![Ek Ladki Ko Dekha Toh Aisa Laga To Be Part Of Oscar Library - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/9/ek-ladki-ko-dekha-toh-aisa-laga-reaches-new-landmark-screenplay-becomes-part-of-oscars-library.jpg.webp?itok=hSqnbWLu)
కపూర్‌ల ఖాన్‌దాన్ నుంచి వచ్చినప్పటికి.. నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సోనమ్ కపూర్. ‘నీర్జా’ సినిమాలో తన నటనకుగాను జ్యూరీ విభాగంలో ఉత్తమ నటి అవార్డు సైతం సొంతం చేసుకున్న సోనమ్‌కు.. ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కనుంది. సోనమ్, తండ్రి అనిల్ కపూర్‌తో కలిసి నటించిన ‘ఏక్ లడ్‌కీ కో దేఖా తో ఐసా లగా’ చిత్రాన్ని ఆస్కార్ లైబ్రరీలో చేర్చనున్నారు. మూవీకి సంబంధించిన ఓ కాపీని అందించాలని.. దాన్ని లైబ్రరీ కోర్ కలెక్షన్స్‌లో ఉంచుతామని ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ సంస్థ సినిమా నిర్మాతలను కోరిందట.
ఈ వార్త తెలిసిన సోనమ్ కపూర్ ఆనందం వ్యక్తం చేశారు. ‘మా నాన్నతో కలిసి నటించిన మొదటి సినిమాకు ఇలాంటి గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉంది. మంచి సందేశంతో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమాను ఆస్కార్ లైబ్రరీలో కూడా ఉంచడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది’ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు సోనమ్. స్వలింగ సంపర్కం అనే అంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ భామ రెజీనా, అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావు, జూహీ చావ్లా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపు రూ. 20 కోట్లు వసూలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment