప్రక్రియలో విషయంలో రెండు రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాం. మొదటిది... మెదడులోనే చెడిపోయి ఉన్న కణాలను కొన్ని మందుల ద్వారా మళ్లీ ప్రేరేపించి పనిచేయించేలా చూడటం; ఇక రెండోది... బయటి నుంచి మూలకణాలను శరీరంలోకి పంపడం. అంటే ఉదాహరణకు చెడిపోయిన మూలగ స్థానంలో కొత్త కణాలు పంపి, కొత్త మూలగను రూపొందించేలా అన్నమాట.ఇక చనిపోయిన మెదడుకణాల స్థానంలో మూలకణాలను ప్రవేశపెట్టడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇందులో మూలకణాలు పాతకణాలతోనూ, న్యూరాన్ల దారులతో అనుసంధానితం అయి, అక్కడి రసాయన చర్యలకు అనుగుణంగా స్పందిస్తూ ఉండటానికి చాలా కాలం పడుతుంది. ఇందుకు కొన్నేళ్ల వ్యవధి కూడా పట్టవచ్చు. ఇవ్వాళ్టికీ ఈ విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి వచ్చిన ఫలితాలైతే అంత సంతృప్తికరంగా లేవు. కాబట్టి ప్రస్తుతానికి మూలకణ చికిత్స అన్నది పరిశోధనదశలోనే ఉంది. పరిస్థితి ఇంకా ఆసుపత్రిలో చికిత్స అందించే వరకు రాలేదు. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
బంగారాన్ని వెలికితీసే శిలీంధ్రం
ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలో ఓ కొత్తరకం శిలీంధ్రాన్ని గుర్తించారు. ఇదేం చేస్తుందో తెలుసా? పరిసరాల్లోంచి బంగారాన్ని సేకరిస్తుంది. ఆస్ట్రేలియా పశ్చిమ ప్రాంతంలో గుర్తించిన ఈ శిలీంధ్రం ద్వారా ఆ ప్రాంతంలో మరిన్ని బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలిసిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ స్సింగ్ బోహూ తెలిపారు. బంగారం ఉత్పత్తిలో ఆస్ట్రేలియా ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఫుసేరియం ఆక్సీస్పోరమ్ అనే శాస్త్రీయ నామమున్న ఈ శిలీంధ్రం సాధారణ పరిస్థితుల్లో చెత్తా చెదారం తొందరగా కుళ్లిపోయేందుకు ఎంతో ఉపకరిస్తుంది. బంగారం ఉన్నప్పుడు మాత్రం వేగంగా శరీర బరువును పెంచుకుంటుంది. రసాయనికంగా బంగారం చాలా స్తబ్దుగా ఉండే పదార్థమని.. ఇలాంటి పదార్థాన్ని శిలీంధ్రం సేకరించగలగడం ఆశ్చర్యకరమైన విషయమని బోహూ తెలిపారు.ఇది ఎందుకు జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఆస్ట్రేలియాలో బంగారం ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతున్న నేపథ్యంలో కొత్త నిల్వలను పసిగట్టేందుకు ఈ శిలీంధ్రం ఉపయోగపడుతుందని అంచనా. ఈ శిలీంధ్రం ప్రపంచ వ్యాప్తంగా మట్టిలో కనిపించేదే అయినప్పటికీ బంగారాన్ని గుర్తించేందుకు దీన్ని వాడటం ఇదే తొలిసారి అవుతుందని వివరించారు. ఈ కణాలతో గుండెకుమళ్లీ బలం! గుండెపోటు వచ్చినప్పుడు గుండె కండరాల బలహీనం కావడం మొదలుకొని కొంతమేరకు నాశనం కావడం కద్దు. ఇలా ఒకసారి పాడైన గుండెను మళ్లీ సాధారణ స్థితికి తీసుకు రావడం కష్టసాధ్యం మాత్రమే. ఈ నేపథ్యంలో మౌంట్ సినాయికి చెంది ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు గుండెకు మళ్లీ బలం చేకూర్చగలిగే కొత్త కణాలను గుర్తించారు. ఉమ్మునీటిలో ఉండే సీడీఎక్స్2 అనే మూలకణాలు గుండె కండరాలను మళ్లీ ఉత్పత్తి చేయగలవని వీరు అంటున్నారు. కొన్ని రకాల జంతువులపై తాము జరిపిన పరిశోధనలు ఇప్పటికే విజయవంతమయ్యాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త హీనా చౌదరి తెలిపారు. సీడీఎక్స్ 2 కణాలు ఉమ్మునీటిని మాత్రమే వృద్ధి చేస్తాయని ఇప్పటిదాకా అనుకునే వారమని.. అవయవాలను పునరుత్పత్తి చేయగలదని తమ పరిశోధనల ద్వారా మాత్రమే తెలిసిందని వివరించారు. గుండెతోపాటు ఇతర అవయవాలను మళ్లీ తయారు చేసుకునేందుకు ఈ కణాలు ఉపయోగపడతాయని అంచనా. ఈ కణాలు అత్యంత చైతన్యవంతమైన మూలకణాల మాదిరిగా ఉన్నాయని.. నేరుగా గాయపడ్డ కండర ప్రాంతాన్ని చేరుకోగలవని వివరించారు. పరిశోధన వివరాలు ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
అమ్మోకాళ్లు!
దేహం కూడా యంత్రం లాంటిదే. యంత్రం విడిభాగాలు అరిగినట్లే... మన దేహయంత్రంలోని కీళ్లూ అరిగి పోతుంటాయి. ఈ పరిణామం అరుగుదల కారణంగా... ఇంగ్లిష్‌లో చెప్పాలంటే డీజనరేషన్ కారణంగా జరుగుతుంది కాబట్టి ఇది అనివార్యంగా జరిగిపోతుంది. పాతకాలంలో అరుగుదలతో వచ్చే ఈ నొప్పులను పాతనొప్పులు అనేవాళ్లు. పాతనొప్పులకు మందులేదని ఆ తరంవాళ్లు అనుకునేవాళ్లు. అయితే ఇటీవల వైద్య విజ్ఞానశాస్త్రంలో అభివృద్ధి వల్ల కొత్త మందులు, కొత్త రకం శస్త్రచికిత్సలతో అరిగిన కీళ్లకు వైద్యం చేయడం సాధ్యం కావడంతో పాతనొప్పులనే మాట పాతబడి పాతతరం వారికి మాత్రమే తెలుస్తోంది. అయితే కీళ్ల అరుగుదలతో వచ్చే ఈ నొప్పుల గురించి ఎన్నో అపోహలున్నాయి. ఆ అపోహల గురించి, అసలు వాస్తవాల గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. కీళ్ల అరుగుదలా వన్–వే ట్రాఫిక్ లాంటిదే... కాలం ముందుకు జరుగుతున్నట్లు... వయసు రోజురోజుకూ పెరుగుతున్నట్లు... అరుగుదల కూడా ముందుకే కొనసాగుతుంది. అలా అరిగే ప్రక్రియను ఏవిధంగానూ వెనక్కు మళ్లించలేం. ఇదీ వన్–వే ట్రాఫిక్‌లో ప్రయాణించడం లాంటిది. ఆ దారిలో వెనక్కు తిరగడం సాధ్యం కాదు. కాకపోతే ప్రయాణాన్ని నెమ్మదిగా సాగేలా చేసుకోగలం. కీళ్ల అరుగుదల విషయంలోనూ అంతే. అందమైన మన మునుపటి ఫిట్నెస్ను కొనసాగించేందుకు వ్యాయామాల వంటి మంచి జీవనశైలి అలవాట్లతో, మరికొన్ని జాగ్రత్తలతో వాటి అరుగుదల ఆలస్యంగా జరిగేలా మాత్రం చూసుకోగలం. కీలూ – కండర సంబంధం... కృష్ణార్జున బంధం కీళ్ల అరుగుదల తక్కువగా ఉండాలంటే దానికి సంబంధించిన కండరం బలంగా ఉండాలి. అందుకే కీలుకీ–కండరానికీ ఉన్న సంబంధాన్ని ఒకరకంగా కృష్ణార్జున బంధంగా చెప్పవచ్చు. అర్జునుడికి కృష్ణుడి సపోర్ట్ ఉన్నట్లే... మన మోకాలి కీలుకి క్వాడ్రిసెప్స్ అనే తొడ కండరాల సపోర్ట్ ఉంటుంది. యుద్ధంలో అర్జునుడిపై పడబోయిన అనేక దెబ్బలను శ్రీకృష్ణుడే కాచుకుని రక్షించినట్టే, మోకాలి కీళ్లపై పడే భారంలో చాలాభాగాన్ని క్వాడ్రిసెప్స్ కండరాలు తీసుకుంటాయి. అలాగే తుంటి భాగానికి వస్తే... తుంటి కీలు దగ్గర కాలు ఫ్రీగా కదిలేందుకు, కాలు మన శరీరభాగాన్ని అంటి ఉండేందుకు ‘అబ్డక్టార్ మజిల్స్ ఆఫ్ హిప్’ అనే కండరాలు ఉపయోగపడతాయి. ఇదే తరహాలో మెడ కండరాలు, మెడ భాగంలోని వెన్నుపూసలపై పడే భారాన్ని తీసుకుంటాయి. అందుకే సర్వైకల్ సమస్య వచ్చినప్పుడు డాక్టర్లు మొదట మెడ కండరాలను బలంగా మార్చే వ్యాయామాలను చేయాల్సిందిగా సూచిస్తుంటారు. ఇలా నడిచేందుకు ఉపయోగపడేది కీలు అయితే... దాన్ని నడిపించేందుకు సహాయపడేది సంబంధిత కండరం అన్నమాట. వ్యాయామంతో కండరాలు ఎంత బలంగా ఉంటే... కీలుపై పడే భారం అంతగా తగ్గుతుంది. ఆ తరంలో ఆ బాధలు లేవెందుకు... అప్పటి తరంలో చాలామందికి వృద్ధాప్యం వచ్చిన చాలా ఏళ్లకు గానీ కీళ్లనొప్పులు వచ్చేవి కావు. అయితే ఇటీవల చాలామందికి నలభై ఏళ్లు దాటకుండానే కీళ్లనొప్పులు వస్తున్నాయెందుకు అని కొందరు అడుగుతుంటారు. ఇందుకు నాలుగు అంశాలను ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అవి 1. కండరాల బలహీనత; 2. ఊబకాయం; 3. శారీరక శ్రమ; 4. సైనోవియల్ ఫ్లూయిడ్ వల్ల కార్టిలేజ్ బలోపేతం అయ్యే ప్రక్రియలో అవరోధం ఏర్పడటం. ఈ నాలుగు అంశాల్లోనూ ప్రధానమైనది శారీరక శ్రమ. మిగతా అన్ని అంశాలతో దీనికి సంబంధం ఉంది. ఆ రోజుల్లో నడక, శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉండేది. దాంతో కండరాలు త్వరగా బలహీనపడేవి కావు. అలాగే ఆ శ్రమ కారణంగానే ఊబకాయం వచ్చేది కాదు. ఇక మన కీళ్లలో కందెన (ల్యూబ్రికెంట్)లా పనిచేసే సైనోవియల్ ఫ్లుయిడ్ అనే గ్రీజులాంటి పదార్థం మన్నికతో ఎక్కువ రోజులు ఉండటానికీ దోహదపడేది శారీరక శ్రమే. ఇటీవల ప్రజల్లో శారీరక శ్రమ తగ్గడంతో మిగతా మూడు అంశాలూ బలహీనం కావడం వల్లనే ఇటీవలి తరాల్లో కీళ్లనొప్పులు త్వరగా వస్తున్నాయి. ఎంతగా నడిస్తే కీళ్లు అంతగా అరుగుతాయా? నడక వల్ల కీళ్లపై భారం పడి త్వరగా అరిగిపోతాయన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఎముకకు నేరుగా పోషకాలు అందవు. మన వ్యాయామం, నడక వల్లనే ఎముకకు పోషకాలు అందుతాయి. అలాగే సైనోవియల్ ఫ్లుయిడ్ ఆరోగ్యానికీ నడక అవసరం. అందువల్ల ఎంత నడిస్తే కీళ్లకు అంత ప్రయోజనం. కానీ ఈ నడక ఎలా పడితే అలా ఉండకూడదు. ఏవి పడితే ఆ చెప్పులు తొడుక్కొని, ఇష్టం వచ్చిన ఉపరితలం మీద నడిస్తే ఆ నడక ప్రయోజనం ఇవ్వదు. మెత్తటి అడుగుభాగం (సోల్) ఉన్న షూతో మట్టినేల లేదా గడ్డితో మెత్తగా ఉన్న నేలమీద గానీ ఆ నడక వల్ల తగిన ప్రయోజనం చేకూరుతుంది. ఇక మోకాలిపైన బరువు పడేందుకు దోహదపడే మరో అంశం ఇండియన్ స్టైల్ టాయిలెట్ సీట్. ఎత్తుపల్లాలున్న దారుల్లో నడిచినప్పుడు, ఇండియన్ స్టైల్ టాయిలెట్లలో కూర్చున్నప్పుడు కీళ్లమీద మామూలు సమయం కంటే నాలుగు రెట్లు ఎక్కువ భారం పడుతుంది. అలాగే మోకాళ్లు ముడుచుక్కూర్చోవడం(స్క్వాటింగ్) కూడా మోకాలి నొప్పులకు కారణమవుతుంది. కీళ్లనొప్పులు మొదలైనప్పుడు మినహాయించి, మామూలు ఆరోగ్యంతో ఉన్నవారు ఎంత నడిస్తే అంత మేలు. అలాగే ఇండియన్ టాయెలెట్లలో గొంతుక్కూర్చోకుండా ఉండటమూ కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మున్ముందు వచ్చే కీళ్లనొప్పులను నివారిస్తుంది. కాల్షియమ్ తగ్గడం వల్ల కీళ్ల నొప్పులు వస్తాయా? మన ఆహారంలో కాల్షియమ్ తగ్గడం అన్నది కీళ్లనొప్పులకు దారితీస్తుందనే అపోహ చాలామందిలో ఉంది. నిజానికి కాల్షియమ్కూ, కీళ్లకూ ఎలాంటి సంబంధం లేదు. కాల్షియమ్ లోపం వల్ల ఎముక బలహీనం కావచ్చుగానీ... కీళ్లతో కాల్షియమ్కు నేరుగా సంబంధం ఉండదు. కీళ్లపై కాల్షియమ్ ప్రత్యక్ష ప్రభావమూ ఉండదు. ఆహారానికి... కీళ్లనొప్పులకూ సంబంధం ఉందా? కొంతమంది ఆహారానికీ, కీళ్లకూ సంబంధం ఉందేమోనని కూడా సందేహం వ్యక్తం చేస్తుంటారు. ప్రత్యక్షంగా ఆహారానికీ, కీళ్లకూ సంబంధం ఉండదు. అయితే అతిగా ఆహారం తీసుకోవడం, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వల్ల ఊబకాయం వచ్చి... ఒంటి బరువు కీళ్లపై పడి కీళ్ల అరుగుదల వేగవంతం అవుతుంది. ఇక కొన్ని రకాల ఆహారాలు కొంతమందికి సరిపడవు. ఒంటికి సరిపడని ఆహారం కారణంగా అలర్జీలు వచ్చి, ఆ అలర్జీ కీళ్లనొప్పులు, వాపు రూపంలో వ్యక్తం కావచ్చు. ఎవరెవరిలో ఏయే ఆహారాల పట్ల అలర్జీ ఉంటుందో, ఆ అలర్జీ ఏ రూపంలో వ్యక్తమవుతుందన్నది ఆయా వ్యక్తుల దేహ స్వభావాన్ని బట్టి ఉంటుంది. నిజానికి కీళ్లనొప్పి అన్నది ఎముక బలహీనం కావడం కంటే, ఎముక చివరన ఉండే కార్టిలేజ్ అనే భాగం అరగడం వల్ల, అందులోని గ్లూకోజమైన్ అనే జీవరసాయనం తగ్గడం వల్ల వస్తుంది. ఈ కార్టిలేజ్నే వ్యావహారిక భాషలో కొందరు గుజ్జుగా వ్యవహరిస్తుంటారు. ఆ గుజ్జులోని నీటి పరిమాణం తగ్గడం వల్ల కూడా కీళ్లనొప్పులు వస్తుంటాయి. అంతేగానీ ఆహారానికీ, క్యాల్షియమ్కూ... కీళ్లనొప్పులకూ నేరుగా సంబంధం లేదు. ఇంత అకస్మాత్తుగా బయటపడ్డాయేమిటి? ‘నిన్నమొన్నటివరకూ బాగానే నడుస్తున్నాను. ఠక్కున కీళ్లనొప్పులు బయటపడ్డాయేమిటి?... నిన్న లేని నొప్పి ఇంత అకస్మాత్తుగా ఎందుకొచ్చింది?’ అని కీళ్లనొప్పులతో బాధపడేవారిలో చాలామంది అడుగుతుంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ కీళ్లు అరగడం అన్నది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. ఎవరికీ దీనినుంచి మినహాయింపు ఉండదు. అయితే కీళ్ల అరుగుదల వల్ల కార్టిలేజ్ పూర్తిగా అరిగి, ఎముకకూ, ఎముకకూ ఒరిపిడి జరిగి వచ్చే నొప్పి రెండు రకాలుగా బయటపడుతుంది. కొంతమందిలో అది క్రమంగా పెరుగుతూ పోవచ్చు. మరికొంతమందిలో అకస్మాత్తుగా బయటపడవచ్చు. కాబట్టి అరుగుదల అనేది అందరిలోనూ జరుగుతుంది. నొప్పి వ్యక్తమయ్యే తీరు మాత్రం రెండు రకాలుగా ఉంటుంది. పెద్దవయసు వారిలోఎమ్మార్ స్కాన్ అవసరం లేదుకాస్తంత వయసు పైబడ్డాక కీళ్లనొప్పులతో డాక్టర్ దగ్గరికి వెళ్లారనుకోండి. పెద్ద వయసు వారిలో కీళ్లు అరిగి నొప్పులు వస్తున్నాయా అని నిర్ధారణగా తెలుసుకునేందుకు ఎమ్మార్ స్కాన్ తీయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్దవయసు వారిలో అరుగుదల అనేది ఎలాగూ జరిగి ఉంటుంది. అయితే ఇందుకు భిన్నంగా యుక్త వయస్కుల్లోనూ, చాలా చిన్నవయసు వారిలోనూ కీళ్లనొప్పులు కనిపించాయనుకోండి. అలాంటివారిలో సమస్య తెలుసుకునేందుకు ఎమ్మార్ స్కాన్ తీయించాలి. దీనికి ఓ కారణం ఉంది. మన కీళ్ల భాగంలో నొప్పి రావడానికి మూడు ప్రధానమైన అంశాలు. మొదటిది కార్టిలేజ్, రెండోది మన కీళ్ల మధ్యన షాక్ అబ్జార్బర్స్‌లా పనిచేసే మెనిస్కస్ అనే భాగం. మూడోవి లిగమెంట్లు. ఈ మూడింటిలో ఏవైనా ఆటల్లో భాగంగా కార్టిలేజ్‌లోని కొంతభాగం దెబ్బతిన్నదా, లేక షాక్ అబ్జార్బర్స్‌లా పనిచేసే మెనిస్కై (మెనిస్కస్కు బహువచనం) అనే భాగాలు దెబ్బతిన్నాయా, లేక లిగమెంట్లు గాయపడటం, తెగడం జరిగిందా అనేది తెలుసుకోడానికి యువకులు, చిన్నవయసులో ఉన్నవారికే ఎమ్మార్ స్కాన్ తీయించాల్సి ఉంటుంది. అందుబాటులో మందులు కీళ్లనొప్పుల తీవ్రతను 4 దశల్లో చెప్పవచ్చు. ఇందులో మొదటి రెండు దశల్లో నొప్పులను మందులతోనే తగ్గించవచ్చు. మూడో దశలో చాలా వరకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. అయితే నాలుగోదశలో ఉంటే మాత్రం అది శస్త్రచికిత్సతో మాత్రమే తగ్గుతుంది. ఇలా మొదటి రెండు దశల్లోని కీళ్లనొప్పులకు గతంలో వాడే నొప్పి నివారణ మందులతో పొట్టలో అల్సర్స్ రావడం, కడుపులో రక్తస్రావం కావడం వంటి దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) వచ్చేవి. కానీ ఇటీవల కాక్స్–2 ఇన్హిబిటర్స్ అనే కొత్తరకం మందులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి లేజర్ గన్స్‌లా పనిచేసి, కేవలం దెబ్బతిన్న భాగాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయి. అంతేతప్ప ఆరోగ్యకరమైన కణాలను ఎంతమాత్రమూ ముట్టుకోవు. అలాగే గ్లూకోజమైన్ వంటి కాండ్రోప్రొటెక్టివ్ మందులు కూడా నొప్పిని తగ్గిస్తాయి. అయితే అవి కీలులో తగ్గిన గుజ్జును మళ్లీ పుట్టించవు. కాకపోతే గుజ్జు తరిగిపోయే ఒరవడిని మాత్రమే తగ్గిస్తాయి. ఆ ప్రకటనలూ, ప్రచారాలూ నమ్మకండి... ఇటీవల చాలామంది స్టెమ్సెల్స్తోనూ, ప్రోటీన్ రిచ్ ప్లాస్మా థెరపీతోనూ అరిగిపోయిన కార్టిలేజ్‌ను మళ్లీ పెంచగలమని ప్రకటనలు గుప్పిస్తూ, అమాయకులైన ప్రజలను ఆకర్షిస్తున్నారు. సాధారణంగా ఆపరేషన్ అంటే భయపడేవారే ఇలాంటి ప్రకటనలకు తేలిగ్గా ఆకర్షితులవుతుంటారు. నిజానికి నాలుగో దశ దాకా అరిగిన కార్టిలేజ్‌ను (గుజ్జును) మళ్లీ పుట్టించడం, లేదా మళ్లీ పెరిగేలా చేయడం వైద్యప్రక్రియలో లేనేలేదు. వైద్యపరంగా అలాంటి చికిత్సలకు ఎలాంటి హేతుబద్ధతా లేదు. చాలామంది తమ విలువైన డబ్బును, సమయాన్ని వృథా చేసుకొని, మోకాలి కీలుకు శాశ్వతంగా నష్టం చేకూరాకే మళ్లీ అసలైన వైద్యుల దగ్గరికి వస్తుంటారు. అలాగే కొన్నిచోట్ల పల్లెల్లో, చాలా వెనకబడిన గ్రామీణ ప్రాంతాల్లో కాల్చిన జీడి పెట్టడం, వాచిన చోట విపరీతంగా మసాజ్ చేయడం వంటివి చేస్తుంటారు. ఫలితంగా మోకాలి లోపలి కీలకమైన భాగాలు దెబ్బతిని శాశ్వత వైకల్యం సంభవించవచ్చు. కాబట్టి అలా ఎవరైనా చెప్పినా నమ్మరాదు. శస్త్రచికిత్సే శరణ్యమా? మోకాలు మొదలుకొని అన్నిరకాల కీళ్లనొప్పులలోనూ 80% సందర్భాల్లో మందులు, ఫిజియోథెరపీ, వ్యాయామంతోనే చాలావరకు తగ్గుతాయి. కేవలం 20% కేసుల్లోనే శస్త్రచికిత్స అవసరం. ముందే చెప్పినట్లుగా కీళ్లనొప్పుల్లో ఉండే తీవ్రత... మూడు నాలుగు దశలకు చేరినప్పుడు మాత్రమే శస్త్రచికిత్స అవసరమని గుర్తించాలి. కాబట్టి ముందే డాక్టర్‌ను సంప్రదించి శస్త్రచికిత్స వరకు వెళ్లకుండా కాపాడుకునే జీవనశైలి జాగ్రత్తలు పాటించాలి. వ్యాయామమే నైవేద్యం మన పక్షాన మన భారం వహించేవాడినే మనం దేవుడు అంటాం కదా. అలాగే మన మోకాలి గర్భగుడిలో ఉండే కీలుదైవం కూడా మన భారాన్ని వహిస్తాడనుకోవచ్చు. మరి ఆ దైవాన్ని ప్రార్థించి, సమర్పించదగిన నైవేద్యం ఏమిటి? వ్యాయామమే మనం మన మోకాలి గర్భగుడిలో వసిస్తూ, మన భారాన్ని తీసుకునే దేవుడికి సమర్పించే నైవేద్యం. ఒక ప్రార్థనలా మనం ప్రతిరోజూ కనీసం 15 నిమిషాల పాటు నడకారాధన నిర్వర్తించి సమర్పించే ఆ పూజా నైవేద్యంతో సంతృప్తి పడే కీలుదేవత మనను ఇతరులపై మన భారం పడకుండా చూస్తాడు. మన కాళ్లపై మనం నిలబడేలా చేస్తాడు. అయితే కొందరిలో అప్పటికే మోకాళ్ల నొప్పులు వచ్చి నడవడం సాధ్యపడకపోవచ్చు. అలాంటి వారు ఒంటిపై ఎలాంటి బరువు పడని ఈత వంటి వ్యాయామాలు చేయవచ్చు. కొందరు మెట్లు ఎక్కడం కూడా మంచి వ్యాయామమే కదా అంటుంటారు. అది గుండెకూ, ఊపిరితిత్తులకూ మంచిదే కానీ... మోకాలికి కాదు. ఎందుకంటే మెట్లు ఎక్కుతున్నప్పుడు మోకాలిపైనా, అందులోని షాక్ అబ్జార్బర్స్పైనా చాలా భారం పడుతుంది. కాబట్టి మోకాలితోపాటు, గుండెకూ, ఊపిరితిత్తులకూ అన్నింటికీ ఆరోగ్యాన్నిచ్చే వ్యాయామాలు చేయడమే మంచిది కదా! గర్భగుడి అంతటి పవిత్రమైనది మోకాలి కీలు మోకాలి కీలు గర్భగుడి అంతటి పవిత్రమైనది. గర్భగుడిలో దేవుడు మాత్రమే ఉంటాడు. ప్రధాన పూజారి మినహాయించి ఎవరికి పడితే వారికి గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు. అలాగే మోకాలి కీలు (ఆ మాటకొస్తే అన్ని రకాల కీళ్లు కూడా) దగ్గరికి కూడా ఏ మందులు పడితే ఆ మందులు, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు చేయించకూడదు. దురదృష్టవశాత్తూ చాలాచోట్ల తెలిసీ తెలియని గ్రామీణ వైద్యులు (ఆర్ఎంపీలు, క్వాక్స్) మోకాలిలో నొప్పి వంటివి వచ్చినప్పుడు నీరు తీయడం, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వంటి అనుచితమైన పనులు చేస్తుంటారు. నిజానికి మోకాలు చెప్పుకోదగ్గంత పరిమాణంలో వాస్తే తప్ప... మోకాలిలోంచి నీరు తీయడం వంటి చర్యలకు పాల్పడకూడదు. అదీ ఒకటి రెండు సార్లు మాత్రమే. అలాగే కొంతమంది హైలూరానిక్ యాసిడ్ వంటి కందెనను ఎక్కిస్తామంటారు. కానీ దానితోనూ పెద్దగా ప్రయోజనం ఉండదు. కాబట్టి అలా కందెనను ఎక్కిస్తామనే వైద్యాన్నీ నమ్మడం సరికాదు. వాస్తవానికి... తీవ్రంగా అవసరం ఉంటేనే తప్ప అనుభవజ్ఞులైన వైద్యులు నీరు తీయడం అనే చర్యకు ఉపక్రమించరు. హైలూరానిక్ యాసిడ్ వంటి ద్రవాలను ఎక్కించే నిర్ణయాన్ని తీసుకోరు. అచ్చం... గర్భగుడిలోకి ప్రవేశించే ప్రధాన పూజారులను మినహాయించి ఎవరినీ అనుమతించనట్లే... మనం మోకాలి విషయంలోనూ దాన్ని అంతే పవిత్రంగా ఉంచాలన్నమాట. అయితే ఇలాంటి గుజ్జు ఎక్కించడాలు, స్టెరాయిడ్స్ ఇంజెక్ట్ చేయడాలు అనేవి 80 ఏళ్లు దాటిన వారిలోనూ, సర్జరీని తట్టుకో లేనివారిలోనూ డాక్టర్లు ఒక ఉపశమన వైద్యంలా చేస్తుంటారు. వారిని మినహాయించి, ఇలాంటి వైద్యాలు అంతకంటే చిన్నవయసు వారికి తగవు. మహిళల్లో 4 రెట్లు ఎక్కువ సాధారణంగా కీళ్లనొప్పులు వచ్చే అవకాశాలు పురుషులతో పోలిస్తే మహిళల్లో నాలుగు రెట్లు ఎక్కువ. దీనికి నిర్దిష్టంగా కారణాలు తెలియవు. అయితే మహిళల్లో బరువు పెరగడం, స్థూలకాయం, హార్మోన్ల తేడాలు, వ్యాయామం అంతగా లేకపోవడం వంటి అంశాలు ఇందుకు కారణాలని చెప్పవచ్చు. కీళ్లనొప్పుల్లో ముఖ్యమైనది అవాస్క్యులార్ నెక్రోసిస్... భారతదేశంలో చాలామందికి ఒక వయసు దాటాక తుంటిఎముక నొప్పి సాధారణంగా కనిపిస్తుంటుంది. మన తొడ ఎముకపై భాగం ఒక గుండ్రటి బంతిలా ఉండి, అది తుంటి ఎముకలోని గిన్నె వంటి భాగంలో కదులుతూ ఉంటుందన్నది తెలిసిందే. కొంతమందిలో ఈ బంతివంటి భాగానికి రక్తసరఫరా అందదు. దాంతో ‘అవాస్క్యులార్ నెక్రోసిస్’ (ఏవీఎన్) అనే కండిషన్ ఏర్పడి తీవ్రమైన తుంటి నొప్పి వస్తుంది. మిగతా ఎముకలూ, కీళ్ల విషయంలోనూ ఇది జరగవచ్చు. కానీ ప్రధానంగా తుంటి ఎముక దగ్గర నొప్పి రావడమే మన దేశంలో చాలా ఎక్కువ. దీనికి కారణాలేమిటి అన్న విషయం నిర్దిష్టంగా తెలియదు. అయితే ఆల్కహాల్, స్టెరాయిడ్స్ కూడా ఇందుకు కొంతవరకు కారణం కావచ్చని తెలుస్తోంది. కాబట్టి ఎముకలు బలంగా, కీళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్, స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉండాలి. డాక్టర్ గురవారెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ – చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సన్‌షైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
మహిళల బోలు ఎముకల సమస్యకు కొత్త పరిష్కారం
ప్రపంచవ్యాప్తంగా కనీసం 20 కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న ఆస్టియోపొరోసిస్ (బోలు ఎముకల వ్యాధి)కు సరికొత్త చికిత్స లభించనుంది. అంతా కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితం. ఎలుకల మెదళ్లలో కొన్ని న్యూరాన్లను తొలగించినప్పుడు అవి విపరీతంగా బరువు పెరగడాన్ని గుర్తించిన డాక్టర్ కొరేరా ఆ దిశగా మరిన్ని పరిశోధనలు చేపట్టారు. పెరిగిన బరువు కండరాలు, కొవ్వుల్లో కాకుండా ఎముకల్లో మాత్రమే ఉండటం.. ఖనిజ సాంద్రత కూడా ఎక్కువ కావడం గుర్తించిన కొరేరా ఈ పద్ధతిని బోలు ఎముకల వ్యాధి చికిత్సకు వాడవచ్చునని గుర్తించారు. మహిళల్లో రుతుక్రమం ఆగిపోయిన తరువాత ఎముకలు బోలుగా మారిపోవడం ఎక్కువన్నది తెలిసిందే. సాధారణ ఎలుకలతో పోలిస్తే ఈస్ట్రోజెన్ రిసెప్టర్ ప్రొటీన్లు తొలగించిన వాటిల్లో ఎముకల ద్రవ్యరాశి దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉండటం తాము గమనించామని... మెదడులోని హైపోథాలమస్‌లో ఇలాంటి ప్రొటీన్లు కొన్ని వందల రకాలు ఉన్నట్లు తెలుసుకున్నామని కొరేరా వివరించారు. ముదిమి వయసులో ఈ న్యూరాన్లు ఎముకల పెరుగుదలకు తక్కువ శక్తిని కేటాయించేలా సంకేతాలు పంపడం వల్ల ఎముకలు గుల్లబారుతున్నట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. ఈ న్యూరాన్లను ఎలా నియంత్రించాలన్న అంశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నామని.. అది తెలిస్తే వయసు మళ్లిన తరువాత కూడా ఎముకలు దృఢంగా ఉండేలా చేయడం సాధ్యమవుతుందని అన్నారు. -
టెండ నైటిస్ తగ్గుతుందా?
నా వయసు 42 ఏళ్లు. నేను క్రికెట్ ఎక్కువగా ఆడతాను. ఇటీవల కొంతకాలంగా చేయి కదిలించినప్పుడు భుజంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే టెండన్స్‌కి సంబంధించిన వ్యాధి అని చెప్పారు. ఎన్ని మందులు వాడుతున్నా సమస్య నుంచి ఉపశమనం లభించడం లేదు. హోమియో చికిత్స ద్వారా దీన్ని పూర్తిగా నయం చేసే అవకాశం ఉందా? మీరు వివరంగా తెలిపిన లక్షణాలను బట్టి మీరు టెండినైటిస్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మన శరీరంలోని కండరాలను ఎముకలతో జతపరిచే తాడు లాంటి కణజాలాన్ని టెండన్స్ అని అంటాము. ఇవి ఫైబ్రస్ కణజాలంతో ఏర్పడతాయి. వీటికి సాగగల గుణం ఉండటం వల్ల ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి అవి కండరాలు ముడుచుకునే సమయంలో, ఎముకలు, కీళ్ల కదలికలకు సహకరిస్తాయి. ఏ కారణం చేతనైనా వీటికి హానికలిగితే, కదలికలు ఇబ్బందికరంగా మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ టెండన్స్ ఇన్ఫెక్షన్కు గురికావడాన్ని టెండినైటిస్ అంటారు. శరీరంలో ఎక్కడైనా ఏర్పడే ఈ సమస్య... భుజాలలో, మోచేతుల్లో, మణికట్టు, బొటనవేలు మొదటి భాగంలో, తుంటి, మోకాలు, మడమలు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ వయసు వారిలోనైనా కనిపించే ఈ సమస్య ఎక్కువగా పెద్దవయసు వారిలో (ముఖ్యంగా 40 ఏళ్లు పైబడినవారిలో) కనిపిస్తుంది. ఆ వయసు వారిలో సాధారణంగా టెండాన్స్ సాగేతత్వం, ఒత్తిడిని తట్టుకునే శక్తి తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కారణాలు:వయసు పెరగడం, గాయం కావడం. ∙వృత్తిరీత్యా లేదా హాబీల కారణంగా టెండన్స్‌పై అధిగ ఒత్తిడి కలిగించే ఒక రకమైన కదలికలను ఎక్కువగా కొనసాగించడం. ఉదా: కంప్యూటర్ కీ–బోర్డులు, మౌస్‌లు ఎక్కువగా వాడటం, కార్పెంటింగ్, పెయింటింగ్ మొదలైనవి. క్రీడల వల్ల... పరుగెత్తడం, టెన్నిస్, బాస్కెట్‌బాల్, గోల్ఫ్, బౌలింగ్ మొదలైనవాటివల్ల డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, స్థూలకాయం వంటి ఇబ్బందులతో బాధపడేవారిలో ఈ సమస్యకు గురయ్యే అవకాశం ఉంది ∙కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ టెండినైటిస్ సంభవించే అవకాశం ఉంది. లక్షణాలు:∙టెండినైటిస్‌కి గురైన ప్రదేశంలో నొప్పి, బిగువుగా ఉండటం ∙ఆ భాగాన్ని కదిలించినప్పుడు నొప్పి అధికమవ్వడం ∙కొన్ని రకాల శబ్దాలు వినిపించడం, వాపు, చేతితో తాకితే ఆ ప్రదేశం వేడిగా అనిపించడం ∙ఎర్రగా మారడంవంటి లక్షణాలను గమనించవచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ∙కంప్యూటర్లను, కీబోర్డులను, మౌస్‌లను సరైన పొజిషన్లో సర్దుబాటు చేసుకోవడం పనిలో కొంత విశ్రాంతి తీసుకోవడం వ్యాయామాలు ఒకేసారి అధిక ఒత్తిడికి గురిచేసేలా కాకుండా నెమ్మదిగా ప్రారంభించడం క్రీడలలో కోచ్ సలహా మేరకు జాగ్రత్తలు పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు. చికిత్స: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా రోగి మానసిక, శారీరక పరిస్థితులు, తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందించండం ద్వారా రోగి తాలూకు రోగ నిరోధకశక్తిని సరిచేయడం వల్ల ఎలాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్నా దానిని నయం చేయడమే కాకుండా టెండన్స్‌ను దృఢపరచి సమస్యను సమూలంగా దూరం చేయడం జరుగుతుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ ఉబ్బిన రక్తనాళాలు, చికిత్స చెప్పండి నా వయసు 46 ఏళ్లు. కనీసం పది నిమిషాల పాటు నిల్చోలేకపోతున్నాను. కాళ్లు లాగుతున్నాయి. కాళ్లపై నరాలు ఉబ్బి పాదాలు నలుపు రంగులోకి మారుతున్నాయి. దీనికి హోమియోలో పరిష్కారం ఉందా? మీకు ఉన్న సమస్యను వేరికోస్ వెయిన్స్ అంటారు. శరీరంలోని సిరలు బలహీనపడటం వల్ల ఈ వేరికోస్ వెయిన్స్ సమస్య వస్తుంది. ఈ సమస్యలో రక్తనాళాల రంగు మారడం లేదా నలుపు రంగుకి రావడం జరుగుతుంది. ఈ వ్యాధి ఎక్కువగా కాళ్లలో కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, అవగాహన లేమి వల్ల ఈ వ్యాధి తీవ్రరూపం దాల్చి ఇతర సమస్యలకు దారితీస్తోంది. సాధారణంగా రక్తం కింది నుంచి గుండెవైపునకు వెళ్లే సమయంలో భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో రక్త సరఫరా అవుతుండటం వల్ల రక్తప్రసరణ మందగించడం, కాళ్ల ఒత్తిడి పెరగడం జరగవచ్చు. ఈ క్రమంలో సిరలు (రక్తనాళాలు) నలుపు లేదా ఊదా రంగుకు మారుతాయి. దీనివల్ల కాళ్లలో తీవ్రమైన నొప్పి ఏర్పడి నడవడానికీ వీలు కాదు. ఈ వేరికోస్ వెయిన్స్ వ్యాధి శరీరంలోని ఇతర భాగాలలోనూ వస్తుంది కానీ 80 శాతం కేసుల్లో ఇది కాళ్లపైనే కనిపిస్తుంది. సాధారణంగా 30 ఏళ్ల పైబడిన వారిలో ఈ వేరికోస్ వెయిన్స్ కనిపిస్తుంది. మహిళలు, స్థూలకాయులు, వ్యాయామం చేయనివారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కారణాలు:ముందుకు ప్రవహించాల్సిన రక్తం వెనకకు రావడం ∙కొంతమంది మహిళల్లో గర్భధారణ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పులు ∙ఎక్కువ సేపు నిలబడి చేయాల్సిన ఉద్యోగాల్లో (పోలీస్, సెక్యూరిటీ సిబ్బంది, కండక్టర్, వాచ్‌మేన్, సేల్స్‌మెన్, టీచర్లు వంటి) ఉద్యోగాలలో ఉండేవారికి ఈ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. లక్షణాలు:కాళ్లలో నొప్పి, మంట, కాళ్లలోని కండరాలు బిగుసుకుపోవడం ∙కొద్దిసేపు నిలబడితే నొప్పి రావడం, దాని తీవ్రత పెరుగుతూ పోవడం ∙చర్మం దళసరిగా మారడం ∙చర్మం ఉబ్బడం, పుండ్లు పడటం. వ్యాధి నిర్ధారణ:అల్ట్రాసౌండ్, డ్యూప్లెక్స్ డాప్లర్ అల్ట్రా సౌండ్. చికిత్స:వేరికోస్ వెయిన్స్, వేరికోసిల్ వంటి వ్యాధులకు హోమియోపతి చికిత్సలో అనుభవం ఉన్న, పరిశోధనల అనుభవం ఉన్న వైద్యులు చికిత్స చేస్తారు. వ్యాధి తీవ్రతను పరిశీలించి, రోగి వ్యక్తిగత లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఆపరేషన్ అవసరం లేకుండానే మంచి మందులు సూచిస్తారు. హోమియోలో ఈ సమస్యకు హామామెలిస్, పల్సటిల్లా, కాల్కేరియా, గ్రాఫైటిస్, కార్బోవెజ్, ఆర్నికా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతా తెల్లమచ్చలు పెరుగుతున్నాయి... తగ్గేదెలా? నా వయసు 39 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ►బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. ►పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. ►జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు : ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. ►మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ►కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. ►వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
పీరియడ్స్ టైమ్‌లో ఎందుకీ సమస్య?
నా వయసు 37 ఏళ్లు. గృహిణిని. నాకు రుతుసమయంలో శ్వాస అందదు. ఆయాసంగా ఉంటుంది. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? నా సమస్య ఏమిటన్నది దయచేసి వివరంగా చెప్పండి. – కె. పారిజాత, పాయకరావుపేట మీకు ఉన్న సమస్యను కెటామెనియల్ ఆస్తమా అని చెప్పవచ్చు. కెటామెనియల్ ఆస్తమా అనే దాన్ని రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా కూడా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం కొంతమంది మహిళల్లో కనిపించిన దాఖలాలు ఉన్నాయి. పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు. అయితే అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాన్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవేపాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. దాంతో ఆస్తమా పెచ్చరిల్లుతుంది. రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమా కండిషన్‌ను ప్రేరేపిస్తాయి. అందుకే... రుతుక్రమానికి ముందుగా వచ్చే ఆస్తమా విషయంలో దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం. చాలామంది రోగులు ల్యూటియల్ దశగా పేర్కొనే అండం ఆవిర్భవించే దశ నుంచి అది ఫలదీకరణ చెందనందువల్ల రుతుసమయంలో పడిపోయే సమయంలో వచ్చే ఆస్తమాకు గాను, మామూలుగా ఆస్తమాకు వాడే మందులనే అత్యధిక మోతాదుల్లో ఇస్తే ఉపశమనం పొందుతారు. ఇక మిగతావారిలో కండలోకి ప్రోజెస్టెరాన్ ఇంజెక్షన్ ఇస్తే... కాస్త మెరుగవుతారు. కాబట్టి మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికే చికిత్స అందించాల్సి ఉంటుంది. అందుకని మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి. ఇది ఏ రకం టీబీ? పల్మునాలజీ కౌన్సెలింగ్ మా నాన్నగారికి మద్యం, పొగతాగడం వంటి అలవాట్లు ఉన్నాయి. మొదట్లో ఆయనకు పల్మునరీ ట్యూబర్క్యులోసిస్ అనే జబ్బు వచ్చింది. అయితే ఆయన చికిత్స విషయంలో కాస్తంత నిర్లక్ష్యం వహించారు. కొంతకాలం మందులు తీసుకోవడం, ఆ తర్వాత ఆపేయడం.... ఇలా చేశారు. ఇప్పుడు ఆయనకు మళ్లీ టీబీ వచ్చింది. డాక్టర్లు చూసి దాన్ని ‘ఎమ్‌డీఆర్ టీబీ’ అంటున్నారు. అంటే ఏమిటి? ఇప్పుడు మేమేం చేయాలి. మాకు తగిన సలహా ఇవ్వగలరు. – సోమేశ్, కందుకూరు ఎమ్‌డీఆర్ టీబీ అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని అర్థం. అంటే తొలిదశ మందులకు లొంగని రకానికి చెందిన టీబీ అని చెప్పవచ్చు. మొదట మన శరీరంలో టీబీ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా (ట్యూబర్క్యులోసిస్ బాసిల్లస్) ప్రవేశించినప్పుడు కొన్ని శక్తిమంతమైన మందులైన ఐసోనియాజైడ్, రిఫాంపిన్ వంటి వాటితో చికిత్స చేస్తుంటాం. ఇలా ఆర్నెల్ల పాటు డాక్టర్ల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ఈ మందుల పూర్తి కోర్సును తీసుకుంటేనే టీబీ పూర్తిగా తగ్గుతుంది. అంతేగాని ఒకవేళ ఈ మందులను నిర్లక్ష్యంగా వాడినా లేదా తగిన మోతాదులో వాడకపోయినా, లేదా కొంతకాలం వాడాక లక్షణాలు తగ్గగానే మళ్లీ ఆపేసినా, లేదా మందులను సరిగా నిల్వ చేయకపోయినా... వ్యాధిని కలిగించే సూక్ష్మక్రిములు ఆ మందులకు లొంగని విధంగా తయారవుతాయి. అత్యంత శక్తిమంతమైన ఆ టీబీ మందుల పట్ల తమ నిరోధకత స్థాయిని పెంచుకుంటాయి. దాంతో అవి తమ శక్తిని పెంచుకోవడమే కాదు... ఇతర ఆరోగ్యవంతులైన వ్యక్తులకూ వ్యాపించే విధంగా తయారవుతాయి. ఒక వ్యక్తిలోని టీబీ వ్యాధి మందులకు లొంగని విధంగా తయారయ్యిందా అని నిర్ధారణ చేయడానికి కొన్ని ల్యాబరేటరీ పరీక్షలు అవసరమవుతాయి. ఆ పరీక్షల ద్వారా మందులకు లొంగని విధంగా వ్యాధి తయారయ్యింది. ఈ పరీక్షల్లో మాలెక్యులార్ బేస్డ్ అనీ, కల్చర్ బేస్డ్ అనీ రకాలున్నాయి. మాలెక్యులార్ బెస్డ్ పరీక్షల ద్వారా కేవలం కొద్ది గంటల్లోనే ఫలితాలు వెల్లడవుతాయి. ఇలా ఒక టీబీ వ్యాధి సాధారణ స్థాయి నుంచి మందులకు లొంగని విధంగా నిరోధకత పెంచుకుందని తెలియగానే, రెండోశ్రేణి మందులను (సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్) వాడటం మందుపెట్టాలి. ఇందులో నాలుగు లేదా అంతకుమంచి మందులుంటాయి. వాటిని కనీసం ఆర్నెల్ల పాటు క్రమం తప్పకుండా వాడాలి. ఒక్కోసారి రిఫాంపిన్ మందుకు సూక్ష్మక్రిమి నిరోధకత పెంచుకుందని తెలిసినప్పుడు ఈ చికిత్సా కాలాన్ని 18 – 24 నెలలకూ పొడిగించాల్సి రావచ్చుకూడా. ఈ రెండేశ్రేణి మందులు కాస్త ఖరీదైనవి, విషపూరితమైనవి కాబట్టి... మొదటిసారే పూర్తిగా తగ్గేలా జాగ్రత్త తీసుకోవడం అన్నివిధాలా మంచిది. ఇక రెండేశ్రేణి మందులు వాడే చికిత్సలో వ్యాధి పూర్తిగా తగ్గే పాళ్లు 70 శాతం వరకు ఉంటాయి. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
కండరాలు పట్టేస్తున్నాయి... కారణమేమిటి?
న్యూరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 36 ఏళ్లు. గత కొంతకాలంగా నాకు కాళ్లూ, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టుకుపోతున్నాయి. తీవ్రమైన నొప్పి వస్తోంది. కొన్నిసార్లు కంప్యూటర్‌పై పనిచేస్తున్నప్పుడు, మరికొన్నిసార్లు నిద్రలో ఇలా జరుగుతోంది. నిద్రలో ఇలా జరిగినప్పుడు అకస్మాత్తుగా నిద్ర లేచి కుంటుతూ నడుస్తుంటాను. నాకు ఈ సమస్య ఎందుకు వస్తోంది. దీని నుంచి బయట పడటానికి మార్గం చెప్పండి. – సుధాకర్‌రావు, నల్లగొండ తరచూ కాళ్లు, చేతుల కండరాలు బిగుసుకుపోయినట్లుగా పట్టేయడానికి (క్రాంప్స్‌కు), నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. కొందరిలో తమ శరీరంలోని నీటి పాళ్లు తగ్గినా (సాధారణ డీహైడ్రేషన్ వల్ల ) కూడా మీరు చెప్పిన లక్షణాలు వ్యక్తమవుతాయి. మీరు తీవ్రమైన అలసటకు గురైనప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. మీరు వ్యాయామం చేయని కారణంగా కండరాలు బలహీనమైపోయి, తీవ్రమైన అలసట కలగడం అనేది చాలా అరుదైన సందర్భాల్లో జరిగే పరిణామం. దీనివల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో సాధారణంగా పిక్కలు పట్టేస్తాయి. ఇలాంటివారు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, మీ కండరాలను బలపరచుకోవాల్సి ఉంటుంది. ఇక కొందరిలో సోడియమ్, పొటాషియమ్, చక్కెరపాళ్లు, క్యాల్షియమ్, మెగ్నీషియమ్ వంటి ఖనిజ లవణాలు తగ్గడం గానీ లేదా పెరగడం గానీ జరిగినా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొందరిలో కాలేయం, మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. ఇక కొందరిలో విటమిన్ బి12, విటమిన్ డి తగ్గడం వల్ల, థైరాయిడ్, అడ్రినల్ గ్రంథులు సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా ఇవే లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి. కొందరిలో కొన్నిసార్లు సాధారణ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు కూడా ఇవే లక్షణాలు కనిపించవచ్చు. అలాగే కొందరిలో పెరిఫెరల్ నర్వ్స్ అనే నరాలు, వెన్నెముక లోపాలతోనూ ఈ లక్షణాలు కనిపించవచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజిస్ట్‌ను కలిసి, విపులంగా రక్త పరీక్షలు చేయించుకొని, లక్షణాలకు అసలు కారణాన్ని కనుక్కోవాలి. సమస్య ఏమిటన్నది కనుగొంటే దాన్ని బట్టి చికిత్స ఉంటుంది. కొన్నేళ్లుగా తీవ్రమైన తలనొప్పి... తరచూ ఎందుకిలా? నా వయసు 32. గత 12 ఏళ్లుగా నాకు తరచూ తలనొప్పి వస్తోంది. ఒక్కోసారి అది నెలలో నాలుగైదుసార్లు కూడా వస్తోంది. దీని తీవ్రత ఎంతగా ఉంటుందంటే నేను నా రోజువారీ పనులేవీ చేసుకోలేకపోతున్నాను. ఇది తగ్గేదెలా? – వసుంధర, మహబూబ్‌నగర్ తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్ కావచ్చు. మీకు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, ఘాటైన వాసనలు, పర్ఫ్యూమ్స్ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే ఆ పదార్థాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. పక్షవాతానికి స్టెమ్‌సెల్ థెరపీ అందుబాటులో ఉందా? నేను గత తొమ్మిదేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాను. ఇటీవల వార్తాపత్రికలు చదువుతూ పెరాలసిస్‌కు మూలకణ చికిత్స (స్టెమ్‌సెల్ థెరపీ) అందుబాటులోకి వచ్చినట్లు తెలుసుకున్నాను. నేను ఈ చికిత్స తీసుకోదలిచాను. ప్రస్తుతం ఇది ఎక్కడ లభ్యమవుతోంది, దీనికి ఎంత ఖర్చవుతుంది, దాని ఫలితాలెలా ఉన్నాయనే వివరాలు విపులంగా తెలియజేయండి. – ఎల్. జీవన్‌రెడ్డి, కర్నూలు ఒకసారి మెదడులోని కణాలు చనిపోతే అవి శాశ్వతంగా చనిపోయినట్టే. అది పక్షవాతం వల్ల చనిపోయినా లేదా మెదడుకు గాయం కావడం వల్ల చనిపోయినా మెదడులోని కణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరుజ్జీవించలేవు. కానీ ఒక ఆశారేఖ ఉంది. మెదడు కణాలు చనిపోయిన సమయంలోనే ఆ కణాలలో నిక్షిప్తం అయి ఉన్నదాన్ని మనం తిరిగి పొందాలంటే దెబ్బతిన్న కణాలకు పక్కనే ఉండే కణాలు తోడ్పడతాయి. మన మెదడుకు ఉన్న ఈ అద్భుతమైన శక్తిని ‘న్యూరోనల్ ప్లాస్టిసిటీ’ అని వ్యవహరిస్తారు. ఇలా మనం 80 శాతం మేరకు కోలుకోడానికి ఆర్నెల్ల నుంచి ఏడాది వ్యవధి పడుతుంది. ఇక మూలకణాల విషయానికి వద్దాం. మూలకణాలతో చికిత్స అంటే... ఇవి మన శరీరంలోని ఎలాంటి కణాలుగానైనా మారేశక్తి ఉన్న కణాలన్నమాట. పక్షవాతానికి మూలకణాలతో చికిత్స చేసే ప్రక్రియలో విషయంలో రెండు రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాం. మొదటిది... మెదడులోనే చెడిపోయి ఉన్న కణాలను కొన్ని మందుల ద్వారా మళ్లీ ప్రేరేపించి పనిచేయించేలా చూడటం; ఇక రెండోది... బయటి నుంచి మూలకణాలను శరీరంలోకి పంపడం. అంటే ఉదాహరణకు చెడిపోయిన మూలగ స్థానంలో కొత్త కణాలు పంపి, కొత్త మూలగను రూపొందించేలా చేయడం అన్నమాట. ఇక చనిపోయిన మెదడుకణాల స్థానంలో మూలకణాలను ప్రవేశపెట్టడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. ఇందులో మూలకణాలు పాతకణాలతోనూ, న్యూరాన్ల దారులతో అనుసంధానితం అయి, అక్కడి రసాయన చర్యలకు అనుగుణంగా స్పందిస్తూ ఉండటానికి చాలా కాలం పడుతుంది. ఇందుకు కొన్నేళ్ల వ్యవధి కూడా పట్టవచ్చు. ఇవ్వాళ్టికీ ఈ విషయంలో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికి వచ్చిన ఫలితాలైతే అంత సంతృప్తికరంగా లేవు. కాబట్టి ప్రస్తుతానికి మూలకణ చికిత్స అన్నది పరిశోధన దశలోనే ఉంది. పరిస్థితి ఇంకా ఆసుపత్రిలో చికిత్స అందించే వరకు రాలేదు. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
తడిపే అలవాటు తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ మా బాబు వయసు 13 ఏళ్లు. చిన్నప్పటి నుంచి రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటు ఉంది. ఈ సమస్య వల్ల బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించే అవకాశం ఉందా? - సునీత, కందుకూరు పెద్దపిల్లలు రాత్రుళ్లు నిద్రలో పక్క తడిపే అలవాటును వైద్య పరిభాషలో నాక్చర్నల్ ఎన్యురెసిస్ అంటారు. ఈ సమస్యతో బాధపడే పిల్లలు, వారి తల్లిదండ్రులు చాలా ఆదుర్దాతో ఉంటారు. సాధారణంగా పిల్లల్లో రాత్రివేళల్లో మూత్రవిసర్జనపై అదుపు అన్నది రెండు నుంచి ఐదేళ్ల వయసులో వస్తుంటుంది. కానీ ఐదు శాతం మంది పిల్లల్లో పదేళ్ల వయసు తర్వాత కూడా మూత్రవిసర్జనపై అదుపు రాకపోవచ్చు. ఐదేళ్ల వయసు తర్వాత కూడా తరచూ పక్కతడిపే అలవాటు ఉండటాన్ని ప్రైమరీ ఎన్యురెసిస్ అంటారు. సాధారణంగా ఇది కొన్నాళ్లలోనే తగ్గిపోతుంది. ఎదుగుదల సమయంలో వచ్చే లోపం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. అయితే కొంతమంది పిల్లలు పక్కతడపడం మానివేశాక, మళ్లీ ఆర్నెల్ల తర్వాత సమస్య తిరగబెట్టవచ్చు. ఇంతకుముందు పక్కతపడపకుండా ప్రస్తుతం మళ్లీ పక్కతడపడం మొదలుపెట్టినట్లయితే దాన్ని ‘సెకండరీ ఎన్యురెసిస్’ అంటారు. కారణాలు : నాడీ వ్యవస్థ ఎదుగుదల లోపాలు, జన్యుపరమైన సమస్యలు, ఇన్ఫెక్షన్లు, మూత్రాశయం సమస్యలు, కొందరిలో వంశపారంపర్య కారణాల వల్ల ఈ సమస్య కనిపిస్తుండవచ్చు. ఇంకొంతమంది పిల్లల్లో కండరాలు ఎక్కువ సార్లు అనియంత్రితంగా సంకోచం చెందడం వంటి కారణాలతోనూ ఈ సమస్య కనిపించవచ్చు. టైప్–1 డయాబెటిస్, మలబద్దకం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడటం వల్ల, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమంది పిల్లల్లో మానసిక ఒత్తిడి, భయం వల్ల కూడా రాత్రివేళలో తమకు తెలియకుండానే మూత్రవిసర్జన జరిగిపోవచ్చు. పక్క తడిపే పిల్లలను తిట్టడం, వాళ్లకు శిక్షలు విధించడం వల్ల పిల్లలు మరింత కుంగిపోయి సమస్య మరింత జటిలం అవుతుంది. ఇలా పిల్లలను మందలించడం వల్ల ప్రయోజనం చేకూరదు సరికదా... కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే హోమియో చికిత్సతో పిల్లల్లో ఈ అలవాటు పూర్తిగా మాన్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
యోగాతో కూడా డేంజరే
ఆయురారోగ్యాలతోపాటు మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో మంచిదని నమ్ముతున్న భారతీయులు దాదాపు ఐదువేల సంవత్సరాల నుంచి యోగాను అభ్యాసం చేస్తున్న విషయం తెల్సిందే. అందుకనే భరత దేశం ఇచ్చిన పిలుపు మేరకు ఐక్యరాజ్యసమితి జూన్ 21వ తేదీని ప్రపంచయోగా దినోత్సవంగా కూడా ప్రకటించింది. హాలివుడ్ సెలబ్రిటీలు బెయాన్స్, లేడీ గగాలు, బ్రెజిల్ సూపర్ మోడల్ గిస్లీ బుండ్చెన్లతోపాటు డేవిడ్, విక్టోరియా బెకమ్లు యోగాను ప్రమోట్ చేస్తున్నారు. యోగావల్ల శరీర అవయవాలకు, ముఖ్యంగా చేతులకు ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. యోగా చేస్తున్న పది మందిలో ఒకరికన్నా ఎక్కువ మందికి ‘మస్క్యులోస్కెలెటల్’ పెయిన్స్ అంటే కండస్థ ఎముకలకు సంబంధించిన నొప్పులు వస్తాయని వెల్లడైంది. ఇంతకు ముందే అవయవ నొప్పులు ఉన్నవారు యోగా చేస్తే అవి మరింత పెరిగే అవకాశం ఉందని సిడ్నీ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఎవాంజలస్ పప్పాస్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. యోగా వల్ల భుజాలు, మోచేతులు, ముంచేతులకు నొప్పులు వస్తాయని, కొన్ని సార్లు కాళ్లకు కూడా నొప్పులు వస్తాయని ఆయన చెప్పారు. ఇతర క్రీడల వల్ల శరీరానికి ఎలా గాయాలయ్యే అవకాశం ఉందో, యోగా వల్ల కండరాలకు గాయాలయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. యోగా వల్ల తాము ఇంతకుముందు అంచనావేసిన ముప్పు కంటే ఇప్పుడు ముప్పు పదింతలు ఎక్కువని స్పష్టమైందని ఆయన చెప్పారు. ఈ యోగా అధ్యయన వివరాలను ‘బాడీ వర్క్ అండ్ మూవ్మెంట్ థెరపీస్’ అనే పుస్తకంలో ప్రచురించారు. న్యూయార్క్‌లో రెండు వేర్వేరు యోగా క్లాసులకు హాజరవుతున్న 350 మందిపై అధ్యయనం జరపడం ద్వారా ఈ వివరాలను సేకరించినట్లు ఆయన చెప్పారు. వారిలో మొత్తం 26 శాతం మంది యోగాభ్యాసకులు సమస్యలు తలెత్తాయి. కొందరిలో పాత నొప్పులు తిరగతోడగా లేదా ఎక్కువకాగా, కొంత మందికి కొత్తగా నొప్పులు మొదలయ్యాయి. తమకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదని మిగతా 76 శాతం మంది అభ్యాసకులు తెలిపారు. కండస్థ ఎముక నొప్పులతో బాధపడుతున్న తమకు ఆ నొప్పులు తగ్గాయని కూడా కొంత మంది చెప్పారు. రక్తపోటును, గుండెపోటు, మానసిక ఒత్తిడిని అరికట్టడంలో యోగా నిర్వహిస్తున్న పాత్రను విస్మరించలేమని, కానీ కండర సంబంధిత సమస్యలు యోగా వల్ల ఉత్పన్నమవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. సంక్లిష్టమైన, కఠినమైన యోగాసనాలకు బదులుగా సులభమైన యోగాసనాలే మంచిదని వారంటున్నారు. యోగా శిక్షణ ఇచ్చే టీచర్లు కూడా తమ విద్యార్థులకు ఏమైనా నొప్పులతో బాధపడుతున్నారా?, యోగాభ్యాసం వల్ల కొత్తగా నొప్పులు వచ్చాయా? అన్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటే వాటిని ముందుగానే అరికట్టవచ్చని ప్రొఫెసర్ ఎవాంజలస్ అభిప్రాయపడ్డారు. తమ అధ్యయనాలు కూడా ఎక్కువగా యోగా శిక్షకులకు ఉపయోగపడేవేనని ఆయన చెప్పారు. -
భుజాలకు, చేతులకు శక్తినిచ్చే ఆసనాలు
యోగా కుర్చీ సాయంతో చేసే యోగా కేవలం వయసు పైబడిన వారికి, అనారోగ్యంతో బాధపడేవారికి మాత్రమే అని అనుకుంటే అది అపోహ. శరీరంలో ఉన్న 640 కండరాలకు, 360 కీళ్లకు ఫ్లెక్సిబిలిటీ రావాలన్నా, శరీరంలోని FIBROMYALGIA అనే కండరాలు పట్టుకుపోయే సమస్య పరిష్కారం కావాలన్నా, అడ్వాన్స్డ్ ఆసనాలు నేర్చు కోవాలన్నా ఏ రకమైన సాధనాన్ని ఎంచుకోవాలి అనే ప్రశ్న తలెత్తినప్పుడు దానికి ఒకే ఒక సమాధానం కుర్చీ యోగా! చతురంగాసన మోకాళ్లు, అరచేతుల సపోర్ట్ మీద పిల్లి లేదా ఒంటె భంగిమలో విశ్రాంతి పొందుతూ ముందు కుడిపాదాన్ని ఆ తరువాత ఎడమపాదాన్ని కుర్చీ సీటులో వెనుక వరకూ తీసుకెళ్లి రెండు మోకాళ్లను నిటారుగా ఉంచాలి. వేళ్లు, షిన్ బోన్ కుర్చీకి సపోర్ట్ చేస్తూ అరచేతుల సపోర్ట్‌తో శరీరాన్ని స్ట్రెయిట్ లైన్లో ఉంచే ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ ఆసన స్థితిలోకి వెళ్ళి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత పూర్వస్థితికి రావాలి. జాగ్రత్తలు: చేతులు రెండూ భుజాల దూరంలో ఉంచాలి. మణికట్టు బలహీనంగా ఉన్నవారు నేల మీద ఉంచిన అరచేతులను భుజాల పొజిషన్ కన్నా ముందుకు ఉంచాలి. దీని వల్ల మణికట్టు మీద భారం ఎక్కువగా పడదు. అలాగే మోచేతులు కూడా భుజాలు దాటి బయటకు పోకుండా వీలైనంతవరకూ సమంగా ఉంచాలి. ఉపయోగాలు: భుజాలు, మణికట్టు, నడుము భాగాలు బలపడతాయి. పొట్టలోని భాగాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. ఛాతీ పక్కన ఉన్న కండరాలు – లాటిస్సిమస్ డోర్సి, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ ఆబ్లిక్, పెక్టోరాలిస్ కండరాలకు టోనింగ్ జరుగుతుంది. ప్రిపటేటరీ, ఫాలోఅప్ ఆసనాలు – అధోముఖ, ఊర్ధ్వముఖ శ్వాసాసనాలు, భుజంగాసనం. రాజ కపోతాసన (ప్రిపరేటరీ) చతురంగాసనంలో నుంచి మోకాళ్లను భూమికి దగ్గరగా తీసుకువచ్చి పాదాలను కుర్చీ సీటు ముందు భాగంలో తలను ఛాతీని అరచేతులను నేలకు గట్టిగా ప్రెస్ చేస్తూ, పైకి లేపాలి. భుజంగాసన స్థితి అయినప్పటికీ, తొడలు నేల మీద సపోర్ట్ పెట్టకపోవడం వలన నడుము భాగం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అందువల్ల లంబార్ స్పైన్‌కి చాలా రిలీఫ్ కలుగుతుంది. రాజ కపోతాసనానికి మంచి ప్రిపరేటరీ పోజ్గానూ సాధన చేయవచ్చు. ఇంతకు ముందు ఆసనంలో చెప్పబడిన కండరాలే కాకుండా రెక్టస్ ఎబ్డామినస్, ట్రాన్స్వర్స్ ఎబ్డామినస్, గ్లూటియస్ కండరాలు బాగా స్ట్రెచ్ చేయబతాయి. ఉపయోగాలు వెన్నెముక సమస్యకి ముఖ్యంగా లంబార్ స్పైన్ సమస్యలకు సయాటిక, పించ్ నెర్వ్ సమస్యలకు, ఛాతీ భాగాలు తెరుచుకోవడానికి, గ్రాయిన్ భాగాలు బలపడటానికి ఉపయోగపడుతుంది. చాలా వపర్‌ఫుల్ హిప్ ఓపెనర్. హిప్ ఫ్లెక్సర్ ఓపెన్ అవడానికి ఉపయోగపడుతుంది. మయూరాసన (ప్రిపరేటరీ) ముందు చెప్పబడిన రాజకపోతాసన నుండి పూర్వస్థితికి అంటే ఏదో ఒక రిలాక్సింగ్ పోజ్లోకి... అంటే మోకాళ్ళు నేల మీద ఉంచి పొట్టను ఛాతీని కూడా ఆనించి రెండు చేతులు మడచి గడ్డాన్ని చేతుల మీద ఉంచి కాళ్లను రిలాక్స్ చేయాలి. ఈ భంగిమలో కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని తిరిగి పాదాలను కుర్చీలో ముందువైపు సీట్ అంచుకు సపోర్ట్‌గా ఉంచి మోచేతులు పొట్టకి ఇరువైపులా నొక్కుతూ చేతివేళ్లను వెనుకకు చూపించే విధంగా అరచేతులను పొజిషన్ తీసుకుంటూ శ్వాస వదులుతూ కాళ్లను పైకి లేపే ప్రయత్నం చేయాలి. కేవలం రెండు అరచేతుల ఆధారంగా శరీరం మొత్తాన్ని గాలిలో ఉంచే ఆసనమే మయూరాసనం. రెండు మూడు సాధారణ శ్వాసల తరువాత పూర్వస్థితికి రావాలి. జాగ్రత్తలు: మణికట్టు దృఢంగా లేనివాళ్లు ఈ ఆసనం సాధనం చేయడం మంచిది కాదు. శరీర భారాన్ని కేవలం రెండు అరచేతుల మీద పైకి లేపాలి కనుక నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. ఉపయోగాలు: భుజాలు, చేతులు దృఢంగా అవుతాయి. పొట్ట కండరాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. రీ ప్రొడక్టివ్ సిస్టమ్ పనితీరు మెరుగుపడుతుంది. డయాబెటిస్ ఉన్న రోగులకు మంచిది. లైంగిక పటుత్వం పెరుగుతుంది. ⇒ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ ⇒సమన్వయం: సత్యబాబు -
ఛాయ్మంతి
హెల్త్‌టిప్స్ చేమంతి పూలలోని ఔషథగుణాలు అనేక రకాల గర్భకోశ సమస్యలను నివారిస్తాయి. ఒక కప్పు నీటిని మరిగించి రెండు టీ స్పూన్ల చేమంతి రెక్కలను వేసి మూతపెట్టి మంట మీద నుంచి దించేయాలి. ఐదు నిమిషాల తర్వాత వడపోసి తాగాలి. ఈ చేమంతి టీ లో రుచి కోసం కొంచెం తేనె కాని చక్కెర కాని కలుపుకోవచ్చు. నెలసరి మొదలు కావడానికి రెండు లేదా మూడు రోజుల ముందు నుంచి రోజుకు ఒక కప్పు తీసుకోవాలి. అలాగే మొదలైన తర్వాత రోజుకు రెండు కప్పులు తాగాలి. ఇలా చేయడం వల్ల బ్లీడింగ్ సమయంలో కండరాలు పట్టేసినట్లయి నొప్పి రావడాన్ని నివారించవచ్చు. ఏడాది పొడవునా తాజా చేమంతిపూలు దొరకడం కష్టం కాబట్టి అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఎండబెట్టి నిల్వచేసుకుని వాడుకోవచ్చు. రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి బాధిస్తుంటే కింద పొట్ట మీద, నడుము మీద వేడి కాపడం పెట్టాలి. చిన్న టవల్‌ను వేడినీటిలో ముంచి కాపడం పెట్టవచ్చు లేదా మార్కెట్లో దొరికే హాట్ప్యాక్ బ్యాగ్ వాడవచ్చు. -
పూర్తిగా తగ్గాక కూడా... పక్షవాతాన్ని తెచ్చే జికా!
జికా వ్యాధి సోకిన వారిలో కొందరికి తాత్కాలికంగా అవయవాలు చచ్చుబడిపోతాయా అన్న ప్రశ్నకు అవును అనే సమాధానమే వస్తోంది. కొత్తగా వెలుగు చూస్తున్న పరిశోధనలు ఈ అంశాన్ని గట్టిగా చెబుతున్నాయి. గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనే వ్యాధి ఏదైనా ఇతర ఇన్ఫెక్షన్ సోకి నయమైన వారిలో కనిపిస్తుంటుంది. దీని వల్ల శరీరంలో కాళ్ల దగ్గర్నుంచి క్రమంగా ఒళ్లంతా చచ్చుబడిపోతుంది. నిజానికి ఒంటి కండరాలు చచ్చుబడేలా చేసే గులియన్ బ్యారీ సిండ్రోమ్‌ను క్రమంగా తట్టుకుని నిలిస్తే కొన్ని నెలల వ్యవధి తర్వాత పరిస్థితి మామూలుగా కావచ్చు. కండరాలు మళ్లీ మెదడు అదుపులోకి రావచ్చు. కానీ ఒక్కోసారి గులియన్ బ్యారీ సిండ్రోమ్ రోగి శ్వాసవ్యవస్థను ప్రభావితం చేస్తే ఊపిరితిత్తులు పనిచేయకుండా పోవచ్చు. దాంతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడి, రోగిని ఇంటెన్సివ్ కేర్‌లో చేర్చాల్సిన అవసరం రావచ్చు. జికా వచ్చిపోయాక గులియన్ బ్యారీ సిండ్రోమ్ రావచ్చని, దాని వల్ల ఒళ్లు చచ్చుబడిపోవడం, క్రమంగా పక్షవాతం లక్షణాలు కనిపించడం జరుగుతుందంటున్నారు పరిశోధకులు. ఈ కొత్త సంగతులన్నీ ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం గులియన్ బ్యారీ సిండ్రోమ్‌తో బాధపడేవారిలో లోతైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించినప్పుడు వారిలో జికా వైరస్ ఉన్నట్లు తేటతెల్లమైంది. ‘‘అవును... జికా తర్వాత గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చేందుకు అవకాశమున్నట్లు తేలింది. ఆ రెండు వ్యాధుల మధ్య ఉన్న సంబంధం స్పష్టమైంది’’ అంటారు ప్యాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్‌లోని కమ్యూనికబుల్ డిసీజెస్ విభాగం డెరైక్టర్ డాక్టర్ మార్కోస్ ఎస్పినాల్. బ్రెజిల్, కొలంబియా, ద డొమెనిక్ రిపబ్లిక్, ఎల్ సాల్వెడార్, హోండురాస్, సురినామ్, వెనిజులా వంటి పలు చోట్ల గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన అనేక మంది రోగులకు నిర్వహించిన వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఇది తెలిసింది. అంటే మనకు నేరుగా కనిపించే ముప్పే గాక... కనిపించని ముప్పు మరింతగా ఉందని స్పష్టమవుతోంది. అయితే గుడ్డిలో మెల్లలా అనిపించే విషయం ఏమిటంటే... డెంగ్యూకూ, గులియన్ బ్యారీ సిండ్రోమ్‌కు నేరుగా సంబంధం ఉన్నట్లు ఈ అధ్యయనాల్లో నిరూపితం కాలేదు. -
పొట్ట కండరాలకు గట్టి వ్యాయామం
మనిషి లావయ్యాడనికి మొదట చెప్పేది పొట్టే. వేగంగా కొవ్వు పేరుకుపోయి, శరీరాకృతిని మార్చివేసేదీ పొట్టే. ఆ సమస్య రాకుండా ఉండాలంటే పొట్ట కండరాలకు కాస్త పని పెట్టాలి. ఈ ఆసనాలు ప్రయత్నించాలి. చాలన ఉత్కటాసన ఆసనంలో నిలబడి కాళ్లు రెండింటి మధ్య వీలైనంత (నిడివి) దూరం ఉంచాలి. రెండు చేతులను ముందుకు స్ట్రెచ్ చేసి, చేతి వేళ్లను ఇంటర్‌లాక్ చేసి ఎడమచేతి బొటన వేలును పైకి నిలబెట్టి, శక్తి ముద్ర (ఎనర్జింగ్ ముద్ర లేదా లింగముద్ర అని కూడా అంటారు)లో ఉంచి శ్వాస వదులుతూ ఫొటోలో చూపిన విధంగా ఎడమ మోకాలు పూర్తిగా వంచి ఎడమవైపుకి క్రిందకి కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ పైకి లేచి మళ్ళీ శ్వాస వదులుతూ రెండోవైపుకి కూర్చోవాలి. పైకి లేవడం క్రిందకు కూర్చోవడం కష్టంగా అనిపిస్తే చేతులు కిందపెట్టి సపోర్ట్ తీసుకోవచ్చు. మోకాలి సమస్య ఉన్నవాళ్లకు ఈ ఆసనం సరియైనది కాదు. దీని వల్ల సీటు, కాళ్లలోని కండరాలు గ్లూటియస్ మెడియస్, గ్లూటియస్ మాక్సిమస్, బెసైప్స్ ఫెమొరిస్, కాఫ్ మజిల్స్... మొదలైన కండరాలు బాగా బలపడతాయి. గ్రోయిన్ రిజియన్ తెరుచుకోవడానికి దోహదపడుతుంది. ఏకపాద అధోముఖ శ్వాసాసన శ్వాస తీసుకుంటూ కుడికాలిని పైకి లేపి బాగా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. పైకి లేపిన కాలును మడచి పాదాన్ని ఎడమ పక్కకు కూడా పడవేయవచ్చు. శ్వాస వదులుతూ కుడికాలుని కిందకు, మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఎడమకాలిని పైకి తీసుకువెళ్ళి సాధన చేయవచ్చు. ఈ ఆసనంలో చేసే వైవిధ్యమైన భంగిమలు అన్ని కూడా పెల్విక్ రీజియన్, నడుము, కాళ్లు బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. తలనొప్పి, పార్శ్వనొప్పి (మైగ్రెయిన్) ఇన్సోమియా, ఫాటిగ్యూ నుండి ఉపశమనం కలిగిస్తుంది. వెనుకకు రావాలంటే రెండు మోకాళ్లు శ్వాస వదులుతూ నేల మీద ఆనించి మార్జాలాసనంలో నడుమును రిలాక్స్ చేయాలి. ఈ ఆసనంలో నడుము భాగం మీద బాగా పనిచేస్తాం కనుక ఆసనం తరువాత నడుముకు, ఊపిరితిత్తులకు తగినంత విశ్రాంతి అవసరం. ఎ.ఎల్.వి.కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్