వారిద్దరూ నాకు స్ఫూర్తి: శిల్ప
ముంబై: ఫిట్ నెస్ విషయంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ తనకు స్ఫూర్తి అని బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తెలిపింది. వయసు పెరుగుతున్నా ఈ ఇద్దరు అగ్రహీరోలు ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఎంతో యాక్టివ్ గా ఉన్నారని తెలిపింది. ఈ వయసులోనూ యువహీరోలతో సమానంగా నటిస్తూ, కెరీర్ లీడ్ చేస్తున్నారని ప్రశంసించింది.
వీరిద్దరూ తనకే కాకుండా మొత్తం హిందీ చిత్ర పరిశ్రమకే స్ఫూర్తిగా నిలిచారని పేర్కొంది. శిల్పాశెట్టి రాసిన 'ది గ్రేట్ ఇండియన్ డైట్' పుస్తకాన్ని ఈనెల 19న అమితాబ్, అనిల్ కపూర్ ఆవిష్కరించనున్నారు. పోషక విలువలున్న ఆహారం, కొవ్వును కరిగించుకోవడం, ఫిట్ గా ఉండడం వంటి అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.