నాన్నకు చెప్పే టూ పీస్ బికినీ సీన్ చేశాను! | i took permission to wear bikney : sonam kapoor | Sakshi
Sakshi News home page

నాన్నకు చెప్పే టూ పీస్ బికినీ సీన్ చేశాను!

Published Tue, Mar 4 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 4:21 AM

నాన్నకు చెప్పే టూ పీస్ బికినీ సీన్ చేశాను!

నాన్నకు చెప్పే టూ పీస్ బికినీ సీన్ చేశాను!


 
 ‘స్కిన్‌షో చేసి అవకాశాలు సంపాదించుకునే చీప్ మెంటాలిటీ కాదు నాది...’. కాస్త బ్యాగ్రౌండ్ ఉండీ... ఇండస్ట్రీలోకొచ్చిన ఏ హీరోయిన్ అయినా ముందు చెప్పే మాట ఇదే. కానీ... అవకాశాలు తగ్గాయంటే చాలు... నిదానంగా దుస్తులు కురచై పోతుంటాయి. చివరకు ఐటమ్ సాంగులకు కూడా ‘సై’ అనేస్తారు. ఉదాహరణకు మన సోనమ్ కపూర్‌నే తీసుకోండి. ఓ డజను సినిమాలు చేసుంటుంది తను. మంచి నటి అని పేరైతే సంపాదించుకుంది కానీ, స్టార్‌గా మాత్రం గుర్తింపులేదు. అందుకేనేమో... అనిల్‌కపూర్ లాంటి సూపర్‌స్టార్ కుమార్తె అయ్యుండి కూడా టూపీస్ బికిని వేసేసింది. ‘బేవకూఫియా’ సినిమా కోసం దాదాపు మూడు నిమిషాల సన్నివేశంలో సోనమ్... టూ పీస్ బికినీలో హాట్ హట్‌గా నటించేసిందట. ఆయుష్మాన్ ఖురానా కథానాయకునిగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. సోనమ్ టూపీస్ బికినీ స్టిల్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
 
 ‘‘ఇలా బోల్డ్‌గా నటించారు. నాన్న కోప్పడతారేమో!’’ అని విలేకరులు అడిగితే -‘‘మా నాన్నకు చెప్పే చేశాను. ఆయనది విశాల హృదయం. అసలు నన్ను నటిగా ప్రోత్సహించిందే నాన్న. పాత్ర కోసం కొన్ని త్యాగాలు చేయాలని ఆయనే చెప్పారు’’ అని సమాధానమిచ్చారు సోనమ్. ఈ సినిమా తర్వాత తనకు అవకాశాలు వెల్లువెత్తుతాయని నమ్మకంగా ఉంది సోనమ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement