daily wage labour
-
మా ఇంటి ‘మహాలక్ష్మి’ని నిలబెట్టండి..
టేకుమట్ల: రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం వారిది. తండ్రి ఆటోడ్రైవర్, తల్లి దినసరి కూలీగా పని చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీసుకుంటున్నారు. ఉన్నట్టుండి వారి కూతురు అనారోగ్యం పాలవడంతో ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించగా పెద్దరోగం వచి్చందని డాక్టర్లు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, టేకుమట్ల మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన దండ్రె రమేశ్, కవిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు మహాలక్ష్మి నెల రోజుల క్రితం అనారోగ్యం పాలవడంతో వివిధ ఆస్పత్రులకు తీసుకువెళ్లి చికిత్స చేయించారు. చివరకు ఆ బాలికకు ‘డికాంపెన్సటేడ్ లివర్ డిసీజ్’అని డాక్టర్లు తేల్చడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చించి చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం పాప ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే అందినకాడ అప్పు చేసి వైద్యం చేయించారు. ఇంకా రూ.22 లక్షల మేర ఖర్చు అవుతుందని డాక్టర్లు తెలపడంతో ఆ తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. కూలీ పని చేసుకుని జీవించే తమ బతుకుల్లో పెద్దకష్టం వచి్చందని, పాపకు వైద్యం చేయించేందుకు దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేసేవారు ఈ నంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలని (97013 29434) కోరుతున్నారు. -
Suryapet: ఉపాధి హామీ కూలీగా ఐఆర్ఎస్ అధికారి.. ఎందుకో తెలుసా?
సాక్షి, సూర్యాపేట: కూలీల స్థితిగతులను అంచనా వేయడం కోసం ఐఆర్ఎస్ అధికారి ఉపాధి కూలీగా మారారు. ఈ ఆసక్తికర ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. కూలీగా మారిన అధికారి పేరు సందీప్ బాగా.వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సందీప్, బెంగళూరు సౌత్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనరేట్‌లో జీఎస్టీ ఇన్వెస్టిగేషన్ వింగ్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన సోమవారం నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామంలో ఉపాధి కూలీలతో కలిసి చెరువు పూడికతీత పనుల్లో పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు కూలీలతో కలిసి పనిచేశారు.ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం చేపట్టిన స్వయం ఉపాధి కార్యక్రమాలను వారికి వివరించడంతోపాటుగా వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు గురించి వివరించారు. వాటిపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఆయన కూలీలతో కలిసి భోజనం చేయడంతో పాటుగా బతుకమ్మ పాటకు డ్యాన్స్ కూడా చేశారు. తనతో పాటు పనిలో పాల్గొన్న 152 మంది కూలీలకు తన జీతం నుంచి రూ.200 చొప్పున అందజేశారు. ఇక, ఉన్నాతాధికారి అయిన సందీప్ వారితో కలిసి ఉండటం, భోజనం చేయడంతో కూలీలు ఆనందం వ్యక్తం చేశారు. -
కాళ్లు మొక్కుతాం.. మా డబ్బులు మాకివ్వండి
సాక్షి, నిజామాబాద్ (డిచ్పల్లి): ‘ఏదో పని దొరుకుతుందని ఆశ పడి అప్పు చేసి మరీ డబ్బులు తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టాం. కాళ్లు మొక్కుతాం.. కనికరించి మా డబ్బులు మాకివ్వండి సారూ’ అంటూ తెలంగాణ యూనివర్సిటీ వీసీ డి.రవీందర్‌గుప్తా కాళ్లపై పడి బాధితులు వేడుకున్నారు. వీసీ రవీందర్ బుధవారం క్యాంపస్‌కు వచ్చినట్లు తెలియడంతో భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన 15 మంది బాధితులు మెయిన్ క్యాంపస్‌కు చేరుకున్నారు. ఉద్యోగాల పేరుతో డెయిలీవేజ్ కింద తమను పనిలోకి చేర్చుకున్నారని, ఇందుకోసం వీసీ రవీందర్ ఒక్కొక్కరి వద్ద రూ. 40 వేల నుంచి రూ. 50వేలు తీసుకున్నారని బాధితులు సుభద్ర, ప్రశాంత్, ప్రభాకర్‌గౌడ్, రాహుల్ తదితరులు తెలిపారు. మూడు నెలలు పనిచేసిన తర్వాత ప్రభుత్వం, ఈసీ ఆమోదం లేదని తమను పనిలోకి రావద్దని చెప్పారని బాధితులు వివరించారు. పనిచేసిన కాలానికి కూడా ఒక్కరూపాయి జీతం ఇవ్వలేదని, తాము ఇచ్చిన డబ్బులన్నా తిరిగి ఇవ్వాలని వీసీని ఘోరావ్ చేశారు. వీరికి విద్యార్థులు అండగా నిలిచారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. బాధితులు చివరకు వీసీ కాళ్లపై పడి తమ డబ్బులు ఇవ్వాలని వేడుకున్నారు. దీంతో వీసీ.. బాధితులందరూ పేర్లు, అమౌంట్, ఫోన్ నంబర్లు రాసి ఇవ్వాలని, రెండు రోజుల్లో ఎవరి డబ్బు లు వారికి ఫోన్‌పే చేస్తానని హామీ ఇచ్చారు. చదవండి: బీజేపీ అధ్యక్షుడు మార్పు.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ఇన్చార్జి -
కథ వింటే కన్నీళ్లే.. ఇల్లు గడవక కూలీ పనులకు గ్రామ సర్పంచ్
వరంగల్: ఆ గ్రామానికి ఆమె ప్రథమ పౌరురాలు. ఇల్లు గడవక తోటి కూలీలతో కూలీ పనులకు వెళ్తోంది. ఓ పక్క గ్రామసర్పంచ్‌గా విధులు నిర్వహిసూ్తనే, మరో పక్క కుటుంబ పోషణ కోసం దినసరి కూలీగా పనులకు వెళ్తుంది. మండలంలోని వెంకంపాడు గ్రామం ప్రత్యేక తెలంగాణ తర్వాత కొత్త జీపీగా ఏర్పాటైంది. రిజర్వేషన్ కారణంగా 2019 జనవరి 25న సర్పంచ్‌గా తప్పెట్ల ఉప్పమ్మ ఎన్నికైంది. పంచాయతీకి మొదటి సర్పంచ్‌గా ఎన్నిక కావడంపై ఆనాడు ఆమె ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. కానీ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. సర్పంచ్ ఎన్నికల్లో లక్షల్లో చేసిన అప్పులు తీర్చలేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా భారమై కుటుంబం దీనస్థితిలోకి వెళ్లింది. గతంలో హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్ ఏరియాలో వైజాగ్ మాజీ ఎమ్మెల్యే మల్ల విజయ్‌ప్రసాద్ వద్ద సర్పంచ్ భర్త వెంకన్న వాచ్‌మెన్‌గా పనిచేస్తూ పిల్లలను చదివించుకుంటున్నాడు. ఈ క్రమంలో వెంకంపాడు కొత్తగా జీపీగా ఏర్పాటైందని, గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేసే అవకాశం మీకే ఉందని కొందరు గ్రామపెద్దలు ఆశ చూపించారు. వారు చెప్పిన మాటలు విని ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని పట్టణం నుంచి మూట ముల్లె సదురుకొని పల్లెకు బాట చేరుకున్నారు. కూతురు పెళ్లి కోసం దాచిన డబ్బులతో పాటు మరికొన్ని అప్పులు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేశారు. గత మూడేళ్లుగా అరకొర వచ్చిన నిధులతో గ్రామాభివృద్ధికి సరిపోక మరికొన్ని అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏడాదిగా చేసిన పనులకు బిల్లులు రాక ఆర్థికంగా చితికిపోయామని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. సర్పంచ్‌గా గౌరవ వేతనం అందడం లేదు. పెళ్లీడుకొచి్చన కూతురుకు పెళ్లి చేద్దామన్న చేతిలో చిల్లి గవ్వ లేదు. గ్రామంలో సెంట్ భూమి లేదు. డబుల్ ఇంటిని ఇస్తారన్న ఆశతో ఉన్న ఇంటిని నేలమట్టం చేసి రేకుల షెడ్డు వేసుకున్నామని ఆవేదన చెందింది. ఇదే క్రమంలో అప్పులోల్లు ఇంటి చుట్టు తిరుగుతుంటే పరువు పోతుందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. చేసేది ఏమిలేక దినసరి కూలీగా మిర్చి వేరడానికి ఎర్రటి ఎండలో రూ.200 కూలీకి వెళ్తున్నట్లు బోరున విలపించింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పుడు మాత్రమే పాల్గొని, మిగిలిన సమయంలో దినసరి కూలీ పనులకు వెళ్తుంది. నాలాంటి కష్టాలు ఏ ప్రజాప్రతినిధికి కూడా రాకూడదని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించిపెండింగ్లో పంచాయతీ అభివృద్ధి పనుల బిల్లులు వెంటనే విడుదల చేయించి తమను కష్టాల ఊబిలోనుంచి గట్టెక్కించాలని సర్పంచ్ ఉప్పమ్మ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
దేవుడి మీద కోపంతో ఆ కూలీ ఏం చేశాడంటే..
భోపాల్: అతనో దినసరి కూలీ. రోజూ పనికి వెళ్తేగానీ.. భార్యాబిడ్డల కడుపు నిండదు. కాయకష్టంతో పాటు దేవుడ్ని కూడా నమ్ముకున్నారు. అలాంటిది అనారోగ్యం ఆ కుటుంబాన్ని చుట్టుముట్టింది. ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. పెద్దల సలహాతో ఎన్నో పూజలు చేశాడు. పుణ్యక్షేత్రాలు దర్శించాడు. అయినా లాభం లేకపోయింది. చివరకు కలత చెందిన చేసినపని అతన్ని కటకటాల వెనక్కి నెట్టింది. మధ్యప్రదేశ్ ఛట్టార్పూర్ జిల్లాకు చెందిన వినోద్ కుమార్ అలియాస్ భూరా(27)పై.. బేటా 2 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. స్థానికంగా ఉన్న ఓ ఆలయంలో మూడు దేవతావిగ్రహాలను ధ్వంసం చేశాడని అతనిపై అభియోగం నమోదు అయ్యింది. సోమవారం ఉదయం అతను ఆ దాడికి పాల్పడ్డాడు. ఘటన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అక్కడ పోలీసులను మోహరించారు. వినోద్‌కు భార్యా, ఐదేళ్ల బిడ్డ ఉన్నారు. గత మూడునాలుగేళ్లుగా వీళ్లద్దరి ఆరోగ్యం బాగుండడం లేదు. ఎన్ని మందులు వాడినా.. దేవుళ్లకు ఎంత మొక్కినా వాళ్ల ఆర్యోగం మెరుగుపడలేదట. ఈమధ్యే అతనికి పిల్లనిచ్చిన అత్త కూడా చనిపోయింది. ఈ పరిణామాలన్నీ అతన్ని మానసికంగా కుంగదీశాయి. దేవుడి మీద కోపం పెంచుకున్న వినోద్.. సుత్తి, శిలతో పూజారి లేని ఆ ఆలయానికి చేరుకుని విగ్రహాలు ధ్వంసం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మంగళవారం అతన్ని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 295 (ప్రార్థనా స్థలాలను అప్రవిత్రం చేయడం) కింద కేసు నమోదు చేసుకుని వినోద్‌ను జైలుకు తరలించారు. చదవండి: ఒంటి కాలితో బడికి.. చిన్నారికు అంతా ఫిదా -
‘‘పీజీ పూర్తి చేశాను.. కూలి పని చేయడానికి సిద్ధం’’
ఢిల్లీ: కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. ఉపాధి కోల్పోయి ఎందరో రోడ్డున పడ్డారు. విద్యా సంస్థలు మూత పడ్డాయి. చదువులు ఆగిపోయాయి. పూర్తయిన వారికి ఉద్యోగాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో పీజీ పూర్తి చేసి.. రోజు కూలీగా మారిన ఓ యువకుడి ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. వికాశ్ అనే వ్యక్తి ఢిల్లీలోని అంబేడ్కర్ విశ్వవిద్యాలయం నుంచి సోషియాలజీలో ఎంఏ పూర్తి చేశాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన సదరు యువకుడు లాక్డౌన్ వల్ల ఉపాధి లేక రోజు కూలీగా మారినట్లు వెల్లడించాడు. తనకు ఏదైనా ఉద్యోగం చూడాల్సిందిగా అభ్యర్థించాడు. ‘‘దయచేసి నాకు ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. లాక్డౌన్లో రోజులు వెల్లదీయడం చాలా కష్టంగా మారింది. కొద్ది రోజులు డ్రైవర్‌గా చేశాను. కూలీ పని చేయడానికి కూడా నేను సిద్ధమే. కానీ ఆ పని కూడా దొరకడం లేదు. దయచేసి నాకు సాయం చేయండి’’ అంటూ ట్విట్టర్ వేదికగా అభ్యర్థించాడు. తన రెజ్యూమ్ కూడా షేర్ చేశాడు. Please help me to get any work. It's so hard to survive due to lockdown. Since lockdown, I have not been able to even get any labour work in the unorganised sector. Merely sustenance seems too hard in this time. I'm ready to work as daily wage labour also. Please amplify 🙏 pic.twitter.com/ptk280LS5D — Vikash (@VikashSanchi) May 30, 2021 ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరలవుతోంది. వందల మంది వికాశ్‌పై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. నీ బాధ అర్థం అవుతుంది.. త్వరలోనే నీకు మంచి ఉద్యోగం దొరకాలని ఆశీస్తున్నాను.. నిజంగా ఇది హృదయవిదారకం.. నాకు తెలిసిన కొందరి కాంటాక్ట్ నంబర్లు ఇక్కడ షేర్ చేస్తున్నాను. త్వరలోనే నీకు మంచి ఉద్యోగం దొరకాలని ఆశీస్తున్నాను. నీవు ఒంటరిగా లేవు.. నీకు మా అందరి మద్దతు ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నాను నెటిజనులు. చదవండి: కరోనా కల్లోలం: గూడు చెదిరిన గువ్వలు -
అయ్యో.. ప్రైవేట్ టీచర్లకు ఎంత కష్టం
సాక్షి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుమారు 900లకు పైగా పాఠశాలల్లో 22 వేల మందికి పైగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. కరోనా కారణంగా 3 నెలలుగా యాజమాన్యాలు జీతాలు చెల్లించక పోవడం, విద్యాసంవత్సరం ప్రారంభమైనా బడులు తెరుచుకోక పోవడంతో కుటుంబ పోషణకు ఏ పని దొరికితే ఆ పనికి వెళ్తూ అరిగోస పడుతున్నారు. విద్యార్థులకు పాఠాలు బోధించే తమకు ఇంతటి కష్టం వస్తుందనుకోలేదంటూ ఆవేదన చెందుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో కుటుంబ పోషణ కోసం కొందరు దినసరి కూలీలుగా మారగా మరికొందరు ఆటోలు నడుపుతూ, వ్యవసాయ పనులకు వెళ్తూ, కట్టెలు అమ్ముకుంటూ, కులవృత్తులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు స్పందించి, ఈ కష్టకాలంలో తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మార్చి నెల వరకే చెల్లింపు లాక్డౌన్ నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు మార్చి నెల వరకే వేతనాలు చెల్లించి, చేతులు దులుపుకున్నాయి. పాఠశాలలు ప్రారంభమైతేనే జీతాలు అనే ధోరణిలో ఉన్నాయి. కొన్నిచోట్ల ఇప్పటికే ఉపాధ్యాయులను తొలగిస్తుండగా మరికొన్ని చోట్ల అడ్మిషన్ల పేరిట టార్గెట్లు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉన్నత విద్యనభ్యసించి, గురువులుగా గుర్తింపు పొందిన వారు నేడు కూలీ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. 10 శాతం మంది ఆన్లైన్లో బోధన ఇటీవలి కాలంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్లో క్లాస్‌లను చెప్పడం ప్రారంభించాయి. ఒక్కో బడిలో 10 శాతం మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి, వారితో పాఠాలు చెప్పిస్తున్నారు. ఇలా ఆన్లైన్లో బోధించేవారికి వేతనాలు ఇచ్చేందుకు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. మిగతా ఉపాధ్యాయుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. టైలరింగ్ పని చేస్తున్నా.. మాది పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల. బీఎస్సీ, బీఈడీ చేసిన. పదేళ్లుగా పలు ప్రైవేటు స్కూళ్లలో టీచర్‌గా పని చేస్తున్నాను. లాక్డౌన్ కారణంగా మూతపడిన పాఠశాల ఇప్పటికీ తెరుచుకోలేదు. మాకు యాజమాన్యాలు ఏప్రిల్, మే నెలల వేతనాలు ఇవ్వలేదు. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారడంతో టైలరింగ్ పని చేస్తున్నా. ప్రభుత్వం స్పందించి, ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలి. – బాలవేణి రాణి, ప్రైవేట్ టీచర్ బీడీలు చుడుతున్నా.. మాది రేకుర్తి పరిధిలోని సాలెగనర్. నేను ఎంఏ బీఈడీ చేసిన. ఆరేళ్లుగా ఒక ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నా. కరోనా కారణంగా జూన్ నెల గడిచిపోతున్నా పాఠశాల తెరుచుకోలేదు. మూడు నెలలుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నాం. బీడీలు చుట్టడం నాకు తెలిసిన పని కావడంతో ప్రస్తుతం అదే చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నా. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. – నౌసీన్, ప్రైవేట్ టీచర్ మాస్కులు కుడుతున్నా.. మాది కొండపల్కల గ్రామం. నేను ఎంఏ. బీఈడీ చదివిన. 20 ఏళ్లుగా ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా. మార్చి నెల నుంచి వేతనాలు రాకపోవడంతో కుటుంబం గడవని పరిస్థితి నెలకొంది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో మాస్కులు కుడుతూ కాలం వెల్లదీస్తున్నా. ఈ విపత్కర కాలంలో పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వం వేతనాలు అందించి ఆదుకోవాలి. – పచ్చునూరి శ్రీనివాస్, ప్రైవేట్ టీచర్ కూలీ పనులకు వెళ్తున్నా.. మా స్వగ్రామం తిమ్మాపూర్. బీఏ బీఈడీ చదివిన. 15 ఏళ్లుగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నా. ప్రస్తుతం పాఠశాలలు తెరుచుకోక పోవడంతో కూలీ పనులకు వెళ్తున్నా. కరోనా వైరస్ ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితాలను ఆగం చేసింది. కుటుంబ పోషణ భారమవుతోంది. ప్రభుత్వం మాపై దయచూపి, ఆర్థికసాయం అందించి అండగా నిలవాలి. – వినయ్‌కుమార్, ప్రైవేట్ టీచర్ -
మీరందరూ సూపర్ హీరోలే: అనిల్ కపూర్
కరోనా పోరాటంలో బాధితుల్ని ఆదుకోవడానికి ఏర్పాటు చేసి లైవ్ కాన్సర్ట్ ‘ఐ ఫర్ ఇండియా’ కార్యక్రమాన్ని వీక్షించి, విరాళాన్ని అందించిన ప్రతి ఒక్కరికి బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన రెండు రోజుల అనంతరం అనిల్ కపూర్ మంగళవారం సోషల్ మీడియాలో లైవ్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఐ ఫర్ ఇండియా’లో తన పార్ఫామెన్స్కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఐ ఫర్ ఇండియా’ను చూసి విరాళాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు చూడని వారు సైతం చూసి విరాళాలు ఇవ్వాలని కోరారు. కరోనావైరస్కు వ్యతిరేకంగా చేస్తున్నపోరాటానికి తోచినంత సహాయం అందించాలని ప్రజలలను కోరారు. (రూ. 200 చెల్లిస్తే నాతో డ్యాన్స్ చేయొచ్చు : హీరోయిన్) అదే విధంగా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉంటున్న రోజువారీ వేతన కార్మికులు, వలస కూలీలకు సహాయం అందించాలని కోరారు. విపత్కర పరిస్థితుల్లో కరోనాపై అందరూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్న ప్రతి ఒక్కరూ సూపర్ హీరోలేనని ప్రశంసించారు. కాగా కరోనాపై పోరుకు నిర్వహించిన ఐ‘ ఫర్ ఇండియా’ ఆదివారం సాయంత్రం ఫేస్బుక్లో లైవ్ షో ఇచ్చారు. ఫేస్బుక్ ద్వారా విరాళాలు సేకరించిన అతి పెద్ద కార్యక్రమంగా ‘ఐ ఫర్ ఇండియా’ నిలిచింది. 80 మంది సెలబ్రిటీలు పాల్గొన్న ఈ కార్యక్రమం ద్వారా మొత్తం రూ. 52 కోట్లు వచ్చినట్లు నిర్మాత కరణ్ జోహార్ పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని గివ్ ఇండియా సంస్థ ఆద్వర్యంలో కరోనానపై పోరాటానికి వెచ్చించనున్నారు. ఈ వీడియోలో అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, రణ్వీర్ సింగ్, కత్రినా కైఫ్, శ్రేయా ఘోషల్ తదితరులు ప్రేక్షకులను అలరించారు. (రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందో..) ‘జేమ్స్.. మీరు లేకుండా ఏదీ మాములుగా ఉండదు’ -
ఆకలితో ఎవరూ బాధపడ కూడదు
ఈ కరోనా కష్టకాలంలో వలస కార్మికులు, దినసరి కూలీల కష్టాలను తీర్చేందుకు మన వంతు సాయం చేయాలంటున్నారు తమన్నా. తన వంతుగా ముంబై మురికివాడల్లోని దాదాపు పదివేల మంది వలస కార్మికులు, దినసరి కూలీలకు ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆహారాన్ని అందిస్తున్నట్లుగా చెబుతున్నారు తమన్నా. ‘‘ఈ కరోనా మహమ్మారి కారణంగా లక్షల మంది జీవితాలు ఊహించని విధంగా దెబ్బతిన్నాయి. వ్యాక్సిన్ దొరికే వరకు సామాజిక దూరం, దేశవ్యాప్త లాక్డౌన్ విధివిధానాలను పాటించడమే కరోనా నిర్మూలనకు సరైన మార్గాలు. ప్రస్తుతం మనందరి జీవితాలపై కరోనా ప్రభావం చాలా ఉంది. తిరిగి మనందరి జీవితాలు సరైన మార్గంలోకి రావడానికి వారాలు లేదా కొన్ని నెలలు కూడా పట్టొచ్చు. ముఖ్యంగా వలస కార్మికులు, దినసరి కూలీలు ఈ కష్టకాలంలో జీవనపోరాటం చేస్తున్నారు. వారిని వారు పోషించుకోవడమే వారికి పెద్ద సవాల్‌గా మారింది. అలాంటివారు ఆకలితో బాధ పడకూడదని ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి నా వంతుగా నేను సాయం చేస్తున్నాను. మనందరం ఆ కష్టజీవులకు అండగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు తమన్నా. -
నిరుపేదల కోసం ‘రిలయన్స్’ ముందడుగు
ముంబై : సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే నీతా అంబానీ మరో అడుగు ముందుకేసి మిషన్ అన్న సేవ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. కరోనా ఓడిపోతుంది..ఇండియా గెలుస్తుంది అనే నినాదంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ కి చెందిన రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా పేద, వలస కూలీలకు అన్నదానం చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు, ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ వెల్లడించారు. భారత్‌లో లాక్డౌన్ గడువును పొడిగించడంతో పేదలు, రోజువారీ కూలీల దయనీయ పరిస్థితులను చూసి చాలా బాధేసిందని అన్నారు. అందుకే వారికి ఆహారం అందించేందుకు మిషన్ అన్న కార్యక్రమాన్ని చేపట్టినట్లు ప్రకటించారు. దీని ద్వారా 3 కోట్ల మంది నిరుపేదలకు భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే ఓ కార్పోరేట్ సంస్థ చేస్తున్న అతి పెద్ద అన్నదాన పంపిణీ కార్యక్రమం ఇదేనని పేర్కొన్నారు. కరోనాపై పోరులో తమవంతు సాయంగా అక్షరాల 535కోట్ల రూపాయల విరాళాన్ని అందించి దాతృత్వాన్ని చాటుకుంది రిలయన్స్ సంస్థ. -
మీరే అసలైన హీరో.. కరోనాపై పోరుకు రూ.100కోట్లు
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని చుట్టుముట్టి భయకంపితం చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తితతో యావత్ ప్రపంచం ప్రమాదపుటంచుల్లో ఉన్న దశలో కరోనాతో పోరాడడానికి రూ.100 కోట్ల భారీ విరాళాన్ని వేదాంత గ్రూప్స్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ప్రకటించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. 'దేశంలో అత్యవసరం అయినపుడు ఈ నిధి ఉపయోగపడుతుంది. రోజూవారీ కూలీలకు, ఇబ్బందులు ఎదుర్కొనే వారికి తన వంతుగా ఈ సాయాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: ఈ పది రోజులే కీలకం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి వందకోట్లు ప్రకటిస్తున్నాను. చాలా మంది ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా రోజువారీ కూలీల విషయంలో నేను చాలా ఆందోళనతో ఉన్నాను. నాకు తోచినంత వారికి సాయం అందిస్తాను' అని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆయన స్పందించిన తీరుకు, ఉదాత్త హృదయానికి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'దేశం ఆపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశం కోసం మేము సైతం అంటూ ముందుకొచ్చే మీలాంటి వారే అసలైన హీరోలు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: కోవిడ్‌పై రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశాలు I am committing 100 cr towards fighting the Pandemic. #DeshKiZarooratonKeLiye is a pledge that we undertook & this is the time when our country needs us the most. Many people are facing uncertainty & I’m specially concerned about the daily wage earners, we will do our bit to help pic.twitter.com/EkxOhTrBpR — Anil Agarwal (@AnilAgarwal_Ved) March 22, 2020 -
ఏళ్ల తరబడి దినసరి బతుకులే
సాక్షి, పాడేరు (విశాఖపట్నం): ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లోని వసతిగృహాల్లో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లు రెగ్యులరైజేషన్ కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలంటూ అనేక సార్లు పోరాట చేశారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలు మినహా గత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వీరి గోడు అరణ్యరోదనగా మిగిలిపోయింది. ఏజెన్సీ 11 మండలాల్లోని 122 ఆశ్ర మ ఉన్నత పాఠశాలల వసతిగృహాలు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలకు అనుసంధానంగా 49 పోస్టుమెట్రిక్ హాస్టళ్లను గిరిజన సంక్షేమశాఖ నిర్వహిస్తోంది. వీటిలో ఏటా 44వేల మంది గిరిజన విద్యార్థులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఆశ్రమోన్నత పాఠశాలల వసతిగృహాల్లో 360 నుంచి 500 మంది వరకు ఒక్కోదానిలో ఉంటున్నారు. విద్యార్థుల సంఖ్యకనుగుణంగా సిబ్బంది లేరు. ఒక్కో హాస్టల్లో ముగ్గురేసి ఉంటున్నారు. ఒక హాస్టల్‌కు కుక్, కమాటీ, వాచ్మెన్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆశ్రమ వసతిగృహాలకు స్వీపర్ పోస్టులు మంజూరు కాలేదు. 500 మంది విద్యార్థులున్న హాస్టళ్లలో సిబ్బంది, వర్కర్ల కొరత సమస్య ఎక్కువగా ఉంటోంది. ఇటువంటి వాటిల్లో కనీసం ఆరుగురు వర్కర్లు ఉండాలి. ఉన్న ముగ్గురుతోనే నెట్టుకొస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరు అనారోగ్యానికి గురైనా ఆ రోజు విద్యార్థులకు సకాలంలో భోజనం అందని దుస్థితి నెలకొంటోంది. ప్రస్తుతం ఈ వసతిగృహాల్లో రెగ్యులర్ వర్కర్లు 125 మంది మాత్రమే ఉన్నారు. డైలీవేజ్‌పై 107 మంది, ఔట్‌సోర్సింగ్‌పై 248 మంది పనిచేస్తున్నారు. మంజూరైన వర్కర్ పోస్టుల్లో ఇంకా 80 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. కనీస వేతనానికి దూరం.. ఒక్కరోజు కూడా విరామం లేకుండా హాస్టళ్లలో పనిచేస్తున్న వీరు కనీస వేతనానికి నోచుకోవడం లేదు. ప్రస్తుతం ఆశ్రమాల్లో పనిచేస్తున్న 107 మంది డైలీవేజ్ వర్కర్లకు కలెక్టర్ గెజిట్ ప్రకారం నెలకు రూ.12,400లు, ఔట్‌సోర్సింగ్‌పై పనిచేస్తున్న 248 మంది క్యాజువల్ వర్కర్లకు 151 జీవో ప్రకారం నెలకు రూ.12వేల వేతనం పొందుతున్నారు. వీరితో పాటు సమానంగా వసతిగృహాల్లో విధులు నిర్వర్తించే రెగ్యులర్ వర్కర్లకు సీనియారిటీని బట్టి నెలకు సుమారు రూ.25వేలు నుంచి రూ. 50వేలు వరకు వేతనం పొందుతున్నారు. ఇలా దీర్ఘకాలంగా డైలీవేజ్‌పై పనిచేస్తున్న వర్కర్లకు సర్వీస్ క్రమబ ద్దీకరణ విషయంలో, వేతనాల చెల్లింపులో తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ వర్కర్లలో ఎవరైనా అనారోగ్యంతో మరణిస్తే వారి కుటుంబాలకు ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రయోజనం చేకూరడంలేదు. ఉపాధి కల్పించడం లేదు. ఇలా వీరు దిక్కుతోచని స్థితితో ఎదుగూబొదుగూ లేకుండా ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్నారు. వర్కర్లకు పనిభారం.. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో వర్కర్లకు పనిభారం ఏటేటా పెరిగిపోతోంది. ఖాళీలను భర్తీ చేయకపోవడం, పిల్లల సంఖ్య పెరగడంతో ఉన్నవారిపై పని ఒత్తిడి పడుతోంది. నాలుగైదేళ్లలో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు కొత్తగా ఆంగ్ల మాద్యమంలో విద్యార్థులను చేర్చుకున్నారు. కొన్ని యూపీ స్కూళ్లను హైస్కూళ్లుగా అప్‌గ్రేడ్ చేశారు. ఇందుకు తగ్గట్టుగా వర్కర్ పోస్టులు అదనంగా మంజూరు కాలేదు. దీనికి తోడు విద్యార్థులకు పెట్టే మెనూ కూడా పెంచారు. ఉదయం అల్పాహారంతో పాటు రెండు పూటలా భోజనం, సాయంత్రం స్నాక్స్ వండి వడ్డించడంతో వర్కర్లపై పనిభారం పడుతోంది. డైలీవేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలి.. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలి. జీవో నంబర్ 212 ప్రకారం అర్హత కలిగిన డైలీవేజ్ వర్కర్లు 100 మందికి పైగా ఉన్నాం. మృతి చెందిన డైలీవేజ్ వర్కర్ల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదు. తాము పర్మినెంట్‌కు నోచుకోకపోవడం వల్ల చాలా నష్టపోతున్నాం. అన్ని విధాల మాకు అన్యాయం జరుగుతోంది. వేసవి సెలవుల్లో డ్యూటీలు, వేతనాలు ఉండవు. జీతాలు ప్రతినెలా సక్రమంగా అందడం లేదు. విద్యార్థులు ఎక్కువగా ఉన్న హాస్టళ్లలో వర్కర్లను పెంచాలి. –పి.బాలన్న, డైలీవేజ్ వర్కర్, సీఏహెచ్ స్కూల్, తలారిసింగి రెగ్యులరైజేషన్‌కు ప్రతిపాదించాం 212 జీవో ప్రకారం అర్హులైన డైలీవేజ్ వర్కర్ల రెగ్యులరైజేషన్‌కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. హాస్టళ్లలో ఖాళీలను భర్తీ చేయాలని కోరాం. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న హాస్టళ్లలో ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక వర్కర్ చొప్పున అదనంగా వర్కర్లను నియమించేందుకు ప్రతిపాదించాం. –జి.విజయ్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్, ఐటీడీఏ, పాడేరు. -
భారతీ సిమెంట్స్‌పై తాపీ మేస్త్రీలకు అవగాహన సదస్సు
-
ఆ పిల్లలకు ఐఐటీ ఫీజులు మాఫీ
కూలీల పిల్లలు ఐఐటీలో ప్రవేశం దక్కించుకున్నా, ఫీజులు కట్టలేని దుస్థితి ఉండటంపై మోదీ సర్కారులోని మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. వాళ్లకు అడ్మిషన్ ఫీజును మొత్తం రద్దు చేయడంతో పాటు.. తర్వాత కావల్సిన సెమిస్టర్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, మెస్ ఫీజులు అన్నింటికీ స్కాలర్షిప్ కూడా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్ గఢ్ జిల్లా రెహువా లాల్ గంజ్ గ్రామస్తుడైన ధర్మరాజ్ సరోజ్ కుమారులైన రాజు, బ్రిజేష్ ఐఐటీలో 167, 410 ర్యాంకులు తెచ్చుకున్నారు. అయితే, వాళ్లకు ఒక్కొక్కళ్లకు అడ్మిషన్ ఫీజు రూ. 30 వేలు, తొలి సెమిస్టర్ ఫీజు రూ. 20 వేల చొప్పున ఇద్దరికీ కలిపి లక్ష రూపాయలు ముందే కట్టాల్సి వస్తోంది. ఈ దుస్థితిని మీడియా విస్తృతంగా వెలుగులోకి తెచ్చింది. దీంతో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించి సోదరులిద్దరికీ ఫీజులు మాఫీ చేశారు. అదే విషయాన్ని ఆ కుటుంబానికి కూడా ఆమె తెలియజేశారు. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. దాంతో ఆ సరస్వతీ పుత్రులకు లక్ష్మీకటాక్షం కూడా దొరికినట్లయింది. వాళ్ల చదువుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయాయి. @ratigirl informed family dat registration fees will b waived off n wil b eligible for scholarships dat cover tuition, mess n other charges — Smriti Z Irani (@smritiirani) June 20, 2015