అమ్మ ఎక్కడ? అని అడుగుతున్నారు.. ఏం చెప్పాలో.. ఏంటో? | Karan Johar Kids Started Asking Questions About Their Mother | Sakshi
Sakshi News home page

అమ్మ గురించి ప్రశ్నలు.. వారికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి?: దర్శకుడు

Published Mon, Jul 8 2024 12:55 PM | Last Updated on Mon, Jul 8 2024 1:23 PM

Karan Johar Kids Started Asking Questions About Their Mother

బాలీవుడ్‌ బడా దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌కు ఇద్దరు పిల్లలు. యష్‌- రూహి అని ట్విన్స్‌. పిల్లలున్నారనగానే అతడికి పెళ్లయిందనుకునేరు.. కానే కాదు! 52 ఏళ్లున్న ఈ డైరెక్టర్‌ పెళ్లికాని ప్రసాద్‌లాగే మిగిలిపోయాడు. వివాహమంటే మొగ్గుచూపని ఇతడికి పిల్లలంటే ఇష్టం. అందుకని సరోగసి ద్వారా 2017లో కవలల పిల్లలకు తండ్రయ్యాడు.

ఎవరి పొట్టలో ఉన్నాం?
ఇప్పుడిప్పుడే స్కూలుకు వెళ్తున్న ఈ పిల్లలు తల్లి గురించి అడుగుతున్నారట! ఈ విషయాన్ని కరణ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'మాదొక మోడ్రన్‌ ఫ్యామిలీ. అయితే నాకు కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నా పిల్లలిద్దరూ.. మేము చిన్నప్పుడు ఎవరి పొట్టలో ఉన్నాం? మా అమ్మ ఎక్కడ? మేము అమ్మ అంటున్న వ్యక్తి మాకు నానమ్మ అవుతుంది కదా.. అని ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు.

వద్దని చెప్పలేకపోతున్నా
ఆ చిన్ని బుర్రలకు అర్థమయ్యేలా సమాధానం ఎలా చెప్పాలి? తండ్రిగా ఉండటం అంత ఈజీ కానే కాదు. మరోపక్క నా బాబు స్వీట్స్‌ గట్రా తిని కొద్దిగా లావయినా కంగారుపడిపోతున్నాను. అలా అని వారిని వద్దని వారించలేను. ఎందుకంటే ఈ చిన్న వయసులో వాళ్లను స్వేచ్ఛగా వదిలేయాలి. సంతోషంగా గడపనివ్వాలి. నా కూతురికి, బాబుకు ఆంక్షలు పెట్టి ఇబ్బందిపెట్టలేను' అని కరణ్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: OTT: ఈవారం ఓటీటీలో 23 సినిమాలు/సిరీస్‌లు.. ఎక్కువగా ఆ రోజే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement