సల్మాన్ చెబితే సరే! | I am really impressed with Shah Rukh Khan’s eight pack body! | Sakshi
Sakshi News home page

సల్మాన్ చెబితే సరే!

Published Sat, Sep 13 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:16 PM

సల్మాన్ చెబితే సరే!

సల్మాన్ చెబితే సరే!

కండల ప్రదర్శనలో తనను మించి కింగ్ అయ్యాడనో... నిజంగానో సందేహమో గానీ... బద్ధ శత్రువు షారూఖ్‌కు పాజిటివ్ వేలో నెగటివ్ టచ్ ఇచ్చాడు హీరో సల్మాన్‌ఖాన్. కొత్తగా ఎయిట్ ప్యాక్‌ను బయుటకు తీసి అలజడి రేపుతున్న షారూఖ్ కండలు నిజమైనవేనంటూ లేని డౌట్‌ను క్రియేట్ చేశాడు. బాలీవుడ్ బాద్‌షాను పర్సనల్‌గా కలసి మరీ సల్మాన్ అభినందించినట్టు ఓ వార్తా సంస్థ కథనం. అంతేకాదు... షారూఖ్ రాబోయే చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’ ట్రైలర్ కూడా సూపరంటూ ఈ మధ్య ఆకాశానికెత్తేశాడు. షారూఖ్ మాత్రం దేనికీ స్పందించకపోవడం విశేషం.
 
 అమ్మమ్మ చెప్పిందని..!
పెద్దల మాట చద్దన్నం మూటలా ఉంది నటి, పాప్ సింగర్ అరియానా గ్రాండేకి. అందులోనూ అమ్మమ్మ మాట అసలు జవదాటేలా లేదు. ‘నిద్ర పోయేప్పుడు సాధ్యమైనంత తక్కువ దుస్తులు ధరిస్తా. నగ్నంగా నిద్రించడాన్ని మా అమ్మమ్మ ప్రోత్సహిస్తుంది’ అంటూ ఓ వెబ్‌సైట్‌తో చెప్పిందీ 21 ఏళ్ల సెక్సీ సుందరి. అలాగే బెడ్ టైమ్‌లో తన పెంపుడు కుక్కలు కూడా పక్కనే ఉంటాయట. ‘నాకు నాలుగు కుక్కలున్నాయి. చాలా మంది మనుషుల కంటే వాటినే నేను ఎక్కువగా ప్రేమిస్తా’ నంటూ ఏదేదో చెప్పేస్తోంది.
 
మళ్లీ ప్రేమ కథా చిత్రమ్!
 ‘డర్టీ పిక్చర్’ కిక్ నుంచి ఇప్పుడిప్పుడే బయుటపడుతున్నట్టుంది హాట్ బ్యూటీ విద్యాబాలన్. రూట్ వూర్చి లవ్ స్టోరీ చేయాలని తపిస్తోంది. తాజాగా తెరకెక్కనున్న ‘హమారీ అదూరీ కహానీ’ తాను కోరుకున్నట్టే ఓ మంచి ప్రేమ కథా చిత్రమంటోందీ భామ. తన తొలి చిత్రం ‘పరిణీత’ తరహాలో ఇది కూడా పూర్తిస్థాయి లవ్ స్టోరీ అంటోంది. ఎప్పటి నుంచో ఇలాంటి కథ కోసం ఎదురు చూస్తున్నానంది. ‘దర్శకుడు మోహిత్ సూరీతో పనిచేయడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తా. మహేష్‌భట్ స్క్రిప్ట్. అన్నీ కలిపి ఓ మంచి సినిమా మీ ముందుకు వస్తుంది’ అని చెప్పింది విద్యా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement