skin show
-
హాట్ కేక్‌ల్లా ‘షేపీ వియర్’ సేల్స్..
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ప్రముఖ అందాల తార, వ్యాపారవేత్త, మోడల్, 38 ఏళ్ల కిమ్ కర్దాషియన్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆమె ‘స్కిమ్’ పేరిట మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసిన శరీరానికి అతుక్కుపోయే మహిళల ‘షేపీ వియర్’పై పెద్ద దుమారమే రేగింది. ఎంత పాశ్చాత్య మహిళలే లక్ష్యంగా ఈ దుస్తులను తయారు చేసినప్పటికీ మరీ ఇంతగా శరీరానికి అతుక్కుపోతే ఎలా ? అన్నవాళ్లు, అమ్మాయిల అవయవ సొంపులను అచ్చంగా బయటపెట్టే ఇలాంటి దుస్తులను నిజంగా అమ్మాయిలు ధరిస్తే అబ్బాయిల గుండెలు జారిపోతాయన్నవాళ్లు, అబ్బాయిలు రెచ్చిపోతే అమ్మాయిలకు జరిగే అనర్థాల గురించి భయాందోళనలు వ్యక్తం చేసిన వాళ్లు లేకపోలేదు. ఇలాంటి మాటలను ఎప్పుడు లెక్కచేయని కర్దాషియన్ తన కొత్త డిజైన్ దుస్తులు ‘స్కిమ్’కు తానే మోడల్‌గా మార్కెటింగ్ చేసింది. మంగళవారం దుస్తులను ఆన్లైన్ ద్వారా సేల్స్‌కు పెట్టగా కొన్ని నిమిషాల్లోనే ఆమెకు ఆర్డర్ల రూపంలో రెండు మిలియన్ డాలర్లు (దాదాపు 15 కోట్ల రూపాయలు) వచ్చి పడ్డాయి. కొనుగోలుదారుల పోటీ పెరగడంతో ఆమె సేల్స్ వెబ్సైట్ కూడా ‘క్రాష్’ అయింది. తొలుత కొన్న వారికి వంద డాలర్లకే డ్రస్ అనడంతో తక్కువ ధరకు స్కిమ్ దుస్తులను దక్కించుకోవాలనుకున్న వారి మధ్య పోటీ పెరిగింది. ప్రముఖ స్కిన్ దుస్తులను తయారుచేసే ప్రముఖ బ్రాండ్ ‘స్పాంక్స్’కు ఏడాదికి 30 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంటే అందులో సగం, అంటే 50 శాతం బిజినెస్‌ను కర్దాషియన్ ఒక్క రోజులో సాధించారు. ఈ ‘స్కిమ్’ దుస్తులకు తన పేరు ధ్వనించేలా ‘కిమినో’ పెట్టాలనుకున్నారు. వివాదం తలెత్తడంతో స్కిమ్గానే పేరు మార్చారు. ఆమె ‘డబుల్ ఎక్స్ ఎస్ నుంచి 5 ఎక్స్ ఎల్’ వరకు వివిధ సైజుల్లో, వివిధ రంగుల్లో దుస్తులను విడుదల చేశారు. ఈ దుస్తుల గురించి తన అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి ఎలాంటి విమర్శలు రావడం లేదని, కేవలం విమర్శకుల నుంచి మాత్రమే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయని ఆమె తెలిపారు. తాను డిజైన్ చేసిన ఏ దుస్తుల గురించైనా ఎప్పటికప్పుడు అభిమానుల నుంచి అభిప్రాయలను స్వీకరిస్తానని, ఆ అభిప్రాయల మేరకు అవసరమైతే దుస్తుల డిజైన్ కూడా మారుస్తానని కిమ్ వివరించారు. -
గ్లామర్ అంటే స్కిన్ షో కాదు!
- నిక్కీ గల్రానీ ‘‘చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అంటుంటారు. నేను కూడా అదే కోవలోకి వస్తాను. ఇంట్లో వాళ్లు నన్ను డాక్టర్‌గా చూడాలని కలలు కన్నారు. నేను మాత్రం చదువు మధ్యలోనే మానేసి ఫ్యాషన్ రంగం వైపు వెళ్లి, సినిమా రంగానికి వచ్చా’’ అన్నారు యువ హీరోయిన్ నిక్కీ గల్రానీ. ‘బుజ్జిగాడు’, ‘సత్యమేవ జయతే’ చిత్రాల్లో నటించిన నాయిక సంజనా గల్రానీ చెల్లెలే నిక్కీ గల్రానీ. సునీల్ సరసన ‘కృష్ణాష్టమి’లో, ఆది పినిశెట్టికి జతగా ‘మలుపు’ చిత్రంలో హీరోయిన్గా నటించారామె. ఈ రెండు చిత్రాలూ ఈ శుక్రవారం విడుదల కానున్నాయి. తెలుగులో తన తొలిచిత్రమైన ‘కృష్ణాష్టమి’ విశేషాలు నిక్కీ గల్రానీ మాటల్లోనే... * చదువుతున్నప్పుడు మధ్యలో మానేసి మోడలింగ్‌లోకి వచ్చా. కేవలం 10 నెలల్లో 45 యాడ్స్ చేశా. ‘1983’ అనే మలయాళ చిత్రం ద్వారా సినిమా రంగానికి వచ్చా. మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో రెండున్నరేళ్లలో 15 సినిమాలు చేశా. * మలయాళంలో చేస్తున్నప్పుడు నిర్మాత ‘దిల్’ రాజుగారి ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. కానీ, మలయాళ చిత్రం పూర్తయ్యేవరకు కుదరదని చెప్పా. తరువాత ‘దిల్’రాజుగారు ఫోన్ చేసి, ‘నెల తరువాతే షూటింగ్’ అని చెప్పడంతో ఓకే అనేశా. అలా తెలుగులో ‘కృష్ణాష్టమి’ నా మొదటి చిత్రమైంది. * ఈ చిత్రంలో పల్లవి అనే పాత్ర చేశా. ‘పల్లవిజం’ అనే బుక్ రాస్తుంటా. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉందనుకునే తత్త్వం. ప్రతి విషయాన్నీ పాజిటివ్‌గా తీసుకుంటుంది. * కెరీర్‌పరంగా నాకు ఏదైనా అనుమానం వస్తే మా అక్క సంజనను అడిగి, సమాధానం తెలుసుకుంటాను. నాకు అక్క అంటే అమ్మలాగ అన్నమాట! * వర్క్ పట్ల డెడికేషన్ ఉన్న వ్యక్తి హీరో సునీల్. ఆయన వద్ద నుంచి చాలా నేర్చుకున్నా. విదేశాల్లో రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలో వణుకొచ్చే చలిలో కూడా ఆయన ఉదయాన్నే 4 గంటలకు లేచి జాగింగ్‌కు వెళ్లొచ్చేవారు. నేను చాలా సహనంగా ఉంటాను. ఇక, మా డెరైక్టర్ వాసువర్మగారైతే చెప్పనక్కర్లేదు. ఎలాంటి పరిస్థితినైనా చాలా కూల్‌గా హ్యాండిల్ చేస్తారు. * ఏ సినిమా చేసినా నా పాత్రకూ, నా నటనకూ ప్రాధాన్యం ఉండాలి. నా సినిమాలు కుటుంబమంతా కలిసి చూసేలా ఉండాలి. అటువంటి పాత్రలైతేనే ఎంచుకుంటా. నా దృష్టిలో గ్లామర్ అంటే స్కిన్ షో కాదు. అమ్మాయిలను చీరలో కూడా అందంగా చూపొచ్చు. ఈ చిత్రంలో స్కర్ట్స్, జీన్స్ వేసుకున్నా అందంగా ఉంటుంది. ఎక్కడా అసభ్యత ఉండదు. * తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నా. తెలుగులో కూడా అవకాశాలొస్తున్నాయి. ఇంకా ఏ చిత్రం ఒప్పుకోలేదు. ‘కృష్ణాష్టమి’ రిలీజ్ తర్వాత ఖరారు చేస్తా. -
ఇప్పటికైనా అర్థం చేసుకుంటారేమో: సన్నీ లియోన్
రాగిణి ఎంఎంఎస్2 చిత్రం విడుదలైన తర్వాత.. ఇది చూసైనా భారతీయులు తన నటన గురించి అర్థం చేసుకుంటారేమోనని సెక్సిణి సన్నీ లియోన్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తనకు కేవలం అంగాంగ ప్రదర్శనే కాదు.. నటన కూడా వచ్చని వాపోతోంది. 'నా నటనను గురించి విమర్శించేవారి, నా గురించి చెడ్డగా మాట్లాడేవాళ్ల నోళ్లు మూయించగలనో లోనే నాకు తెలియదు. కానీ, ఈ సినిమాలో నన్ను చూసిన తర్వాత మాత్రం నా నటన గురించి వాళ్లు తమ ఆలోచనలు మార్చుకుంటారేమో' అని సన్నీ విలేకరులతో చెప్పింది. ముంబైలోని గైటీ గెలాక్సీ థియేటర్లో ప్రేక్షకులతో కలిసి ఆమె తన రాగిణి ఎంఎంఎస్2 సినిమా చూసింది. 2012లో జిస్మ్ 2 చిత్రంతో సన్నీ బాలీవుడ్‌లోకి ప్రవేశించి, గత సంవత్సరం జాక్పాట్లో మెరిసింది. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టాయి. ఆమెకు నటన అంటే ఏంటో తెలియదని కూడా అందరూ అన్నారు. అయినా రాగిణి ఎంఎంఎస్2లో మాత్రం తాను నటిగా చాలా మెరుగుపడ్డానని సన్నీ లియోన్ భావిస్తోంది. కెమెరా ముందుకు రావడానికి తాను మరింత సౌఖ్యంగా భావిస్తున్నట్లు చెప్పింది. ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశం షూటింగ్ సమయంలో తన శరీరం మొత్తం పూర్తిగా అలసిసొలసి పోయిందని, అనేక గాయాలు అయ్యి.. రక్తం కూడా కారిందని తెలిపింది. ఆమె కష్టానికి కొంతమేర ఫలితం కూడా కనిపిస్తోంది. ఏక్తాకపూర్ నిర్మించి, భూషణ్ పటేల్ దర్శకత్వం వహించిన రాగిణి ఎంఎంఎస్2 చిత్రానికి బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు బాగానే కనిపిస్తున్నాయి. -
నాన్నకు చెప్పే టూ పీస్ బికినీ సీన్ చేశాను!
‘స్కిన్‌షో చేసి అవకాశాలు సంపాదించుకునే చీప్ మెంటాలిటీ కాదు నాది...’. కాస్త బ్యాగ్రౌండ్ ఉండీ... ఇండస్ట్రీలోకొచ్చిన ఏ హీరోయిన్ అయినా ముందు చెప్పే మాట ఇదే. కానీ... అవకాశాలు తగ్గాయంటే చాలు... నిదానంగా దుస్తులు కురచై పోతుంటాయి. చివరకు ఐటమ్ సాంగులకు కూడా ‘సై’ అనేస్తారు. ఉదాహరణకు మన సోనమ్ కపూర్‌నే తీసుకోండి. ఓ డజను సినిమాలు చేసుంటుంది తను. మంచి నటి అని పేరైతే సంపాదించుకుంది కానీ, స్టార్‌గా మాత్రం గుర్తింపులేదు. అందుకేనేమో... అనిల్‌కపూర్ లాంటి సూపర్‌స్టార్ కుమార్తె అయ్యుండి కూడా టూపీస్ బికిని వేసేసింది. ‘బేవకూఫియా’ సినిమా కోసం దాదాపు మూడు నిమిషాల సన్నివేశంలో సోనమ్... టూ పీస్ బికినీలో హాట్ హట్‌గా నటించేసిందట. ఆయుష్మాన్ ఖురానా కథానాయకునిగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. సోనమ్ టూపీస్ బికినీ స్టిల్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ‘‘ఇలా బోల్డ్‌గా నటించారు. నాన్న కోప్పడతారేమో!’’ అని విలేకరులు అడిగితే -‘‘మా నాన్నకు చెప్పే చేశాను. ఆయనది విశాల హృదయం. అసలు నన్ను నటిగా ప్రోత్సహించిందే నాన్న. పాత్ర కోసం కొన్ని త్యాగాలు చేయాలని ఆయనే చెప్పారు’’ అని సమాధానమిచ్చారు సోనమ్. ఈ సినిమా తర్వాత తనకు అవకాశాలు వెల్లువెత్తుతాయని నమ్మకంగా ఉంది సోనమ్.