'బ్రేక్ తీసుకోవద్దని సలహాయిచ్చారు'
ముంబై: నటన నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ బ్రేక్ తీసుకోవద్దని అమితాబ్ బచ్చన్ తనకు సలహా యిచ్చారని నటుడు అనిల్ కపూర్ తెలిపారు. నటన నుంచి బ్రేక్ తీసుకుని తప్పు చేశానని బిగ్ బీ, తనలా చేయొద్దని చెప్పారన్నారు. ఆయన చెప్పిన సలహాను పాటించానని అన్నారు. అమితాబ్ అంటే తనకెంతో గౌరవమన్నారు.
తన సినిమాల్లో ఏది బెస్ట్, ఏది వరస్టో చెప్పలేనని అన్నారు. తన కెరీర్ లో గడ్డుకాలం ఎదురైనప్పుడు కూడా బ్రేక్ తీసుకోలేదని వెల్లడించారు. మంచి సినిమాల్లో నటించడం తనకు లభించిన అదృష్టమన్నారు.