కరోనా పోరాటంలో బాధితుల్ని ఆదుకోవడానికి ఏర్పాటు చేసి లైవ్ కాన్సర్ట్ ‘ఐ ఫర్ ఇండియా’ కార్యక్రమాన్ని వీక్షించి, విరాళాన్ని అందించిన ప్రతి ఒక్కరికి బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన రెండు రోజుల అనంతరం అనిల్ కపూర్ మంగళవారం సోషల్ మీడియాలో లైవ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఐ ఫర్ ఇండియా’లో తన పార్ఫామెన్స్‌కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఐ ఫర్ ఇండియా’ను చూసి విరాళాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు చూడని వారు సైతం చూసి విరాళాలు ఇవ్వాలని కోరారు. కరోనావైరస్‌కు వ్యతిరేకంగా చేస్తున్నపోరాటానికి తోచినంత సహాయం అందించాలని ప్రజలలను కోరారు. (రూ. 200 చెల్లిస్తే నాతో డ్యాన్స్ చేయొచ్చు : హీరోయిన్)
అదే విధంగా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉంటున్న రోజువారీ వేతన కార్మికులు, వలస కూలీలకు సహాయం అందించాలని కోరారు. విపత్కర పరిస్థితుల్లో కరోనాపై అందరూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్న ప్రతి ఒక్కరూ సూపర్ హీరోలేనని ప్రశంసించారు. కాగా కరోనాపై పోరుకు నిర్వహించిన ఐ‘ ఫర్ ఇండియా’ ఆదివారం సాయంత్రం ఫేస్‌బుక్‌లో లైవ్ షో ఇచ్చారు. ఫేస్‌బుక్ ద్వారా విరాళాలు సేకరించిన అతి పెద్ద కార్యక్రమంగా ‘ఐ ఫర్ ఇండియా’ నిలిచింది. 80 మంది సెలబ్రిటీలు పాల్గొన్న ఈ కార్యక్రమం ద్వారా మొత్తం రూ. 52 కోట్లు వచ్చినట్లు నిర్మాత కరణ్ జోహార్ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని గివ్ ఇండియా సంస్థ ఆద్వర్యంలో కరోనానపై పోరాటానికి వెచ్చించనున్నారు. ఈ వీడియోలో అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, రణ్‌వీర్ సింగ్, కత్రినా కైఫ్, శ్రేయా ఘోషల్ తదితరులు ప్రేక్షకులను అలరించారు. (రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో..)
Comments
Please login to add a commentAdd a comment