
రానా, రకుల్ ప్రీత్ సింగ్
‘అరణ్య’( హిందీలో ‘హాథీ మేరే సాథీ’) సినిమా కోసం ఏనుగులతో సహవాసం చేశారు హీరో రానా. త్వరలో మరో హిందీ సినిమా కోసం మొసళ్లతో పోరాటం చేస్తారట. బాలీవుడ్ ప్రముఖ హీరో అనిల్ కపూర్, రానా, రకుల్ ప్రీత్ సింగ్ ముఖ్య తారాగణంగా రోనీ స్క్రూవాలా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని బాలీవుడ్ సమాచారం. నేహా రాకేష్ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం కానున్నారట. ఈ సినిమా కథాంశం మొసళ్ల బ్యాక్‌డ్రాప్‌లో సాగతుందని బీ టౌన్ టాక్. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాలనుకుంటున్నారట. ఎక్కువ శాతం షూటింగ్‌ను థాయ్‌ల్యాండ్‌లో ప్లాన్ చేశారని సమాచారం. అలాగే ఈ సినిమాలో భారీగా గ్రాఫిక్స్ వర్క్స్ ఉంటాయట. అందుకే ముందుగా ప్రీ–ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట రాకేష్.