జస్ట్‌ రూ.కోటి కారు కొనగలనంతే.. హీరోపై ట్రోలింగ్‌ | Harsh Vardhan Kapoor Gets Trolled For His Sad Reality | Sakshi
Sakshi News home page

Harsh Vardhan Kapoor: కేవలం లంబోర్గిని మాత్రమే కొనగలను, ఇదే విషాదం: స్టార్‌ నటుడి వారసుడు

Published Wed, May 11 2022 5:00 PM | Last Updated on Wed, May 11 2022 6:11 PM

Harsh Vardhan Kapoor Gets Trolled For His Sad Reality - Sakshi

Harsh Vardhan Kapoor Gets Trolled For His Sad Reality: బాలీవుడ్‌ సీనియర్‌ హీరో అనిల్‌ కపూర్, ఆయన కుమారుడు హర్షవర్ధన్‌ కపూర్‌ కలిసి నటించిన తాజా చిత్రం థార్. ఈ మూవీ మే 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అనిల్‌ కపూర్ తనయుడు హర్షవర్ధన్‌ కపూర్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన జీవితంలోని విషాదకరమైన వాస్తవాన్ని పంచుకున్నాడు. కానీ అదికాస్త రివర్స్‌ అయింది. హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్‌ ట్రోలింగ్‌కు దిగారు. ఈ ట్రోలింగ్‌తో నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాడు హర్షవర్ధన్ కపూర్. 

ఇంటర్వ్యూలో 'ప్రేక్షకులకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నాకు వస్తువులు కొనేందుకు నా తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టముండదు.  నాకు కావాల్సిన వాటిని నా సొంత డబ్బుతో కొనుక్కుంటాను. అందుకే నేను రూ. 3 కోట్ల ఖరీదుగల కారుకు బదులు కోటి రూపాయల లంబోర్గిని కారు కొనాల్సి వస్తుంది. నా దగ్గర ఉన్నదానికంటే పది రెట్లు ఎక్కువ ఉంటుందని మీరు అనుకుంటారు. నా దగ్గర 5 కార్లు, 30 గడియారాలు ఉంటాయని మీరు అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. ఇదే నా జీవితంలోని విషాదకరమైన వాస్తవం.' అని హర్షవర్ధన్‌ తెలిపాడు. 

చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారంలో విడుదలైన చిత్రాలు..

ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్స్‌ హర్షవర్ధన్‌ను ఆడేసుకుంటున్నారు. 'నాకు కూడా అనిల్‌ కపూర్‌ కుమారుడు హర్షవర్ధన్‌ కపూర్‌ల విచారంగా ఉండాలని ఉంది' అని ఒక యూజర్‌ ట్వీట్ చేశారు. మరొకరు అతనికున్న షూ వార్డ్‌రోబ్ చూపిస్తూ 'ఈ షూలన్ని వేసుకుని డ్రైవ్ చేయడానికి అతనికి లంబోర్గిని కారు లేదు. అదే నిజమైన బాధ.' 'ఇది చూసి ఆడిషన్స్‌కు 125సీసీ బైక్స్‌పై ఎవరు వెళ్తారు.' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

చదవండి: సమంత పాటంటే ఇష్టం: బాలీవుడ్‌ హీరో



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement