బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ రచయిత ప్రయాగ్ రాజ్ మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం బాంద్రాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఆదిత్య వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వయసు 88 కాగా.. అమితాబ్ బచ్చన్ బ్లాక్ బస్టర్ హిట్స్ అమర్ అక్బర్ ఆంథోనీ, నసీబ్, కూలీ చిత్రాలకు పనిచేశారు. ఆయన మృతిపట్ల అమితాబ్‌తో పాటు అనిల్ కపూర్ సంతాపం ప్రకటించారు. అమితాూబ్ బచ్చన్ నసీబ్, సుహాగ్, కూలీ, మర్డ్ చిత్రాలకు కథను అందించిన ప్రయాగ్ రాజ్.. రచయితగా 100కి పైగా చిత్రాలకు పనిచేశారు.
(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత!)
రాజేష్ ఖన్నా రోటీ, ధర్మేంద్ర-జీతేంద్రల ధరమ్ వీర్, అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రాలకు స్క్రీన్‌ప్లేకు సహకారం అందించడమే కాకుండా బచ్చన్, రజనీకాంత్, కమల్ హాసన్ నటించిన "గెరఫ్తార్" కూడా ఆయనే రాశారు. రచయితగా అతని చివరి చిత్రం దివంగత ఎస్ రామనాథన్ దర్శకత్వం వహించిన "జమానత్". అయితే ఈ చిత్రం విడుదల కాలేదు. కాగా.. ఆదివారం ఉదయం దాదర్‌లోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో రాజ్ అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరై నివాళులర్పించారు.
I'm truly saddened by the loss of the late Prayag Raj. Working with him on "Hifazat" was a privilege. May his soul rest in peace.🙏🏻 pic.twitter.com/Al4RP7poFb
— Anil Kapoor (@AnilKapoor) September 24, 2023
Sorry to hear about the passing away of writer director actor Prayag Raj. RIP pic.twitter.com/OZN2P7xQeH
— Azmi Shabana (@AzmiShabana) September 23, 2023
Comments
Please login to add a commentAdd a comment