
తొలిసారి డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారట బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా. అదేంటీ.. ఒకటా రెండా సోనాక్షి డ్యాన్స్‌తో అదరగొట్టిన పాటలు బోలెడు ఉన్నాయి కదా అనుకుంటు న్నారా? అది నిజమే. అయితే కెరీర్‌లో ఆమె తొలిసారి ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అవుతున్నారని బాలీవుడ్ టాక్. ఇంద్రకుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్, అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్షి ముఖ్య తారలుగా నటిస్తున్న సినిమా ‘టోటల్ ధమాల్’.
ఇంద్రకుమార్ దర్శకత్వంలో ధమాల్ సిరీస్‌లో వస్తోన్న థర్డ్ పార్ట్ ఇది. ఈ సినిమాలోనే స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నారట సోనాక్షీ సిన్హా. ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు తొమిదేళ్ల తర్వాత ఆమె ఐటమ్ సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం విశేషమే మరి.
Comments
Please login to add a commentAdd a comment