ఇటీవల కేరళ పర్యటనలో ఒక్కసారిగా సముద్రంలో దూకి ఈత కొట్టడం.. దాంతోపాటు కొద్దిసేపు వల పట్టుకుని చేపలు పట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఈత కొట్టిన అనంతరం తడి బట్టలతో బయటకు వచ్చిన రాహుల్‌ను అందరూ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ కండలపైనే చర్చ చేస్తున్నారు.
ఫిబ్రవరి 25వ తేదీన రాహుల్ కేరళలోని కొల్లం జిల్లా పర్యటనకు రాహుల్ వచ్చాడు. తంగసరి బీచ్‌లో రాహుల్ ఒక్కసారిగా ఆరేబియా సముద్రంలో దూకి కొద్దిసేపు ఈతకొట్టారు. చల్లటి నీటిలో ఈతకొట్టిన అనంతరం పైకి రాగా నలుపు రంగు చొక్కాలో రాహుల్ కండలు కనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోలు రావడంతో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఔరా రాహుల్ కండలు.. అంటూ నోరెళ్లబెడుతున్నారు. బాక్సర్ మాదిరి కండలు పెంచారని కామెంట్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫిట్‌నెస్ టిప్స్ చెప్పాలని ట్విటర్, ఇన్‌స్టా, ఫేసుబుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో అడుగుతున్నారు.
ఈ ఫొటోను చూసి భారత బాక్సర్ విజేందర్ సింగ్ కూడా స్పందించాడు. బాక్సర్ కండలు.. చాలా ధైర్యం గల ప్రజల వ్యక్తి ముందుకు సాగిపో అని విజయేందర్ సింగ్ ట్వీట్ చేశాడు. రాహుల్ ఒక బాక్సర్.. బౌన్సర్‌గా కనిపిస్తున్నాడని ట్రోల్ చేస్తున్నారు. వంటలు.. ఈత కొట్టడం.. చేపలు పట్టడం రాహుల్ కొత్త హాబీస్ అని చెబుతున్నారు. దీనిపై ఫన్నీ మీమ్స్ కూడా తయారవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment