‘జైట్లీ జీ, 20 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను’ | Bollywood Mourns Death of Arun Jaitley | Sakshi
Sakshi News home page

అరుణ్‌ జైట్లీ మృతికి సంతాపం తెలిపిన బాలీవుడ్‌ ప్రముఖులు

Published Sat, Aug 24 2019 2:27 PM | Last Updated on Sat, Aug 24 2019 3:28 PM

Bollywood Mourns Death of Arun Jaitley - Sakshi

అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మృతిపట్ల బాలీవుడ్‌ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ గొప్ప, నిజాయతీ గల నేతను కోల్పోయామంటూ సోషల్‌మీడియా వేదికగా జైట్లీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

‘అరుణ్‌ జైట్లీ మరణం నన్ను కలిచి వేసింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.’ - ఆశా భోంస్లే

‘20 ఏళ్ల క్రితం అరుణ్‌ జైట్లీని కలిశాను. నాటి నుంచి నేటి వరకు ఆయనను ఇష్టపడుతూనే ఉన్నాను. ఆయన మరణం మన దేశానికి  తీవ్ర నష్టం. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నాం జైట్లీ జీ. మీ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను.’ - అనిల్‌ కపూర్‌

‘అరుణ్‌ జైట్లీ చాలా గొప్ప వ్యక్తి. లోధి గార్డెన్స్‌లో మార్నింగ్‌ వాక్‌కు వెళ్లినప్పుడు ఆయనను కలిసి పలకరించే అవకాశం లభించేది. మీరు లేని లోటు తీర్చలేనిది.’ - శేఖర్‌ కపూర్‌

‘అరుణ్‌ జైట్లీ మరణం నన్ను తీవ్రంగా కలిచి వేసింది. డైనమిక్‌ లీడర్‌, ప్రతి విషయం గురించి ఆయనకు పూర్తి అవగాహన ఉండేది. అప్పుడప్పుడు ఆయన నన్ను కలవడానికి వచ్చే వారు. మేము చాలా సేపు ముచ్చటించుకునేవాళ్లం. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాంపం తెలియజేస్తున్నాను.’ - లతా మంగేష్కర్‌

‘అరుణ్‌ జైట్లీ మరణించారని విని ఎంతో బాధపడ్డాను. ఆయన గొప్ప దార్శనీకుడు. ఆయనతో మాట్లాడినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.’ - అజయ్‌ దేవగన్‌

‘అరుణ్‌జైట్లీ మరణం తీవ్ర దిగ్భ్రాంతికరం. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.’ - రితేశ్ దేశ్‌ముఖ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement