ఛాయ్‌మంతి
హెల్త్‌టిప్స్
చేమంతి పూలలోని ఔషథగుణాలు అనేక రకాల గర్భకోశ సమస్యలను నివారిస్తాయి. ఒక కప్పు నీటిని మరిగించి రెండు టీ స్పూన్ల చేమంతి రెక్కలను వేసి మూతపెట్టి మంట మీద నుంచి దించేయాలి. ఐదు నిమిషాల తర్వాత వడపోసి తాగాలి. ఈ చేమంతి టీ లో రుచి కోసం కొంచెం తేనె కాని చక్కెర కాని కలుపుకోవచ్చు. నెలసరి మొదలు కావడానికి రెండు లేదా మూడు రోజుల ముందు నుంచి రోజుకు ఒక కప్పు తీసుకోవాలి. అలాగే మొదలైన తర్వాత రోజుకు రెండు కప్పులు తాగాలి.
ఇలా చేయడం వల్ల బ్లీడింగ్ సమయంలో కండరాలు పట్టేసినట్లయి నొప్పి రావడాన్ని నివారించవచ్చు. ఏడాది పొడవునా తాజా చేమంతిపూలు దొరకడం కష్టం కాబట్టి అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఎండబెట్టి నిల్వచేసుకుని వాడుకోవచ్చు. రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి బాధిస్తుంటే కింద పొట్ట మీద, నడుము మీద వేడి కాపడం పెట్టాలి. చిన్న టవల్‌ను వేడినీటిలో ముంచి కాపడం పెట్టవచ్చు లేదా మార్కెట్‌లో దొరికే హాట్‌ప్యాక్ బ్యాగ్ వాడవచ్చు.