
సాక్షి, ముంబై : సినీ పరిశ్రమను ముప్పతిప్పలు పెడుతున్న పైరసీని మట్టుబెట్టేందుకు సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల బాలీవుడ్ హర్షం వ్యక్తం చేసింది. సినిమాలను అనధికారికంగా రికార్డు చేయడం, డూప్లికేషన్‌కు పాల్పడటంపై కఠిన చర్యలు చేపట్టేలా సవరణ బిల్లును కేంద్ర సమాచార, ప్రసారమంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్ని పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ఇతర సినీ పరిశ్రమలకు చెందిన సెలెబ్రిటీలు స్వాగతిస్తున్నారు.
సినిమాటోగ్రఫీ చట్టానికి ప్రతిపాదిత సవరణలతో పరిశ్రమ రాబడి పెరిగి, పెద్ద ఎత్తున పరిశ్రమలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పైరసీకి వ్యతిరేకంగా కీలక అడుగులు పడతాయని బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ట్వీట్ చేశారు. ఈ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై అనిల్ కపూర్ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ గతంలో తాను ప్రధానితో భేటీ అయిన ఫోటోను పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment