Writer Vishal Singh Accuses Karan Johar of Copying His Story For 'Jug Jugg Jeeyo' - Sakshi
Sakshi News home page

Karan Johar: వివాదంలో కరణ్‌ జోహార్‌ లేటెస్ట్‌ మూవీ, నిర్మాతపై వరుస ఆరోపణలు

Published Mon, May 23 2022 6:03 PM | Last Updated on Mon, May 23 2022 6:27 PM

Writer Vishal Singh Accuses Karan Johar of Copying His Story For Jug Jugg Jeeyo - Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ‘కరణ్‌ నా స్క్రిప్ట్‌ దొంగలించాడు’ అని ఓ రచయిత, ‘నా పాటను కాపీ కొంటాడు’ అని ఓ పాకిస్తాన్‌ సింగర్‌ ఆయనపై ఆరోపణలు చేశారు. కాగా కరణ్‌ జోహార్‌అప్‌కమింగ్‌ మూవీ ‘జగ్‌ జుగ్‌ జీయో’. ఇందులో వరుణ్‌ ధావన్‌, కియారా అద్వాని హీరోయిన్లు కాగా నీతూ కపూర్‌, అనిల్‌ కపూర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి దీనిపై సోషల్‌ మీడియాలో హైప్‌ క్రియేట్‌ అయ్యింది.  

చదవండి: సినీనటుడు ఆలీ సడన్‌ సర్‌ప్రైజ్‌.. ఎవరికీ చెప్పకుండా..

ఈ నేపథ్యంలో నిన్న(మే 22న) ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది. అప్పటి నుంచి ఈ సినిమాను వివాదాలు చూట్టుముడుతున్నాయి. తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్‌ తనది అంటూ విశాల్‌ సింగ్‌ అనే ఓ రచయిత వరుస ట్వీట్స్‌ చేశాడు. ‘కరణ్‌ తెరకెక్కిస్తున్న జగ్‌ జుగ్‌ జీయో కథను ‘బన్నీరాణి’ పేరుతో జనవరి 2020లో రిజిస్టర్‌ చేసుకున్నాను. ఫిబ్రవరి 2022లో ధర్మప్రోడక్షన్‌కు ఈ కథ మెయిల్‌ చేసి మీతో కలిసి ఈ సినిమాను నిర్మించాలనుకుంటున్నాను నాకు ఒక చాన్స్‌ ఇవ్వాలని కోరాను. దీనికి ధర్మ ప్రొడక్షన్‌ నుంచి కూడా నాకు సమాధానం వచ్చింది. కానీ, తీరా నా కథను జగ్‌ జుగ్‌ జీయో పేరుతో తెరకెక్కించారు. మాట ఇచ్చి ఇలా మోసం చేయడం కరెక్ట్‌ కాదు కరణ్‌ జోహార్‌ గారు’ అంటూ అతడు మొదట ట్వీట్‌ చేశాడు. 

చదవండి: క్యాన్సర్‌ చికిత్స అనుభవాన్ని పంచుకున్న నటి

ఆ తర్వాత ధర్మ ప్రొడక్ష్‌న్‌కు అతడు చేసిన స్క్రిప్ట్‌ మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్స్‌ను షేర్‌ చేశాడు. అనంతరం తనకు మద్దతు ఇవ్వాలని, ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకోవాలంటూ వరుస ట్వీట్‌ చేస్తూ కరణ్‌పై విమర్శలు గుప్పించాడు. ఈ సందర్భంగా కరణ్‌ జోహార్‌, అతని నిర్మాణ సంస్థ, ఇతర నిర్మాతలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని, వారిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని అతడు తెలిపాడు. మరోవైపు కరణ్‌ జోహార్‌ తన లేటెస్ట్‌ మూవీలో తన పాటకు కాపీ చేశారని పాకిస్తాన్‌ సింగర్‌ ఆరోపించాడు. సింగర్‌ అబ్రార్ ఊ హాకు గాయకుడు నిజానికి ‘జగ్‌ జుగ్‌ జీయో’లోని నాచ్‌ పంజాబన్‌ అనే పాట తనదని, ఈ పాటను ఆయన కాపీ చేశారని పేర్కొన్నాడు. కాగా చిత్రాన్ని రాజ్‌ మెహతా దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్‌, వయాడాట్‌ 18  సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement