Anil Kapoor refutes claims he slapped others in intense scene - Sakshi
Sakshi News home page

Anil Kapoor: షూటింగ్‌లో నిజంగానే కొడతారా?.. క్లారిటీ ఇచ్చిన అనిల్ కపూర్!

Published Mon, Jul 24 2023 5:44 PM | Last Updated on Mon, Jul 24 2023 6:43 PM

Anil Kapoor refutes claims he slapped others in intense scene - Sakshi

బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ షూటింగ్‌లో భాగంగా ఎవరినైనా కొట్టేస్తాడని గతకొంతకాలంగా ఓ ప్రచారం జరుగుతోంది. సన్నివేశం బాగా రావడం కోసం సహనటులపై నిజంగానే చేయి చేసుకుంటాడని ఈ పుకారు చాటి చెప్తోంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న అనిల్‌ కపూర్‌ ఈ రూమర్‌పై స్పందించాడు.

ఆయన మాట్లాడుతూ.. 'ఇది నిజం కాదు. కొందరు కావాలనే కొన్నింటిని పెద్దవి చేసి చెప్తారు. అలాగైతే ఇంకా ఎక్కువమంది ఇంటర్వ్యూలకు పిలుస్తారని కాబోలు! కావాలని నేను ఎందుకు కొడతాను?' అని చెప్పుకొచ్చాడు.

(ఇది చదవండి: చనిపోయిన అభిమానుల కుటుంబాలకు అండగా సూర్య, వీడియో కాల్‌ చేసి..)

కాగా అనిల్‌ కపూర్‌తో జుగ్‌జుగ్‌ జియోలో నటించిన మనీశ్‌ పౌల్‌ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'తొలి సన్నివేశంలోనే అనిల్‌ చాలా చిరాకుపడ్డాడు. నన్ను చెంపదెబ్బ కొట్టబోయాడు. ఆ తర్వాత మళ్లీ మేమిద్దరం బాగానే ఉన్నామనుకోండి' అని పేర్కొన్నాడు. తొలి సన్నివేశంలోనే అంత చిరాకు పడి కొట్టేదాకా వచ్చాడంటే అనిల్‌ ఇప్పటివరకు ఎంతమందిని కొట్టి ఉంటాడోనని ప్రచారం నడిచింది.

ఇక అనిల్‌ సినిమాల విషయానికి వస్తే.. అతడు ఇటీవల నటించిన ద నైట్‌ మేనేజర్‌ వెబ్‌ సిరీస్‌ మంచి ఆదరణ పొందుతోంది. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటిస్తున్న యానిమల్‌లో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 11న రిలీజ్‌ కావాల్సి ఉండగా డిసెంబర్‌ 1కి వాయిదా పడింది. ఇకపోతే ఫైటర్‌ సినిమాలోనూ అనిల్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

(ఇది చదవండి: ఆ సినిమాలే ఓ పరమ చెత్త.. అందుకే ఎవరూ చూడరు: సినీ క్రిటిక్ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement