ఎవర్‌గ్రీన్‌ హీరో.. సౌతిండియన్‌ ఫుడ్డే కారణం | Anil Kapoor Said South Indian Food Is The Secret Of Age Proof Skin | Sakshi
Sakshi News home page

అనిల్‌ కపూర్‌ వ్యాఖ్యలు.. అంగీకరించిన డైటీషియన్లు

Published Thu, Sep 19 2019 4:36 PM | Last Updated on Thu, Sep 19 2019 8:20 PM

Anil Kapoor Said South Indian Food Is The Secret Of Age Proof Skin - Sakshi

బాలీవుడ్‌ హీరో అనిల్‌ కపూర్‌ ప్రస్తావన రాగానే ముందుగా గుర్తుకు వచ్చే మాట ఎవర్‌గ్రీన్‌ హీరో. ఏళ్లు గడుస్తున్న కొద్ది ఎవరికైనా వయసు పెరుగుతుంది.. కానీ అనిల్‌ కపూర్‌ విషయంలో మాత్రం ఇది రివర్స్‌ అవుతుంది. అవును వయసు పైబడుతున్న కొద్ది అనిల్‌ కపూర్‌ మరింత యవ్వనంగా తయారవుతున్నారు. ఆయన పిల్లలకే ముప్పై ఏళ్లు పైబడ్డాయి. అయినా పిల్లల్ని, అనిల్‌ కపూర్‌ని పక్క పక్కన నిలబెడితే.. వారందరిని తోబుట్టువులే అనుకుంటారు ఎవరైనా. ప్రతి ఇంటర్వ్యూలో సాధరణంగా అనిల్‌ కపూర్‌కు ఎదురయ్యే ప్రశ్న.. ఇంత అందంగా ఉంటారు ఏం తింటారు సర్‌ అని. అయితే తాజా ఇంటర్వ్యూలో ఆ సీక్రెట్‌ చెప్పేశారు అనిల్‌ కపూర్‌.

తను ఇంత ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి సౌత్‌ ఇండియన్‌ ఫుడ్డే కారణం అంటున్నారు అనిల్‌ కపూర్‌. ఇడ్లీ, దోశ, సాంబార్‌ తినడం వల్లే తాను ఇంత అందంగా ఉన్నాను అంటున్నారు అనిల్‌ కపూర్‌. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న వాస్తవం. మనం కూడా ఇదే ఆహారం తింటున్నాం కదా.. మరి మనం ఎందుకు అనిల్‌ కపూర్‌లా కాలేకపోతున్నాం అని అడిగే వారికి డైటీషియన్‌ కవిత చెప్పే సమాధానం ఏంటంటే.. ఆహారంతో పాటు వ్యాయామం, మంచి జీవన శైలి పాటించాలి అంటున్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. దక్షిణ భారత దేశ ఆహారంలో ప్రధానంగా కన్పించే అంశం.. పులియబెట్టడం. ఇడ్లీ, దోశ పిండిని పులియబెట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఇలా పులియబెట్టిన ఆహారం వల్ల ప్రధానంగా రెండు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు కవిత.

పులియబెట్టిన ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.. అందువల్ల మన శరీరం తక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. రెండు.. పులియబెట్టడం వల్ల ఆహార పోషక విలువ పెరుగుతుంది. తద్వారా మన శరీరం ఎక్కువ పోషకాలను గ్రహించడమే కాక శరీరంలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి దోహదపడుతుంది. ఫలితంగా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పుకొచ్చారు కవిత. అయితే పులియబెట్టిన ఆహారాన్ని.. కొబ్బరి నూనెతో కలిపి ఉడికించి తింటేనే ఈ ఫలితం దక్కుతుందంటున్నారు కవిత. కొబ్బరి నూనె, పులియబెట్టిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయంటున్నారు కవిత. దాంతో పాటు తరచుగా కొబ్బరి నీరు తాగాలని సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement